Actress Nikita passes away ఒడియా నటి నికితది హత్యేనన్న తండ్రి, భర్త అరెస్టు

Odia actress death father of nikita alleges murder hubby detained

nikita death, actress nikita death, nikita husband detained, nikita murdered, Laxmipriya Behera death, Sanatan Behera, Lipan Sahu, crime

The Commissionerate Police detained Lipan Sahu, husband of deceased actress Laxmipriya Behera alias Nikita after her father levelled murder allegation against the former.

ఒడియా నటి నికితది హత్యేనన్న తండ్రి, భర్త అరెస్టు

Posted: 01/07/2019 09:06 AM IST
Odia actress death father of nikita alleges murder hubby detained

నికితగా చిరపరిచితురాలైన ఒడిశా టెలివిజన్ నటి లక్ష్మీప్రియ బెహరా అనుమానాస్పద పరిస్థితిలొ మృతి చెందింది. ప్రాథమిక సమాచారం ప్రకారం.. మహానది విహార్ ప్రాంతంలో ఉన్న తన తండ్రి ఇంటికి వెళ్లిన నికిత ప్రమాదవశాత్తు టెర్రస్ పైనుంచి కిందపడింది. వెంటనే ఆమెను ఆసుపత్రిలో చేర్చగా, చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. తీవ్ర గాయాల వల్లే ఆమె ప్రాణాలు కోల్పోయినట్టు నికిత తల్లిదండ్రులు, భర్త తెలిపారు. అయితే, టెర్రస్ పైనుంచి ఎలా కిందపడిందన్న విషయాలు తెలియరాలేదు.

 కిందపడి తీవ్ర గాయాలపాలైన నికితను తొలుత ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. అనంతరం కటక్‌లోని ఎస్‌సీబీ ఆసుపత్రికి తరలించారు. అక్కడామె పరిస్థితి మరింత విషమించడంతో మరోమారు ఆమెను ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడామె చికిత్స పొందుతూ మరణించింది. కాగా, నికిత మరణించిన తరువాత అమె తండ్రి తన అల్లుడు, నికిత భర్త లిపన్ సాహుపై తీవ్రమైన అరోపణలు చేశారు. తన అల్లుడే నికితను ప్రణాళికబద్దంగా అంతమెందించాడని అరోపించారు.

నికిత మరణించిన రోజున ఇద్దరికీ ఏదో విషయమై వాదించుకున్నారని,  ఆ తరువాత ఇద్దరు కలసి టెర్రెస్ పైకి వెళ్లి గొడవ విషయాన్ని చర్చించుకునేందుకు వెళ్లారని, కొద్దిసేపటికి నికిత టెర్రస్ పై నుంచి కిందపడి తీవ్రగాయాలపాలైందని.. కచ్చితంగా ఇది తన అల్లుడు చేసిన హత్యేనని అరోపించారు. దీంతో లిపన్ సాహును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ‘చోరీ చోరీ మానా చోరీ’, ‘మా రా పనతకాని’, ‘స్మైల్ ప్లీజ్’ వంటి సినిమాల్లోనూ నికిత నటించింది. ఆమెకు 2016లో గోపాల్‌పూర్‌కు చెందిన లిపన్ సాహుతో కటక్‌లో వివాహమైంది. వీరికి ఆరు నెలల కుమార్తె ఉంది. అయితే, ఇటీవల ఆమె తన భర్తకు దూరంగా ఉంటున్నట్టు తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh