pongal star fight: rajnikanth vs ajith fans in tamil nadu పేటా వర్సెస్ విశ్వాసం: అభిమానుల మధ్య ఘర్షణ..

Pongal star fight rajnikanth vs ajith fans in tamil nadu 4 injured

Kollywood,Viswasam movie,Ajith Kumar,Petta,Ajith fan burns his father for not giving money to buy ticket,Ajith fan burn father,Ajith fan burns father,Ajith fans stab each other,Ajith fans fight each other,Viswasam release fight,Rajinikanth,Rajinikanth Ajith Kumar fan fight, crime

A clash between Rajini fans and Ajith fans in a theater near Koyambedu in Chennai. It is said Ajith fans were angry that Viswasam did not get a special morning show, following which they tried to tear up Petta banners, which led to a quarrel between the two fans groups.

ITEMVIDEOS: పేటా వర్సెస్ విశ్వాసం: అభిమానుల మధ్య ఘర్షణ..

Posted: 01/10/2019 12:24 PM IST
Pongal star fight rajnikanth vs ajith fans in tamil nadu 4 injured

సంక్రాంతి పండగ నేపథ్యంలో తమిళ సినీ పరిశ్రమ (కోలీవుడ్)లో బిగ్ ఫైట్ నడుస్తోంది. ఇద్దరు స్టార్ హీరోల అభిమానుల మధ్య అంతరాన్ని పెంచింది. హీరోలందరూ ఒక్కేటేనని, అభిమానులు కూడా కలసిమెలసి వుండాలని ఇప్పటికే పలుమార్లు స్టార్ హీరోలే స్వయంగా ప్రకటనలు గుప్పించినా, అభిమానులు మాత్రం తమ హీరో సినిమానే హైలైట్ అంటూ.. ఒకరితో మరోకరు వాదనలకు దిగి.. అవి పెరిగి పెద్దదై ఘర్షణలకు దిగుతున్నారు. ఈ ఇద్దరి స్టార్ హీరోల సినిమాల విడుదల నేపథ్యంలో తమిళనాడులో కొన్ని హింసాత్మక ఘటనలు జరిగాయి.

రజనీ నటించిన ‘పేట’, అజిత్ ‘విశ్వాసం’ సినిమాలు ఇవాళ రిలీజ్ అయ్యాయి. దీంతో ఇద్దరు స్టార్ల అభిమానులు ఆయా థియేటర్ల వద్ద సందడి చేస్తున్నారు. బాణాసంచా కాలుస్తూ, ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేస్తున్నారు. తొలి ఆట చూడాలన్న ఉత్సాహంతో వేలాది మంది అభిమానులు థియేటర్లకు క్యూ కట్టారు. రెండు సినిమాలకు పాజిటివ్ టాక్ రావడంతో వారి ఆనందం మిన్నంటింది. అయితే రజనీకాంత్ పేటా చిత్రాన్ని ప్రత్యేక షో వేసిన ధియేటర్ జమాన్యం అజిత్ విశ్వాసం చిత్రాన్ని మాత్రం స్పెషల్ షో వేయలేదు. దీంతో ఇరువురు హీరోల అభిమానులు పరస్పరం వాగ్వాదానికి దిగారు.

చెన్నైలోని కోయంబాడులోని ధియేటర్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో అజిల్ అభిమానులు రజనీకాంత్ సినిమా పోస్టర్లను చించివేయడంతో గొడవ ముదిరి ఘర్ఘణకు దారితీసింది. మా హీరో గొప్పంటే.. మా హీరో గొప్ప అంటూ నినాదాలు చేసుకుంటూ అలజడి సృష్టించారు. ఇరువర్గాలు తీవ్రంగా కొట్టుకున్నారు. ఈ క్రమంలో కొందరు కత్తులతో దాడి చేయడంతో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ajith kumar  rajnikanth  viswasam  petta  kollywood  fan fight  tamil nadu  

Other Articles

Today on Telugu Wishesh