Arun Jaitley addresses media after GST council meet జీఎస్టీ నుంచి చిరు వ్యాపారులకు ఊరట..

Government doubles tax exemption limit for small businesses arun jaitley

GST Exemption, GST Council meet, gst, FM, Arun Jaitley, hilly states, North Eastern states, union government

Effective April 1, the GST exemption threshold has been raised from Rs 20 lakh to Rs 40 lakh. For hilly states and those in the North East will now be able to choose if they want to keep the GST exemption limit at Rs 20 lakh or Rs 40 lakh

జీఎస్టీ నుంచి చిరు వ్యాపారులకు ఊరట..

Posted: 01/10/2019 07:49 PM IST
Government doubles tax exemption limit for small businesses arun jaitley

చిన్న వ్యాపారులకు కేంద్రం శుభవార్త అందించింది. జీఎస్టీ మినహాయింపు పరిమితిని మరింత పెంచింది. ఇప్పటి వరకు రూ.20 లక్షలు అంతకన్నా ఎక్కువ టర్నోవర్ ఉన్న వ్యాపారులు జీఎస్టీ పరిధిలోకి వచ్చేవారు. ఇకపై ఆ పరిమితిని రూ.40 లక్షలకు పెంచుతూ జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అధ్యక్షతన గురువారం ఢిల్లీలో జరిగిన 32వ జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్లో ఈ నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఈశాన్య రాష్ట్రాలకు ఇప్పటి వరకు ఈ పరిమితి 10 లక్షల రూపాయల వరకు ఉండగా.. రూ.20 లక్షలకు పెంచారు.

జీఎస్టీ కాంపోజిషన్ స్కీమ్ పరిమితిని కోటి రూపాయల నుంచి కోటిన్నర రూపాయల వరకు పెంచారు. ఈ టాక్స్ ను మూడు నెలలకు ఓసారి చెల్లించాలని సూచించారు. రిటర్న్ మాత్రం ఏడాదికి ఒకసారి ఫైల్ చేస్తే సరిపోతుందన్నారు అరుణ్ జైట్లీ. సేవారంగానికి కూడా కాంపోజిషన్ స్కీమ్ ను కౌన్సిల్ అప్రూవ్ చేసిందని చెప్పారు. ఇది ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమలులోకి వస్తుంది.

కాగా, రియల్ ఎస్టేట్, లాటరీలను జీఎస్టీ పరిధిలోకి తేవడంపై ఏడుగురు మంత్రులతో కూడిన కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించామని చెప్పారు. జీఎస్టీ శ్లాబుల్లో తగ్గింపులు మళ్లీ ఉండే అవకాశం ఉందా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. జీఎస్టీ ఆదాయం పెరిగితేనే శ్లాబుల్లో తగ్గింపు ఉంటుందని జైట్లీ చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : GST Exemption  GST Council meet  gst  FM  Arun Jaitley  hilly states  North Eastern states  union government  

Other Articles