Mumbai bar dancers hail SC verdict ముంబైలో బార్లా తెరుచుకోనున్న డాన్సింగ్ బార్లు..

Sc allows tips to bar dancers but bars showering of currency notes

Supreme court on dance bars, mumbai dance bar, Dance bars in Mumbai, Dance bars, dance bar ban, Maharashtra Government, dance bars, mumbai, Supreme Court, verdict

Bar dancers, who were abruptly rendered jobless after the Maharashtra government shut down dance bars on August 15, 2005, hailed the Supreme Court verdict permitting conditional re-opening of these joints,

ముంబైలో బార్లా తెరుచుకోనున్న డాన్సింగ్ బార్లు..

Posted: 01/17/2019 02:56 PM IST
Sc allows tips to bar dancers but bars showering of currency notes

దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు డ్యాన్స్ బార్లపై కీలక తీర్పు వెలువరించింది. డాన్సు బార్ల నిర్వాహకులకు కొండంత ఉపశమనాన్ని ప్రకటించింది. డాన్సు బార్లు, డాన్సు గర్ల్స్ ఆటలు ఇకపై యధేశ్చగా నిర్వహించుకునేలా కీలక తీర్పును వెలువరించింది. తాజాగా తీర్పు ప్రకారం బార్లలో మందుబాబులు స్వేచ్ఛగా మందుకొట్టొచ్చు, యథేచ్ఛగా చిందులేయొచ్చు... కావాలంటే డ్యాన్సర్లతో కలిసి నచ్చినట్టుగా స్టెప్పులు కూడా వేయొచ్చు. కానీ బార్ డ్యాన్సర్ పై నోట్లు విసిరడం మాత్రం నిషేధించరాదని తీర్పును వెలువరించింది.

దేశవ్యాప్తంగా బార్లలో డ్యాన్సులు చేయడంపై గతంలో నిషేధం విధించిన అత్యున్నత న్యాయస్థానం ఇవాళ మాత్రం సంచలన తీర్పును వెలువరించింది. దేశవ్యాప్తంగా వున్న నిషేధం దేశ అర్ధిక రాజధాని మాత్రం వర్తించదని స్పష్టం చేసింది. బార్ గర్ల్స్, బార్ డాన్సర్లకు ఈ నిషేధం నుంచి మినహాయింపు లభించడంతో డాన్స్ బార్ల నిర్వాహకులు హర్షం వ్యక్తం చేశారు. అయితే డ్యాన్సింగ్ బార్‌లకు కొన్ని కఠిన నియమాలు పెడుతూ 2016 తీర్పు వెలువరించింది సుప్రీంకోర్టు.

అయితే గతంలో ఇచ్చిన తీర్పుకు విధించిన ఆంక్షలను కూడా కొట్టివేసిన న్యాయస్థానం.. బార్లలో మద్యం సేవించేందుకు, డిస్కోలు వేయడం, డాన్సర్లతో స్టెపులు వేయడం వంటివాటిని అనుమతిస్తూ తీర్పును వెలువరించింది. ఇక బార్లలో తప్పనిసరిగా సిసిటీవీలు ఏర్పాటు చేయాలన్న అంక్షను కూడా న్యాయస్థానం కోట్టివేసింది. మహారాష్ట్ర డ్యాన్స్ బార్స్‌లో సీసీటీవీ కెమెరాల ఏర్పాట్ల వల్ల వ్యక్తిగత స్వేచ్ఛకు భంగంవాటిల్లుతుందని అభిప్రాయపడింది సర్వోన్నత న్యాయస్థానం.

అంతేకాకుండా కస్టమర్లు కూడా యథేచ్ఛగా డ్యాన్సులు చేసుకోవచ్చని, కావాలంటే డిస్కోలు, ఆర్కెస్ట్రాలు కూడా ఏర్పాటు చేసుకోవచ్చని బార్ల యజమానులకు వరాలు ప్రసాదించింది. అయితే బార్ డ్యాన్సర్లపై నోట్ల కట్టలు విసరడాన్ని మాత్రం నిషేధించింది సుప్రీం. ఇది స్త్రీలను అవమానించడమేనని భావించిన సుప్రీం... డ్యాన్సర్లకు వచ్చే టిప్స్‌కు కత్తెర వేసింది. అలాగే దేవాలయాలు, పుణ్యక్షేత్రాలకు, విద్యాలయాలకు కనీసం 1 కి.మీ. దూరంలో బార్లు ఏర్పాటు చేయాలని... బార్ రూమ్‌కీ, డ్యాన్స్‌ ఫోర్ల్‌ వేర్వేరుగా ఉండాలని తెలిపింది. డ్యాన్స్ బార్లకు సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 11:30 మధ్యలోనే నడిపాలని ఆదేశిస్తూ తీర్పు వెలువరించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : dance bars  mumbai  Supreme Court  verdict  maharashtra government  

Other Articles