Women hold topless protest in Australia సౌదీ యువతి కోసం మహిళల అర్థనగ్న నిరసన

Women hold topless protest to support 18 year old rahaf

saudi teen rahaf, saudi teen, saudi teen rahaf detained, thailand saudi girl, Saudi Runaway, Rahaf, Secret Sisterhood, topless protest in Australia, UN Saudi runaway refugee, Rahaf Mohammed al-Qunun latest news

Four women on Thursday held a topless protest in Sydney in support of 18-year-old Rahaf Mohammed Al-Qunun, who claimed to have run away from her abusive family and feared she would be killed if sent back home.

పారిపోయిన సౌదీ యువతి కోసం యువతుల అర్థనగ్న నిరసన

Posted: 01/10/2019 04:58 PM IST
Women hold topless protest to support 18 year old rahaf

‘తన తల్లిదండ్రులే తనను హింసిస్తున్నారన్న అరోపణలతో తనకు వారి వద్ద రక్షణ లేదని పేర్కోంటూ సౌదీ అరేబియా నుంచి పారిపోయి బ్యాంకాక్ చేరింది 18 ఏళ్ల రహాఫ్ మహమ్మద్ అల్ ఖునన్ అనే యువతి. ఇలా ఇంట్లోంచి పారిపోయిన అమె ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్‌లోని సౌదీ అరేబియా రాయభార కార్యాలయం అధికారులు... అక్రమంగా పారిపోయి వచ్చిన యువతిని అదుపులోకి తీసుకోవడంతో రహాఫ్... చర్చనీయాంశమైంది.

అయితే సౌదీ అధికారులు అమెను తన ఇంటికి పంపుతామని చెబుతున్నా.. అమె అందుకు నిరాకరించింది. తాను సౌదీకి వెళ్తే తన తల్లిదండ్రుల చేతిలో చస్తానని అందోళనను వ్యక్తం చేసింది. దీంతో విషయంలో ఐక్యరాజ్యసమితి జోక్యం చేసుకోవడం విషయం హాట్ టాపిక్‌గా మారిపోయింది. సౌదీ నుంచి వచ్చిన యువతి దగ్గర రిటర్న్ టికెట్ లేకపోవడంతో ఆమెను నిర్భదించారు విమానాశ్రయ సిబ్బంది. పాస్‌పోర్ట్ స్వాదీనం చేసుకుని, తనను ఆస్ట్రేలియా వెళ్లకుండా థాయ్ అధికారులు అడ్డగించారని ఆమె ఫిర్యాదు చేసింది. ట్విట్టర్ వేదికగా ఆమె ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటికి వచ్చింది.

ఐక్యరాజ్యసమితి శరణార్తి వ్యవహారాల కమిషన్, రహాఫ్ మహమ్మద్ అల్ ఖునన్‌ను తమకు అప్పగిస్తే ఆమె ‘చట్టబద్ధమైన శరణార్థి’గా గుర్తించి ఆదుకుంటామని ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రకటించింది. అయితే కువైట్‌లో రహాఫ్ కుటుంబం గురించి, ఆమెకు ఎదురైన గృహహింస గురించి ఎలాంటి సమాచారం అందలేదు. అయితే సౌదీ యువతికి మద్ధతుగా... థాయిలాండ్ అధికారుల చర్యలను ఖండిస్తూ ఆస్ట్రేలియాలో నిరసనలు మొదలయ్యాయి. నలుగురు యువతులు... ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ అర్ధనగ్నంగా నిరసన తెలిపారు. ‘ది సీక్రెట్ సిస్టర్ హుడ్’ అనే అక్షరాలను వీపు మీద రాసుకున్న నలుగురు యువతులు... కేవలం జీన్స్ మాత్రమే ధరించి, టాప్‌లెస్‌గా సిడ్నీ నగరంలో నిరసన వ్యక్తం చేశారు.

‘గో ఫండ్ మీ’ పేరుతో ఆమెకు అవసరమైన ఆర్థిక సాయం చేయాల్సిందిగా కోరుతూ విరాళాలను కూడా ఆహ్వానిస్తున్నారు ఈ యువతులు. గృహహింసను భరించలేక, ఇళ్లు వదిలేసి వచ్చిన ఆమె తెగువను తాము గౌరవిస్తామంటూ ఈ ఆర్గనైజేషన్ ఫౌండర్ జాకీ లవ్ తెలిపింది. స్వేచ్ఛగా, స్వాతంత్య్రంగా తమ భావాలను వెల్లడించేందుకు మహిళలకు హక్కు ఉండాలనే ఉద్దేశంతోనే టాప్‌లెస్‌గా నిరసనలు తెలుపుతున్నట్టు పేర్కొన్నారు లవ్. ఇప్పటికే ఈ సంస్థకు 4 వేల డాలర్ల దాకా విరాళాలు రావడం విశేషం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles