46-year-old Sri Lankan woman visits Sabarimala temple అయ్యప్పను దర్శించుకున్న శ్రీలంక మహిళ

Confusion over sri lankan woman s entry into sabarimala temple

Sabarimala row, Sabarimala protest, Sri Lankan woman, Woman denied entry, protest on Sabarimala issue, Kerala bandh, Sabarimala Sri Lankan woman, Sabarimala Temple News, Sabarimala Women Entry Issue, politics

Confusion prevailed over the entry of a 46-year old Sri Lankan Tamil woman into the Lord Ayyappa temple late at Sabarimala on Thursday night with the woman denying it and official sources claiming otherwise.

శబరిమల అయ్యప్పను దర్శించుకున్న శ్రీలంక మహిళ

Posted: 01/04/2019 11:50 AM IST
Confusion over sri lankan woman s entry into sabarimala temple

పవిత్రమైన శబరిగిరిపై కొలువైన అయ్యప్ప స్వామి ఆలయంలోకి బింధు, కనకదుర్గ అనే ఇద్దరు మహిళలు ప్రవేశించడంతో ఆలయాన్ని సంప్రోక్షణ చేసిన మరో మారు భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించిన క్రమంలో మరో మహిళ కూడా అయ్యప్ప స్వామి దర్శనం చేసుకుందన్న వార్తలు ఇప్పడు అయ్యప్ప భక్తులలో కలకలం రేపుతుంది. శ్రీలంకకు చెందిన మహిళా భక్తురాలు స్వామివారిని దర్శించుకుందని పోలీసులు ధృవీకరించగా, అమె మాత్రం ఈ వార్తలను ఖండిస్తున్నారు.

ఇప్పటికే బింధు, కనకదుర్గలు ఆలయ ఆచారాలను తుంగలోతొక్కుతూ అయ్యప్ప దర్శనం చేసుకోవడంతో కేరళవ్యాప్తంగా అట్టుడుకుతోంది. ఓ వైపు కేరళ రాష్ట్ర వ్యాప్తంగా హిందూ సంస్థలు బంద్ నిర్వహించిన విషయం కూడా తెలిసిందే. ఈ బంద్ కాస్తా హింసాత్మకంగా మారి పలు చోట్ల అందోళనకారులను పోలీసులు చెదరగొట్టారు. ఈ గొడవ సద్దుమణగకముందే శ్రీలంకకు చెందిన 46 ఏళ్ల మహిళ గురువారం రాత్రి ఆలయంలోకి ప్రవేశించిందన్న వార్త ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తోంది.

అశోక్ కుమరన్ కుమార్తె శశికళగా ఆమెను గుర్తించారు. 3 డిసెంబరు, 1972లో జన్మించిన ఆమె గురువారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి స్వామిని దర్శించుకున్నట్టు చెబుతున్నారు. సాధారణ దుస్తుల్లో ఉన్న పోలీసులతో కలిసి ఆమె అయ్యప్పను దర్శించుకున్నారు. అనంతరం ఎటువంటి గందరగోళం లేకుండా పంబకు చేరుకున్నట్టు చెబుతున్నారు. జాతీయ పత్రిక ‘ది హిందూ’ కథనం ప్రకారం.. శశికళ పరమ పవిత్రమైన 18 మెట్లను ఎక్కి గర్భగుడిలోకి ప్రవేశించి పూజలు చేశారు.

అయితే, తాను స్వామిని దర్శించుకున్నట్టు వస్తున్న వార్తలను శశికళ ఖండించారు. తానో భక్తురాలినని, 48 రోజుల దీక్షలో ఉన్నానని పేర్కొన్నారు. తనను వెనక్కి పంపే అధికారం ఎవరికీ లేదన్నారు. వివిధ కారణాల వల్ల తన గర్భసంచిని తొలగించారని, కాబట్టి అయ్యప్పను దర్శించుకునే హక్కు తనకు ఉందని వివరించారు. అందుకు సంబంధించిన వైద్య ధ్రువీకరణ పత్రం కూడా తన వద్ద ఉందన్నారు. కాగా, ఓ పోలీసు అధికారి మాట్లాడుతూ.. శశికళ అయ్యప్పను దర్శించుకునే ఉంటారని, అయితే ఆ విషయాన్ని తాను కచ్చితంగా చెప్పలేనని పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles