Reach railway station 20 mins before to catch a train రైలు ప్రయాణం చేస్తున్నారా.. ఈ నిబంధన తెలుసా.?

Reach railway station 20 mins before to catch a train

cctv cameras, indian railways, integrated security system iss, kumbh mela, railways, Passengers, Airport-Like Security Checks, offenders

Railways is planning to seal stations just like airports and passengers would have to arrive 15-20 minutes before scheduled departure of trains to complete the process of security checks.

రైలు ప్రయాణం చేస్తున్నారా.. ఈ నిబంధన తెలుసా.?

Posted: 01/07/2019 08:14 AM IST
Reach railway station 20 mins before to catch a train

రైలు ప్రయాణం చేస్తున్నారా..? అయితే ఈ నిబంధన తెలుసా.? రైలు ప్రయాణం చేయాలంటే కనీసం 20 నిమిషాల ముందుగానే రైల్వే స్టేషన్లోకి ప్రయాణికులు చేరుకోవాలి. ఔనా అంటున్నారా.? నిజమేనండి.. ఇకపై విమానాశ్రయాల్లో మాదిరిగానే రైల్వేస్టేషన్లలోనూ ప్రయాణికుల్ని తనిఖీ చేయనున్నారు. తనిఖీలకు వీలుగా ప్రయాణికులు నిర్ణీత సమయం కంటే ఓ ఇరవై నిమిషాలు ముందుగానే రైల్వేస్టేషన్ కు చేరుకోవాల్సి ఉంటుంది. దీంతో దొంగతనాలను తగ్గించడంతో పాటు పాత నేరస్థులను గుర్తించే వ్యవస్థను కూడా అందుబాటులోకి తీసుకురానుంది రైల్వేశాఖ.

ఇక రైల్వే స్టషన్లలో అనుమానాస్పదంగా వుండే వస్తువులను కూడా గుర్తించి వాటిలో ఏముందోనన్ని కూడా తెలుసుకునేందుకు వీలు ఏర్పడుతుంది. దీంతోపాటు రైల్వేస్టేషన్లో ప్రవేశించేందుకు వీలు కల్పిస్తున్న మార్గాలు ఇప్పటిలా కాకుండా పరిమితంగానే ఉంటాయి. అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో కూడిన భద్రత తనిఖీలను ప్రయాగ్‌రాజ్‌ (అలహాబాద్‌), హుబ్బళ్లి స్టేషన్లలో ప్రారంభించామని, మరో 202 స్టేషన్ల కోసం ప్రణాళిక సిద్ధం చేశామని రైల్వే పరిరక్షణ దళం (ఆర్‌పీఎఫ్‌) డైరెక్టర్‌ జనరల్‌ అరుణ్‌కుమార్‌ తెలిపారు.

‘రైల్వేస్టేషన్లను దిగ్బంధం చేయాలనేది మా ప్రణాళిక. ఎక్కడెక్కడ ప్రవేశమార్గాలున్నాయో గుర్తించి, వాటిలో ఎన్నింటిని మూసివేయవచ్చో తేలుస్తాం. శాశ్వతంగా ప్రహరీ గోడలు కట్టి కొన్నింటిని మూసివేస్తాం. మరికొన్నింటి వద్ద ఆర్‌పీఎఫ్‌ బలగాలను మోహరిస్తాం. ప్రతీ ద్వారం వద్ద అడపాదడపా తనిఖీలు నిర్వహిస్తాం. విమానాశ్రయాల్లో మాదిరిగా ప్రయాణికులు కొన్ని గంటల ముందుగా రావాల్సిన పనేమీ లేదు. 15-20 నిమిషాల ముందు వస్తే భద్రత తనిఖీలతో జాప్యం కాకుండా ఉంటుంది. దీనికోసం సిబ్బంది అవసరం పెద్దగా ఉండదు. సమీకృత భద్రత వ్యవస్థ (ఐఎస్‌ఎస్‌)లో భాగంగా ఈ చర్యలు చేపడుతున్నాం’ అని ఆయన వివరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles