PM releases AB Vajpayee Rs 100 commemorative coin అటల్ జీ వంద రూపాయల నాణెం విడుదల

Pm modi releases rs 100 commemorative coin on atal bihari vajpayee

100 rs coin, new 100 rs coin, rs 100 coin, Atal Bihari Vajpayee, Atal Bihari Vajpayee coin, 100 coin, 100 rs coin india, 100 rs coin in india, 100 Rupee Coin, pm modi launches 100 rs coin, Vajpayee coin, Vajpayee Rs 100 coin, Special coins India, Vajpayee special coin

PM Narendra Modi released a commemorative coin worth Rs 100 in honour of former prime minister Atal Bihari Vajpayee, who died in August this year.

అటల్ జీ వంద రూపాయల నాణెం విడుదల

Posted: 12/24/2018 02:14 PM IST
Pm modi releases rs 100 commemorative coin on atal bihari vajpayee

మాజీ ప్రధానమంత్రి, బీజేపీ అగ్రనేత అటల్ బిహారీ వాజ్ పేయి జయంతి వేడుకులను పురస్కరించుకుని ఒక రోజు ముందుగానే ఆయన స్మారకార్థం ప్రధాని నరేంద్ర మోదీ రూ.100 నాణెం విడుదల చేశారు. ఈ నాణేనికి ఓ వైపు వాజ్‌పేయి చిత్రంతో పాటు హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఆయన పేరును ముద్రించారు. జనన మరణ సంవత్సరాలను కూడా వాజ్‌పేయి చిత్రం కింద చూడొచ్చు. మరోవైపు అశోక చక్రం, సత్యమేవ జయతే నినాదం, రూ.100 అంకెతో పాటు భారతదేశం పేరును హిందీ, ఇంగ్లీషులో ముద్రించారు.

ఈ నాణెం బరువు 35 గ్రాములు. దీన్ని విడుదల చేసిన సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ... ‘‘అటల్ జీ ఇక మనతో లేరన్న విషయాన్ని నమ్మేందుకు మనసు అంగీకరించడం లేదు. సమాజంలోని అన్ని వర్గాలనుంచి ప్రేమాభిమానాలు అందుకున్న అరుదైన నాయకుడాయన..’’ అని పేర్కొన్నారు.  ఇప్పుడు కొందరు నేతలు ఐదేళ్లు అధికారానికి దూరమైనా ప్రశాంతంగా ఉండలేకపోతున్నారనీ ఆయన విమర్శించారు.

వాజ్ పేయి ఎక్కువ కాలం ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ప్రజల పక్షాన తన గళం వినిపించారన్నారు. ‘‘ప్రజాస్వామ్యమే సర్వోన్నతంగా ఉండాలని వాజ్‌పేయి భావించారు. ఆయన మొదట జన సంఘ్‌ను స్థాపించినప్పటికీ... ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సి వచ్చినప్పుడు జనతా పార్టీలో చేరారు. అలాగే అధికారమా, సిద్ధాంతమా అనేది తేల్చుకోవాల్సి వచ్చినప్పుడు... జనతా పార్టీని కూడా వదిలేసి బీజేపీని స్థాపించారు...’’ అని ప్రధాని పేర్కొన్నారు. అనారోగ్య సమస్యల కారణంగా ఈ ఏడాది ఆగస్టు 16న వాజ్‌పేయి కన్నుమూసిన సంగతి తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : 100 rupee coin  new 100 rs coin  Atal Bihari Vajpayee  PM Narendra Modi  

Other Articles