BJP calls EVM row Congress sponsored ఈవీఎం హ్యాంకింగ్ ను ఖండించిన ఈసీ, పార్టీల మిశ్రమ స్పందన

Rs prasad corners cong on allegations made at evm hackathon

Syed Shuja cyber expert, 2014 general elections, BJP Hacking EVM, Reliance EVMs, Reliance Communication, union minister BJP, Ravi Shanker prasad, Gopinath Munde, journalist Gauri Lankesh, Kapil sibal, mamta banerjee, mayawati, akilesh yadav, mukthar abbas naqvi, Hyderabad, crime

The BJP alleged that the EVM hackathon in London was a "conspiracy" sponsored by the Congress to defame the country's election process.

ఈవీఎం హ్యాంకింగ్ వార్తలను ఖండించిన ఈసీ, పార్టీల మిశ్రమ స్పందన

Posted: 01/22/2019 03:32 PM IST
Rs prasad corners cong on allegations made at evm hackathon

ఎన్నికల్లో భారత ఎన్నికల కమిషన్ ఉపయోగించిన ఈవీఎంలు లోపరహితమైనవని కేంద్ర ఎన్నికల సంఘం పునరుద్ఘాటించింది. ఈ ఈవీఎంలను భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బీఈఎల్), ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్)లలో పటిష్ట పర్యవేక్షణ, భద్రతల మధ్య తయారు చేసినవని చెప్పుకోచ్చింది. అయితే లండన్ నుంచి సయ్యద్ షుజా ఈవీఎంలు ట్యాపరింగ్ అయ్యాయ్యయి.. వాటితోనే బీజేపి గత పర్యాయం అధికారంలోకి వచ్చిందని అరోపణలు చేయడాన్ని ఈసీ తీవ్రంగా ఖండించింది.

2010లోనే ఏర్పాటు చేసిన ప్రముఖ సాంకేతిక నిపుణుల కమిటీ పర్యవేక్షణలో అన్ని దశలనూ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్లను క్షుణ్నంగా పరిశీలించారు'' అని ఒక ప్రకటనలో వివరించింది. అయితే ఈవీఎంల పటిష్టభద్రతపై పలు సందేహాలను వ్యక్తం చేసిన సయ్యద్ అరోపణలకు సంబంధించి చట్టపరంగా ఎటువంటి చర్యలు చేపట్టవచ్చుననే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు పేర్కొంది. సయ్యద్ పై చట్టరిత్యా చర్యలు తప్పక తీసుకుంటామని చెప్పింది.

ట్యాంపరింగ్ కాంగ్రెస్ అడించిన డ్రామా: బీజేపీ

లండన్ లో సైబర్ నిపుణుడు సయ్యద్ షుజా చేత ఈవీఎం ట్యాపరింగ్ డ్రామాను అడించిన కాంగ్రెస్ దానిని అంతగా రక్తికట్టించలేకపోయిందని కేంద్రమంత్రి రవిశంకర్ ఫ్రసాద్ హ్యాకింగ్ వార్తలను తిప్పికోట్టారు. దేశప్రజల తీర్పును కాంగ్రెస్ అవమానించిందని ఆయన విమర్శించారు. ఈవీఎంల పటిష్టతపై ఈసీ ఇప్పటికే పలుమార్లు స్పష్టత ఇచ్చినా కాంగ్రెస్ పట్టించుకోవడం లేదని ఆయన మండిపడ్డారు. ఇక యూఎస్ సైబర్ నిపుణుడైన సయ్యద్ షుజా పేరును గత నాలుగున్నరేళ్ల కాలంలో తానెప్పుడు వినలేదని వ్యంగంగా వ్యాఖ్యలు చేశారు.

కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు నుంచే ఈవీఎంలను తప్పుపట్టటం మొదలుపెట్టిందని కేంద్రమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు ముక్తార్ అబ్బాస్ నఖ్వీ ఎద్దేవా చేశారు. ''దేశంలో వాతావరణం ఎలా ఉందో ఆ పార్టీకి అర్థమైనట్లు ఉంది. కాంగ్రెస్ ప్రతికూల రాజకీయాలతో 2019లో ఏం జరగబోతోందో తెలిసిపోయినట్లు ఉంది'' అని విమర్శించారు. లండన్ లో మీడియా సమావేశానికి ఎంపీ కపిల్ సిబల్ ను కాంగ్రెస్ పార్టీ, సోనియాగాంధీ, రాహుల్ గాంధీలు పంపించారని ముక్తార్ అబ్బాస్ నఖ్వీ ఆరోపించారు. దేశాన్ని, దేశ ప్రజస్వామ్య వ్యవస్థను అవమానించటం వారి పని అని విమర్శించారు.

ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి: మమతా బెనర్జీ

ఇదిలావుంటే.. ఈవీఎంల విషయమై లండన్‌లో ఆరోపణలు వచ్చిన తర్వాత.. దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ పశ్చిమ బంగ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ట్వీట్ చేశారు. ''ప్రతి ఓటూ ఎంతో విలువైనది. యునైటెడ్ ఇండియా సభలో ప్రతిపక్ష పార్టీలన్నీ ఈవీఎం అంశం గురించి మాట్లాడాయి. ఈ అంశాన్ని ఎన్నికల కమిషన్ ముందుకు తీసుకెళ్లాలని జనవరి 19వ తేదీనే అన్ని పార్టీలూ కలిసి నిర్ణయించాయి'' అని పేర్కొన్నారు.

అందోళనలో ప్రజానికం.. ప్రజాస్వామ్యం ట్యాపరింగ్: మాయావతి

ఈవీఎంల వ్యవహారంలో బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయవతి స్పందించారు. మళ్లీ బ్యాలెట్ పేపర్ వ్యవస్థను అమల్లోకి తీసుకురావాలని అన్నారు. ప్రజాస్వామ్య విస్తృత ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని ఈవీఎంల అంశాన్ని ఈసీ పరిశీలించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. బ్యాలెట్ పేపర్‌ ను అయితే సరిచూసుకోవచ్చని, ఈవీఎంను సరిచూసుకోవడం కుదరదని ఆమె అన్నారు. 2019 ఎన్నికలను బ్యాలెట్ పేపర్లతోనే ఎన్నికల సంఘం నిర్వహించాలని కోరారు.
 
'సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎం ట్యాంపరింగ్‌తో దేశ ప్రజలు బెంబేలెత్తారు. తమ ఓటు తమది కాకుండా పోయిందనే అభిప్రాయానికి వచ్చారు. వారి ఓట్లను వివిథ గ్రూపులు లూటీ చేసాయి. ఆ కారణంగానే బీజేపీ అటు కేంద్రంలోనూ, అత్యధిక రాష్ట్రాల్లోనూ అదికారంలోకి రాగలిగింది. పేదలు, కష్టపడి పనిచేసే ప్రజానీకం భవిష్యత్తు ఆందోళనలో పడేలా వాళ్లు చేశారు' అని మాయావతి ఆరోపించారు.

ప్రజాస్వామ్య పటిష్టతకు ముప్పు: అఖిలేష్

పటిష్ట ప్రజాస్వామ్యా వ్యవస్థకు ఈవీఎంల హ్యాకింగ్ ఆరోపణలతో ముప్పువాటిల్లుతుందని ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ అన్నారు. ఈవీఎంలతో ముప్పు ఉన్నందున వాటికి ప్రత్యామ్నాయం తీసుకొచ్చే ఆలోచన చేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. జపాన్ వంటి అభివృద్ధి చెందిన దేశం ఈవీఎంలను ఎందుకు ఉపయోగించడం లేదనే విషయాన్ని తప్పనిసరిగా పరిశీలించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇది ప్రజాస్వామ్యంపై విశ్వాసానికి సంబంధించిన ప్రశ్న అని, దీనిపై ఎన్నికల సంఘం, ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకోవాలని అఖిలేష్ అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Syed Shuja  BJP  Ravi Shanker prasad  mamta banerjee  mayawati  akilesh yadav  mukthar abbas naqvi  crime  

Other Articles