Chanda Kochhar booked in Videocon loan case చందా కొచ్చార్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు.. సీబిఐ కేసు..

Cbi files case against former icici bank chief chanda kochhar

VIDEOCON CASE, CHANDA KOCHHAR, cbi raids videocon offices, icici bank-videocon case, chanda kochhar, Deepak kochhar, Venugopal Dhoot, CBI, crime

CBI has reportedly registered a case against ICICI Bank's former MD & CEO Chanda Kochhar in the high-profile Videocon loan case, amid allegations of impropriety in giving a loan to a company related to her husband's business.

చందా కొచ్చార్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు.. సీబిఐ కేసు..

Posted: 01/24/2019 05:02 PM IST
Cbi files case against former icici bank chief chanda kochhar

క్విడ్ ప్రోకో కింద అధికార దుర్వినియోగానికి పాల్పడి వీడియోకాన్ సంస్థకు రూ.3,250 కోట్ల రూపాయల రుణాలను మంజూరు చేసి ఫలితంగా తన భర్తకు చెందిన పరిశ్రమలో కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టించారన్న అభియోగాలపై ఐసీఐసీఐ బ్యాంకు సీఈఓ పదవి నుంచి తప్పుకున్న చందా కొచ్చర్ చుట్టూ ఉచ్చు బిగుస్తుంది. ఈ హైప్రోఫైల్ కేసులో చందా కొచ్చార్ తో పాటు ఆమె భర్త దీపక్‌ కొచ్చర్ లపై సీబీఐ కేసు నమోదు చేసింది.

వీడియకాన్‌ గ్రూప్స్‌ ఎండీ వేణుగోపాల్‌‌ ధూత్ పై కూడా సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన సీబీఐ.. వీడియోకాన్‌ రుణాలకు సంబంధించిన కేసులో నిందితులుగా ఆరోపిస్తూ వీరిపై కేసులు పెట్టింది. ఇందులో భాగంగా ఇవాళ ఉదయం మహారాష్ట్రలోని ముంబయి, ఔరంగాబాద్ లలో ఉన్న వీడియోకాన్ కార్యాలయాలపై సీబీఐ దాడులు నిర్వహించింది. తన భర్త కంపెనీలో పెట్టుబడులు పెట్టిన చాలా రోజుల తరువాత వీడియోకాన్ సంస్థకు రుణాలు మంజూరు జరిగిందని కూడా సీబీఐ పేర్కోనింది.

వీడియోకాన్‌ గ్రూప్‌ రుణాల అవకతవకల వివాదం కారణంగా చందా కొచ్చర్‌ గత ఏడాది అక్టోబరులో ఐసీఐసీఐ బ్యాంకు సీఈఓ పదవి నుంచి తప్పుకున్నారు. 2012లో వీడియోకాన్ గ్రూప్‌ రూ.3,250కోట్ల రుణాలు పొందిందని, దీని వల్ల కొచ్చర్‌ కుటుంబం లాభపడిందని ఆరోపణలు రావడంతో విషయం వివాదాస్పదమైంది. చందా కొచ్చర్‌ భర్తకు చెందిన కంపెనీలో వీడియోకాన్ ఎండీ వేణుగోపాల్‌ కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టిన నెలల తర్వాత వీడియోకాన్‌కు రుణం మంజూరైనట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఈ అంశాన్ని సీబీఐ విచారణకు చేపట్టింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : icici bank-videocon case  chanda kochhar  Deepak kochhar  Venugopal Dhoot  CBI  crime  

Other Articles