Who's responsible if MPs, MLAs lose: Nitin Gadkari బీజేపిలో సెగరేపుతున్న నితిన్ గడ్కరీ వ్యాఖ్యలు

Nitin gadkari says bjp chief is responsible for poor assembly election results

Nitin Gadkari, Nitin Gadkari versus Amit Shah, Nitin Gadkari versus PM Modi, Nitin Gadkari versus Narendra Modi, Nitin Gadkari on party leadership, Nitin gadkari leadership comments, nitin gadkari on BJP leadership, Gadkari BJP election defeats, Amit Shah, Nitin Gadkari Jawaharlal Nehru, Gadkari India tolerance, Nitin Gadkari BJP leadership, national politics

Vicariously questioning the BJP leadership yet again, Gadkari asked who would be held responsible for the defeat of his MPs and MLAs, if he were the party president.

బీజేపిలో సెగరేపుతున్న నితిన్ గడ్కరీ వ్యాఖ్యలు

Posted: 12/26/2018 12:56 PM IST
Nitin gadkari says bjp chief is responsible for poor assembly election results

మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే ప్రధానమంత్రి పగ్గాలను గడ్కారీకి ఇవ్వాలన్న డిమాండ్లు వెల్లువెత్తుతున్న క్రమంలో తాజాగా ఆయన అమిత్ షాను టార్గెట్ గా చేసుకుని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు బీజేపీలో కాకపుట్టిస్తున్నాయి. సరిగ్గా సార్వత్రిక ఎన్నికలకు సన్నధం అవుతున్న క్రమంలో బీజేపి అదినాయకత్వాన్ని ఇబ్బందిపెట్టేలా గడ్కరీ చేసిన వ్యాఖ్యలు పార్టీ క్రియాశీలక నాయకత్వంలో చర్చలకు దారితీస్తున్నాయి.

తనకు ప్రధాన మంత్రి పదవిపై వ్యామోహం లేదని, కేంద్రమంత్రిగానే తాను సంతృప్తిగా వున్నానని ఇటీవల ప్రకటించిన గడ్కారీ.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, ప్రధాని నరేంద్ర మోదీలను లక్ష్యంగా చేసుకుని సంచలన వ్యాఖ్యలు చేయడం పార్టీలో సెగపుట్టిస్తుంది, "నేను పార్టీ అధ్యక్షుడిని అయినప్పుడు, నా పార్టీ ఎంపీలు లేదా ఎమ్మెల్యేలు సరిగా పనిచేయనపుడు తప్పెవరిది? నాదే కదా?" అంటూ ఆయన ప్రశ్నించిన విధానం కూడా పార్టీ వర్గాల్లో కలవరాన్ని రేపుతోంది.

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ, ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులను ఉద్దేశించి గడ్కరీ ఈ వ్యాఖ్యలు చేశారు. వ్యక్తులు సరిగా పనిచేయకపోయినా, ఆశించిన ఫలితాలు దక్కకపోయినా నాయకులే బాధ్యత వహించాలని ఆయన అన్నారు. "ఒక విషయాన్ని నిశితంగా పరిశీలించాలి. దేశంలో హోం శాఖ సమర్థంగా పనిచేస్తోందంటే, సుశిక్షితులైన ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులే కారణం. ఐపీఎస్, ఐఏఎస్ అధికారుల్లో చాలా మంది సచ్చీలురని, చక్కగా పని చేస్తూ, తమ విధులను నిర్వర్తిస్తున్నారని నేను నమ్ముతున్నాను’’ అని అన్నారు.

‘‘అదే విధంగా నేను పార్టీ అధ్యక్షుడిని అయి, నా ఎమ్మెల్యేల పనితీరు, నా ఎంపీల పనితీరు సంతృప్తికరంగా లేదంటే అందుకు బాధ్యత నాదే. వారిని నేను సరిగ్గా నడిపించలేదనే భావించాలి" అని గడ్కరీ వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో ఇండియాలో జరుగుతున్న మతపరమైన ద్వేషం పెరగడాన్ని కూడా గడ్కరీ ప్రస్తావించారు. తొలి ప్రధాని నెహ్రూ ప్రసంగాలంటే తనకు ఇష్టమని చెప్పారు. గత వారంలో మూడు రాష్ట్రాల ఓటమికి బీజేపీ జాతీయ నాయకులదే బాధ్యతని వ్యాఖ్యానించిన గడ్కరీ, తాజాగా మరోసారి నిరసన గళం వినిపించడంతో బీజేపీలో వాడివేడి చర్చ జరుగుతోంది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nitin Gadkari  Amit Shah  PM Modi  Narendra Modi  intelligence  three state results  politics  

Other Articles