Weather apps secretly selling your data to advertisers మీ ఫోన్లో వెదర్ అప్ వుందా.. మీ డేటా గోవింద..

Beware weather apps on your phone could be secretly selling your data to advertisers

Los Angeles, Weather Channel app, data privacy, Mobile Apps, Weather apps, IBM, advertisers

Los Angeles city prosecutors have filed a lawsuit against a popular weather app- the Weather Channel app- for covertly selling users' private data to advertisers.

మీ ఫోన్లో వెదర్ అప్ వుందా.. మీ డేటా గోవింద..

Posted: 01/07/2019 11:38 AM IST
Beware weather apps on your phone could be secretly selling your data to advertisers

మీరు ఊళ్లకు వెళ్తున్నారా.? అయితే అక్కడి వాతావరణం ఎలా ఉందో వెదర్ యాప్‌లో చెక్ చేసుకుంటున్నారా? బయట చలి ఎంతుందో? ఉష్టోగ్రతలు ఎంత వున్నాయో.? ఎలా వున్నాయో యాప్‌లో క్లిక్ చేసి తెలుసుకుంటున్నారా? కూర్చున్న చోట అన్ని వివరాలు తెలుస్తున్నాయని మీరు సంబరపడుతున్నా.. మీకు సంబంధించిన సమస్త సమాచారం ఈ యాప్ గల్లంతు చేస్తుందన్న విషయం తెలుసా.? మీకు ఎక్కడెక్కడికి వెళ్తున్నారన్న సమాచారం పూర్తిగా పరాయి వ్యక్తల చేతిలోకి వెళ్తుంది. తాజాగా బయటపడ్డ ఈ విషయం ఇప్పుడు కలకలం రేపుతోంది.

'ది వెదర్ ఛానెల్' యాప్ యూజర్ల డేటాను దుర్వినియోగం చేస్తోందని తేలింది. 'ది వెదర్ ఛానెల్' వాడుతున్నవాళ్లు ఎప్పటికప్పుడు వాతావరణ వివరాలు ఖచ్చితంగా తెలియాలని లొకేషన్ ఇన్ఫర్మేషన్‌ని షేర్ చేసుకునేవాళ్లు. కానీ ఆ కంపెనీ మాత్రం యూజర్ల డేటా కొట్టేసి థర్డ్ పార్టీకి అమ్ముకుంటోందని తేలింది. దీంతో సదరు యాప్ డెవలపర్లను లాస్ ఏంజిల్స్ కౌంటీ సుపీరియర్ కోర్టుకు ఈడ్చారు. దాదాపు 80 శాతం మంది యూజర్లు తమ లొకేషన్‌ని యాక్సెస్ చేసేందుకు అనుమతిచ్చారు. వారి జియోలొకేషన్ డేటాను యాప్ డెవలపర్లు దుర్వినియోగం చేశారు.

తమ యూజర్లు క్షణక్షణం ఎక్కడున్నారో, ఎక్కడెక్కడ తిరుగుతున్నారన్న సమాచారాన్ని అడ్వటైజర్లకు అమ్ముకున్నారు. విషయం కోర్టుదాకా రావడంతో మొత్తం బయటపడింది. ఇలాంటి చర్యల్ని ఆపాలని కోరిన బాధితులు... ఒక్కో ఉల్లంఘనకు 2500 డాలర్ల జరిమానా విధించాలని కోర్టును కోరారు. ఇంకో విశేషం ఏంటంటే ఇది ప్రపంచంలోనే ఎక్కువ మంది డౌన్‌లోడ్ చేసుకున్న వెదర్ యాప్. నెలకు 4.5 కోట్ల మంది యూజర్లు ఉన్నట్టు ది వెదర్ ఛానెల్ యాప్ డెవలపర్లు చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Los Angeles  Weather Channel app  data privacy  Mobile Apps  Weather apps  IBM  advertisers  

Other Articles