Congress senior leader Naba Kishore Das to join BJD కాంగ్రెస్ కు ఎదురుదెబ్బ.. బీజేడిలోకి సీనియర్ నేత

Odisha congress working president naba kishore das resigns

Rahul Gandhi, Naveen Patnaik, Naba Kishore Das, Prakash Chandra Behera, Koraput, Jharsuguda, Krishna Chandra Sagaria, Jogesh Singh, Chhattisgarh, Biju Janata Dal, politics

Dealing a major blow to Congress ahead of Rahul Gandhi’s pre-election tour to Odisha on January 25, the party’s state working president and Jharsuguda MLA Naba Kishore Das resigns to party to join ruling party BJD.

కాంగ్రెస్ కు ఎదురుదెబ్బ.. బీజేడిలోకి సీనియర్ నేత

Posted: 01/17/2019 10:31 AM IST
Odisha congress working president naba kishore das resigns

రానున్న సార్వత్రిక ఎన్నికలలో దేశంలో అధికార మార్పు సాధ్యం అవుతుందని, తమ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాని పగ్గాలను చేపడతారని ఓ వైపు కాంగ్రెస్ పార్టీ ప్రకటనలు గుప్పిస్తుంటే.. దేశంలోని పలు రాష్ట్రాలలో అందుకు భిన్నమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇప్పటికే కర్ణాటకలోని రాజకీయాలను బీజేపి ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా అకట్టుకునే ప్రయత్నాలను సాగిస్తున్న క్రమంలోనే ఇటు ఒడిశాలోనూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అధికార పార్టీ బీజేడిలోకి దూకుతున్నారు.

ఇప్పటికే ఒడిశా రాష్ట్ర కాంగ్రెస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఝర్సుగుడ ఎమ్మెల్యే నబ కిశోర్‌దాస్‌ కాంగ్రెస్‌ పార్టీ పదవికి రాజీనామా చేశారు. పార్టీ అధ్యక్షపదవితో పాటు ప్రాథమిక సభ్యత్వాన్ని సైతం వదులుకుంటున్నట్లు తెలిపారు. ఈ మేరకు పార్టీ చీఫ్‌ రాహుల్‌ గాంధీకి తన రాజీనామా లేఖ పంపారు. పార్టీలో తనకు ఎవరితోనూ విరోధం లేదని, నియోజక వర్గం అభివృద్ధి కోసం తాను అధికార బిజూ జనతాదళ్‌ (బీజేడీ)లో చేరుతున్నట్లు ప్రకటించారు. సరిగ్గా ఒడిశాలో పార్టీ అధినేత రాహుల్ గాంధీ పర్యటినకు ముందురోజునే 24న ఆయన అధికార పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు.

ఇక ఇదిలావుంటూ మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే జోగేష్ సింగ్ కూడా రమారమి అలాంటి సంకేతాలనే పంపారు. తాజాగా ఆయన బీజేపి అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి నవిన్ పట్నాయక్ పై ప్రశంసలు కురిపించారు. ఆయనను సమర్థుడైన నాయకుడిగా కూడా కోనియాడారు. దీంతో ఆయన కూడా త్వరలోనే పార్టీని మారుతున్నారా.? అన్న అనుమానాలు కలుగుతున్నాయి.

ఇదిలా వుండగా, ఒడిశా కాంగ్రెస్ అధ్యక్షుడు నిరంజన్ పట్నాయక్ తో పొసగకపోవడంతో కృష్ణ చంద్ర సాగరియా కాంగ్రెస్ కు రాజీనామా చేసిన విషయం కూడా తెలిసిందే. రెండు మూడు నెలల్లో ఒడిశా అసెంబ్లీతో పాటు లోక్‌సభకు  ఎన్నికలు జరగనున్న తరుణంలో ఈ పరిణామాలు కాంగ్రెస్‌ పార్టీకి గట్టి ఎదురు దెబ్బేనని విశ్లేషకులు భావిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Naba Kishore Das  Prakash Chandra Behera  Chhattisgarh  Biju Janata Dal  politics  

Other Articles