Pawan Kalyan constitutes women committees జనసేన వీర మహిళా విభాగం చైర్ పర్సెన్ గా జవ్వాని రేఖ

Pawan kalyan urges central state govts to do justice to fake univesity students

pawan kalyan, janasena, Pawan Kalyan on american indians, jana sena on american indians, javvani rekha, jana sena womens wing, veera mahila, andhra pradesh, politics

Pawan Kalyan has instituted women's committees in Jana Sena. The inclusion process was cumbersome and meticulous. "With this revamp, we are tightening the loose structure that has been there so far.

‘‘అమెరికాలోని భారత విద్యార్థుల విడుదలకు చర్యలు చేపట్టండీ’’

Posted: 02/01/2019 08:58 PM IST
Pawan kalyan urges central state govts to do justice to fake univesity students

అమెరికాలో నకిలీ విద్యార్థి వీసా రాకెట్ లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులకు అవసరమైన న్యాయసాయం అందించాలని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. ఆశల సుడిగుండంలో చిక్కుకుని అమెరికాకు వెళ్లిన భారతీయ విద్యార్థులు, అక్కడి ఇమిగ్రేషన్‌ అధికారులు అదుపులోకి తీసుకున్న ఘటనపై అయన స్పందించారు. భారతీయ విద్యార్థులను అగ్రరాజ్యం ఎలాంటి కేసులు, విచారణ లేకుండా విడిచిపెట్టేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈ మేరకు జనసేన పార్టీ తరపున పవన్ కల్యాణ్ ఓ ప్రకటన విడుదల చేశారు. యూఎస్ లో ఎంఎస్‌ చదివేందుకు వెళ్లి కేసుల్లో చిక్కుకోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారని అన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులలో ఎక్కువ మంది వ్యాధిగ్రస్తులే వున్నారని, తమ పిల్లలపై కలవరం చెందుతూ వారి అరోగ్యాలు మరింతగా క్షీణిస్తున్నాయని ఆయన అన్నారు. అరెస్ట్ అయినవారిలో ఎక్కువమంది తెలుగువారు ఉన్నారన్న వార్తలు బాధిస్తున్నాయని పేర్కొన్నారు.

అమెరికా ప్రభుత్వమే మిచిగన్ రాష్ట్రంలో నకిలీ విశ్వ విద్యాలయం ఏర్పాటు చేసి, విద్యార్థులను ట్రాప్ చేసి అందులో చేరిన విద్యార్థులను అదుపులోకి తీసుకోవడం విచారకరమని ఆరోపించారు. ఈ విషయంలో ఇబ్బంది పడుతున్న విద్యార్థులకు అవసరమైన సాయాన్ని అందించాలని ఎన్నారై జనసేన ప్రతినిధులకు విజ్ఞప్తి చేస్తున్నట్టు ఆ ప్రకటనలో తెలిపారు. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థులకు కళాశాల దశ నుంచే అవగాహన శిబిరాలను నిర్వహించాల్సిన బాధ్యతను విద్యా శాఖతోపాటు కళాశాలలు తీసుకోవాలని పవన్ కల్యాణ్ సూచించారు.

పార్టీ కేంద్ర కమిటీతో పాటు ప్రెసిడెంట్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ డివిజన్ ను ఏర్పాటు చేసిన విషయాన్ని ఓ ప్రకటనలో తెలిపారు. ఇందులో అనేక ప్రజాపయోగ కౌన్సిల్స్, కమిటీలను ఏర్పాటు చేశారు. వీటిలో సుమారుగా 22 కమిటీలలో మహిళలకు తొలి విడతగా చోటు కల్పించారు. ప్రస్తుతం పదవులు పొందిన వారంతా నవ వయస్కులు, విద్యాధికులు, డాక్టర్లు, లెక్చరర్లు, న్యాయవాదులు, ఐ.టి.నిపుణులతోపాటు గృహిణిలు కూడా వీరిలో వున్నట్టు పేర్కొంది.

తమ కెరీర్ ను వదులుకుని ప్రజా సేవ కోసం వచ్చిన ఆడపడుచులు ఎందరో వీరిలో ఉన్నారని, ఇది తొలి జాబితా మాత్రమేనని తెలిపింది. వీర మహిళ (విమెన్ వింగ్) విభాగంతో పాటు పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ, పార్లమెంటరీ ఎగ్జిక్యూటివ్ కమిటీ, పార్లమెంటరీ వర్కింగ్ కమిటీ, పార్టీ క్రమశిక్షణా కమిటీ, ప్రొటోకాల్స్ కమిటీ, సెంట్రల్ ఆఫీస్ గ్రీవెన్స్ కమిటీ  వివిధ కమిటిల్లో మహిళలకు స్ధానం కల్సించినట్టు పేర్కొంది.

జనసేన మహిళా విభాగాన్ని ఏర్పాటు చేసి దానికి జనసేన వీర మహిళా సంఘంగా నామకరణం చేసిన విషయం తెలిసిందే. తాజాగా జవ్వాని రేఖను మహిళా విభాగానికి చైర్ పర్సన్ గా నియమించారు. కర్నూలు జిల్లాకు చెందిన జవ్వాని రేఖ ఆడిటర్‌గా పనిచేస్తున్నారు. జనసేన విజన్, మ్యానిఫెస్టో అంశాలను ఆమె విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు.

దీంతో ఆమెకు అకుంఠితత్వం, పట్టుదలను పరిశీలించిన జనసేన పార్టీ అమెకు ఈ బాధ్యతలు అప్పగించింది. వైస్ చైర్మన్లుగా భీమవరానికి చెందిన సింధూరి కవిత , షేక్ జరీనా, నూతాటి ప్రియా సౌజన్య, జి.శ్రీవాణి నియమితులైనట్టు తెలిపారు. కాగా, బీసీ సమాజానికి చెందిన రేఖను చైర్ పర్సన్‌గా నియమించటం ద్వారా మహిళలకు సముచిత స్థానం కల్పించినట్టు పార్టీ నేతలు వెల్లడించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  janasena  javvani rekha  jana sena womens wing  veera mahila  andhra pradesh  politics  

Other Articles