RRB JE Recruitment 2019 for 14033 Posts నిరుద్యోగ ఇంజనీర్లకు రైల్వేశాఖ గుడ్ న్యూస్..

Rrb je recruitment 2019 apply online for 14033 vacancies

rrb je,rrb je recruitment,rrb recruitment,je recruitment,rrb je recruitment 2018-19,rrb recruitment 2018-19,rrb je syllabus,rrb syllabus,je syllabus,rrb je 2019,Railway Recruitment Board hiring,Railway Recruitment Board jobs,Indian Railways jobs,Indian Railways

The RRB has invited online applications for 14,033 jobs, to fill a total of 13,034 vacancies for the role of Junior Engineer, 49 vacancies for JE (IT), 456 openings for Depot Material Superintendent and 494 openings for Chemical and Metallurgical Assistant role.

డిప్లొమా, ఇంజనీర్, డిగ్రీ అర్హతలపై రైల్వేశాఖ ఉద్యోగాలు..

Posted: 12/28/2018 12:43 PM IST
Rrb je recruitment 2019 apply online for 14033 vacancies

నిరుద్యోగ యువతకు రైల్వేమంత్రిత్వశాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఇంజనీరింగ్, డిప్లొమా, డిగ్రీ పూర్తిచేసిన నిరుద్యోగుల కోసం ఏకంగా 14 వేల ఉద్యోగాలను ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రైల్వేజోన్లలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు నిర్ణయించింది. వీటిల్లో జూనియర్ ఇంజినీర్ పోస్టులతో పాటు ఇతర పోస్టులు ఉన్నాయి. విద్యార్హతలు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలని కోరింది.

సరైన అర్హతలు ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్ లైన్ రాతపరీక్ష, మెడికల్ టెస్ట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. దేశవ్యాప్తంగా వున్న 21 ఆర్‌ఆర్బీలు పరీక్షలను నిర్వహించి నియామకాలను చేపట్టనున్నాయి. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి సికింద్రాబాద్ జోన్ ఉంది. కాగా పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్‌ డిసెంబరు 29న వెలువడే అవకాశం ఉంది.

* మొత్తంగా 14033 పోస్టులకు పరీక్షలు జరుగునుండగా, వీటిలో డిప్లొమా, ఇంజనీరింగ్ వారికే ఏకంగా 13 వేల 34 పోస్టులు వున్నాయి.
* జూనియర్ ఇంజనీర్ పోస్టులకు సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ లేద డిప్లోమా చేసిన అభ్యర్థులు అర్హులు.
* ఇక జూనియర్ ఇంజనీర్ (ఐటీ) క్యాటగిరలో ఖాళీగా వున్న 49 పోస్టులకు పీజీడీసీఏ లేదా బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) లేదా బీసీఏ లేదా బీటెక్ (ఐటీ) లేదా బీటెక్ (కంప్యూటర్ సైన్స్) లేదా మూడేళ్ల డీఓఈఏసీసీ 'బి' లెవల్ కోర్సు లేదా తత్సమాన విద్యార్హత ఉన్నవారు అర్హులు.
* డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ విభాగంలో ఖాళీగా వున్న 456 పోస్టులకు ఏదైనా విభాగంలో ఇంజినీరింగ్ డిగ్రీ/డిప్లొమా.
* కెమికల్ & మెటలర్జికల్ అసిస్టెంట్ విభాగంలోని 494 పోస్టులకు ఫిజికల్ సైన్స్ డిగ్రీలో కనీసం 45 శాతం మార్కుల వచ్చిన వారు అర్హులు.
* వయోపరిమితి: 01.01.2019 నాటికి 18 - 33 సంవత్సరాల మధ్య ఉండాలి.

* దరఖాస్తు ఫీజు: రూ.500. ఎస్సీ, ఎస్టీ, మహిళలు, మైనార్టీలు, ట్రాన్స్‌జెండర్, ఈబీసీ, ఎక్స్-సర్వీస్‌మ్యాన్ అభ్యర్థులకు రూ.250 చెల్లిస్తే సరిపోతుంది. (నెట్ బ్యాంకింగ్/ క్రెడిట్ కార్డు/ డెబిట్ కార్డు/ యూపీఐ) ద్వారా లేదా ఎస్‌బీఐ/ పోస్టాఫీస్ చలానా ద్వారా దరఖాస్తు ఫీజు చెల్లించవచ్చు.
* దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ద్వారా.
* ఎంపిక విధానం: ఆన్‌లైన్ రాతపరీక్ష ద్వారా.

ముఖ్యమైన తేదీలు...
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ప్రారంభం     02.01.2019
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరితేది         31.01.2019
ఆన్‌లైన్ ద్వారా ఫీజు చెల్లించడానికి చివరితే     05.02.2019
ఎస్‌బీఐ/ పోస్టాఫీస్ చలానా ద్వారా     04.02.2019
దరఖాస్తుల తుదిసమర్పణకు చివరితే     07.02.2019

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles