inter student held for absconding with ktm bike బైక్ మీద యావ.. ఇంటర్ విద్యార్థికి ఊచలు..

Inter student held for absconding with ktm bike

intermediate student, inter student, inter student fond fo bikes, inter student crime, KTM bike, OLX, absconded with bike, kukatpally, nizambad, ashwin kumar, crime

An Intermediate student was fond of bikes, he wanted to own a KTM bike. He saw an advetisement in olx and asked the advertiser to bring the bike to kukatpally as he wanted to buy it. he than said to have a test ride and absconded with the bike.

బైక్ మీద యావ.. ఇంటర్ విద్యార్థికి ఊచలు..

Posted: 01/09/2019 11:59 AM IST
Inter student held for absconding with ktm bike

అది ఆ యువకుడికి జీవితంలో ములుపులు తిరిగే వయసు. అదే టీనేజ్. ఈ వయస్సలో ఎవరెంత చెప్పినా.. నూనూగు మీసాల నూతనయవ్వన వయస్సు మాత్రం వారి ధ్యాసను వేరేవాటిపైకి మళ్లిస్తుంది. జీవితానికి బంగారు బాటలు వేసే ఈ వయససు అత్యంత కీలకం. ఈ వయస్సులో వారిని నిత్యం తల్లిదండ్రులు గమనిస్తుండాలి. ఎందుకంటే టీనేజ్ మహా డేంజరస్ ఏజ్. వీరికి చదువులపై వారి శ్రద్దకలిగేలా పేరెంట్స్ నిత్యం శ్రద్ద తీసుకోవాలి. వారితో సరదాగా వుండాలి. అలవాట్లను, వ్యవహారాలను కూడా గమనిస్తుండాలి.

ఈ నూతన యుక్త వయస్సులోనే తప్పదారి బట్టిన ఓ టీజేన్ విద్యార్థి కటకటాలపాలు అయ్యాడు. బైక్ పై యావతోనే ఈ ఘటన జరిగింది. చూడటానికి ఎంతో ఫ్యాషన్ గా వుండే కేటీఎం బైక్ పైకి ఇంటర్ విద్యార్ధి ద్యాస మళ్లింది. అంతే దానిని ఎలాగైనా సోంతం చేసుకోవాలని భావించాడు. అయితే మామూలుగానే ధర మండే ఈ బైక్ మధ్యతరగతి యువకులు చూడటానికే కానీ కొనసడానికి సరిపోరని ఆ యువకుడి స్నేహితులు అతడికి హితువు చెప్పారు. అయినాసరే ఎలాగైనా దాన్ని సాధించాలన్న పట్టుదలకు వచ్చాడు విద్యార్థి.

అయితే సక్రమంగా దాన్ని సొంత చేసుకునే స్థాయిలేక అక్రమ మార్గాలను అన్వేషించి ఊచలు లెక్కబెట్టాడు. ఓఎల్ఎక్స్ లో బైక్‌తో యాడ్ చూశాడు. అదెలా అంటే నారపల్లి సాయినగర్‌కాలనీకి చెందిన అశ్విన్ కుమార్.. తన కేటీఎం బైకును ఓఎల్‌ఎక్స్‌లో అమ్మకానికి పెట్టాడు. దీనిని చూసిన నిజామాబాద్ జిల్లాకు చెందిన 15 ఏళ్ల ఇంటర్ విద్యార్ధి కూకట్ పల్లిలోని ఓ ప్రైవేటు కాలేజీలో వుంటే వారి హాస్టల్ లోనే చదువుతున్నాడు.

సోమవారం బైక్‌ను కొనుగోలు చేస్తానని అశ్విన్ కుమార్ కు ఫోన్ చేసి.. బైక్ ను తీసుకురమ్మని చెప్పాడు. అశ్విన్ కుమార్ విద్యార్థి మాటలు నమ్మి బైక్ ను తీసుకురాగానే.. ఒక్కసారి ట్రయల్ చేసి చూస్తానని చెప్పి బైక్‌తో పరారయ్యాడు.ఈ ఘటనతో షాక్ తిన్న బాధితుడు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకు న్న పోలీసులు బాలుడిని అరెస్ట్ చేశారు. జువైనల్ హోంకు తరలించారు. ఎవరు పడితే వారిని గుడ్డిగా నమ్మి బైక్‌లు అమ్మొద్దని.. సూచించారు పోలీసులు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : inter student  KTM bike  OLX  absconded with bike  kukatpally  nizambad  ashwin kumar  crime  

Other Articles