pilot grounded for seating wife in cockpit కాకిపిట్ లోకి సతి.. జరిమానా కట్టిన ఫైలట్ పతి..

Chinese airline pilot grounded for seating wife in cockpit

Chinese airlines, Chinese Tourists, Chinese passengers, China Eastern, Shanghai, Donghai Airlines, Boeing 737 jet cockpit, Chen Guosheng

A pilot with Shenzhen-based Donghai Airlines has been fined 12,000 yuan (US$1,756) and grounded for six months pending further disciplinary action after he was seated his wife in the cockpit of a Boeing 737 jet on a flight that he commanded.

కాకిపిట్ లోకి సతి.. జరిమానా కట్టిన ఫైలట్ పతి..

Posted: 01/11/2019 01:24 PM IST
Chinese airline pilot grounded for seating wife in cockpit

వడ్డించే వాడు మనవాడైతే ఏ మూలన కూర్చుంటే మాత్రం ఏంటీ అన్న సామెతను బాగా జీర్ణంచుకున్న ఓ పైలట్.. ఆరు నెలలు ఉద్యోగానికి ఎసరు తెచ్చుకోవడంతో పాటు భారీ మెత్తాన్ని జరిమానాగా చల్లించుకున్నాడు. అసలేం చేశాడంటే.. తానే స్వయంగా పైలట్ కావడంతో విమానం గాల్లో వున్నప్పుడు నిబంధనలకు నీళ్లు వదిలి.. ఎంచక్కా తన భార్యను కాక్‌పిట్ లోకి తీసుకెళ్లాడు. అమె పూర్తి ప్రయాణం కాక్ పిట్ లోనే సాగింది.

షెంజెన్ కు చెందిన డాంఘై ఎయిర్ లైన్స్‌ కథనం ప్రకారం.. చెన్ అనే చైన్నీస్ పైలట్ గతేడాది జూలై 28న తన భార్యను కాక్ పిట్లోకి తీసుకెళ్లాడు. ఇలా రెండుసార్లు తన భార్యను కాక్ పిట్లోకి తీసుకెళ్లడంపై విమానయాన సంస్థ ఆగ్రహం వ్యక్తం చేసింది. తొలిసారి నాన్ టాంగ్ నుంచి లాంఝౌ వెళ్తున్న విమానంలో ఇలానే తీసుకెళ్లాడు. అయితే అది తొలి తప్పుగా భావించిన ఎయిర్ లైన్స్ సంస్థ అతన్ని చర్యను ఖండించినా.. తొలి తప్పుగా పరిగణించి వదిలేసింది.

దీంతో అదే తప్పును పునరావృతం చేశాడు చెన్. రెండోసారి లాంఝౌ నుంచి బీజింగ్ వెళ్తున్న విమానంలోని కాక్ పిట్ల్లోకి తన భార్యను తీసుకెళ్లి కూర్చోబెట్టాడు. భార్యకు టికెట్ తీసుకున్న చెన్ ప్రయాణం మొత్తం భార్యను తనతోపాటు కూర్చోబెట్టుకున్నాడు. చెన్ చర్యలను తీవ్రంగా పరిగణించిన విమానయాన సంస్థ క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. భవిష్యత్తులో మరెవరూ నిబంధనలు మీరకూడదనే ఉద్దేశంతో చెన్‌పై ఆరు నెలల నిషేధంతోపాటు లక్ష రూపాయల జరిమానా విధించినట్టు డాంఘై ఎయిర్‌లైన్స్‌ తెలిపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles