Four Lives Lost In Collierville House Fire అమెరికాలో సజీవదహనమైన ముగ్గురు తెలుగు విద్యార్థులు

Three indian teenaged siblings die in christmas eve fire in the us

Telangana kids killed, Indian teenagers killed in fire, Collierville, Collierville fire, Golconda teenagers, US fire accident, telugu students, america fire accident, Telangana, collierville, crime

Three Indian teenaged siblings were among four killed in a fire at a house in Collierville, US, on Christmas eve. A woman Kari Coudriet of Collierville, and Sharron, Joy, and Aaron teen siblings of the Naik family from Telangana of India died in the fire accident.

ITEMVIDEOS: అమెరికాలో సజీవదహనమైన ముగ్గురు తెలుగు విద్యార్థులు

Posted: 12/26/2018 01:24 PM IST
Three indian teenaged siblings die in christmas eve fire in the us

అమెరికాలో ముగ్గురు తెలుగు విద్యార్థులు సజీవ దహనం అయ్యారు. అగ్రరాజ్యంలోని టెన్నెసా రాష్ట్రం కొలిర్ విలీలో జరిగిన అగ్ని ప్రమాదంలో మొత్తం నలుగురు సజీవదహనం కాగా, వారిలో ముగ్గురు తెలుగు విద్యార్థులు ఉన్నారని అక్కడి పోలీసులు తెలిపారు. కొలిర్ విలీలోని ఓ ఇంట్లో అకస్మాత్తుగా మంటలు చెలరగడంతో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో నల్లగొండ జిల్లాకు చెందిన ముగ్గురు తెలంగాణ విద్యార్థులు సజీవంగా అహుతయ్యారు.

అయితే ఈ ముగ్గురు ఒకే కుటుంబానికి చెందినవారు కావడం నల్గొండ జిల్లాలో విషాదం అలుముకుంది. నల్గొండ జిల్లా నేరడుగమ్ము మండలం గుర్రపుతండా గ్రామానికి చెందిన శ్రీనివాస్‌ నాయక్‌, సుజాత నాయక్‌ దంపతుల సంతానమైన సాత్విక నాయక్ (16), జ్వాయి నాయక్‌ (13), కుమారుడు సుహాస్ నాయక్ (14) లని పోలీసులు పేర్కోన్నారు. వీరంతా ఉన్నత విద్య అభ్యసించేందుకు అమెరికా వెళ్లి.. అగ్నిప్రమాదం బారిన పడి మరణిచారు.

అటు అమెరికాలోని వీరి స్నేహితులతో పాటు ఇటు నల్గోండ జిల్లాలోనూ విషాదఛాయలు అలముకున్నాయి. ఇక, క్రిస్మస్ సందర్భంగా ఇంటికి దీపాలంకరణ చేస్తుండగా ఈ ప్రమాదం సంభవించినట్టు సమాచారం. దీపాలంకరణ వల్లే ఒక్కసారిగా మంటలు చెలరేగినట్టు భావిస్తున్నారు. మృతుల్లో మరో వ్యక్తిని ఇంటి యజమానిగా గుర్తించారు. చిన్నతనంలో ఉన్నతవిద్య కోసం అగ్రరాజ్యానికి వెళ్లిన వీరు.. దేశం కాని దేశంలో ప్రాణాలు కోల్పోవడంతో గ్రామస్థులు కన్నీళ్ల పర్యంతమయ్యారు.

అర్ధరాత్రి ప్రమాదం జరగడంతో నలుగురు తప్పించుకునే వీలు లేకుండా పోయిందన్నారు. ఈ ఘటనలో కరీ అనే మహిళతో పాటు సాత్విక నాయక్‌, సుహాస్‌ నాయక్‌, జ్వాయ్‌ నాయిక్ ప్రాణాలు కోల్పోయారని వెల్లడించారు. కరీ భర్త డానియెల్, కుమారుడు కోల్ ప్రాణాలతో బయటపడ్డారని పేర్కొన్నారు. స్మోక్ అలారం లేకపోవడంతోనే ఈ ప్రమాదం చోటుచేసుకుందని అక్కడి అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : US fire accident  telugu students  america fire accident  Telangana  collierville  crime  

Other Articles