New Year gift: Rameshwaram-Dhanushkodi rail line రామ మందిరం కాదు.. రామసేతు దర్శనం..

Pilgrims to gain rail access to ram sethu as new rail line gets approval

Vertical-lift bridge, sri lanka, Rameswaram, Ram Setu, Pilgrimage, Pamban bridge, hindu, Dhanushkodi, Adam's Bridge, India, Politics

Government of India has given a heads-up for the new broad gauge railway line that connects Rameshwaram and Dhanushkodi in Tamil Nadu, two major pilgrim destinations.

రామ మందిరం కాదు.. రామసేతు దర్శనం..

Posted: 12/26/2018 02:57 PM IST
Pilgrims to gain rail access to ram sethu as new rail line gets approval

సరిగ్గా సార్వత్రిక ఎన్నికలకు ముందు ఓ వైపు అర్ఎస్ఎస్, మరో వైపు విశ్వహిందూ పరిషత్ అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తున్నాయి. ఈ క్రమంలో కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంలో భాగస్వామ్య పక్షాలైన శివసేన మరో అడుగు ముందుకేసీ ప్రధానమంత్రిని కూడా లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్న తరుణంలో.. రామ భక్తులను శాంతింపజేసేందుకు కేంద్రం మరో బృహత్తరమైన ప్రాజెక్టుకు పచ్చజెండా ఊపింది.

ఇప్పటికే రామభక్తులు అయోధ్య విషయంలో కేంద్రంపై గుర్రుగా వున్న నేపథ్యంలో వారిని అకట్టుకునేందుకు ప్రయత్నాలను ప్రారంభించింది. రామరావణ యుద్ధం సందర్భంగా శ్రీరాముని ఆజ్ఞ మేరకు వానర సైన్యం నిర్మించిందని భావిస్తున్న రామసేతు మన వైపు గట్టును సందర్శించే అవకాశం త్వరలోనే అందుబాటులోకి రానుంది. భారత భూభాగంలో రామసేతు ప్రారంభమవుతున్న ధనుష్కోడి వరకు రైల్వేలైను నిర్మాణానికి కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.

తమిళనాడులోని ధనుష్కోడి నుంచి శ్రీలంకలోని తలైమన్నార్‌ వరకు రామసేతు నిర్మితమై ఉందన్నది అనాదిగా వున్న నమ్మకం. దీంతో పంబన్‌ దీవిలోని రామేశ్వరం వరకు ప్రస్తుతం రైల్వే లైను ధనుష్కోడి వరకు పొడిగించాలని కేంద్రం నిర్ణయించారు. రామేశ్వరం నుంచి దాదాపు 17 కిలోమీటర్ల దూరంలోని ఈ ప్రాంతానికి రైల్వేలైను అందుబాటులోకి వస్తే యాత్రికులు సులభంగా రామసేతును సందర్శించవచ్చు. దీంతో తమిళనాడులోని ధనుష్కోడికి మరోమారు పురాతన వైభవం రానుందని స్థానికులు సంబరపడుతున్నారు.

వాస్తవానికి గతంలో ధనుష్కోడి  వరకు రైల్వేలైను ఉండేది. 1964లో వచ్చిన భీకర తుపాన్‌ సమయంలో ఈ లైను ధ్వంసమయింది. ధనుష్కోడి గ్రామం కూడా చరిత్రపుటల్లో కలిసిపోయింది. అంటే పాత రైల్వే మార్గాన్ని పునర్నిర్మిస్తున్నట్టే లెక్క. ఇక, మండపం నుంచి పంబన్‌ ద్వీపాన్ని కలుపుతూ ప్రస్తుతం ఉన్న రైల్వే వంతెనను ఆనుకుని కొత్త  వంతెన నిర్మాణానికి కూడా కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ప్రస్తుతం ఉన్న వంతెనకు సమాంతరంగా 249 కోట్ల రూపాయల వ్యయంతో దీన్ని నిర్మించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rameswaram  Ram Setu  Dhanushkodi  Pilgrimage  Pamban bridge  India  Politics  

Other Articles