group 1 and 3 notifications in telangana soon తెలంగాణలో త్వరలో గ్రూప్ 1, గ్రూప్ 3 నోటిఫికేషన్లు

Group 1 and 3 notifications in telangana soon

TRS government, group 1 notification, group 3 notification, job vacancies, TSPSC, employment notification, unemployement youth, TSPSC secretary, Vani Prasad, telangana, politics

The ruling TRS government now keen on fullfilling the vacancies through TSPSC employment notification, as they face ire from the unemployement youth of the state in the last elections.

తెలంగాణలో త్వరలో గ్రూప్ 1, గ్రూప్ 3 నోటిఫికేషన్లు

Posted: 12/19/2018 01:37 PM IST
Group 1 and 3 notifications in telangana soon

నిరుద్యోగ యువతకు తెలంగాణ ప్రభుత్వం త్వరలో శుభవార్తను అందించనుంది. త్వరలో టీఎస్వీఎస్సీ ద్వారా గ్రూప్ 1, గ్రూప్ 3 నోటిఫికేషన్లు వేసి ప్రభుత్వశాఖల్లో వున్న ఖాళీలను భర్తీ చేస్తామని చెప్పింది. ప్రస్తుతం ఈ పోస్టులను భర్తీ చేయడానికి మల్టీజోనల్ నియామకాలు అడ్డంకీగా మారిందని..ఈ విభజన పూర్తయితే త్వరలోనే గ్రూప్ 1, గ్రూప్ 3 పోస్టులు భర్తీ చేస్తామని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ కార్యదర్శ వాణి ప్రసాద్ తెలిపారు.

టీఎస్‌పీఎస్సీ నాలుగో వార్షికోత్సవం సందర్భంగా నాలుగేళ్ల ప్రగతి నివేదికను విడుదల చేసిన వాణీ ప్రసాద్.. త్వరలోనే గ్రూప్ 1, 3 ఉద్యోగ నియామక ప్రకటనలు జారీ చేస్తామని చెప్పారు. మల్టీ జోనల్ విభజన ప్రకియను ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీక్షిస్తున్నారని అమె చెప్పారు. వివిధ ప్రభుత్వ విభాగాల్లోని ఉద్యోగాల భర్తీకి నిర్దేశించిన అర్హతలపై పలువురు నిరుద్యోగులు న్యాయస్థానాలకు ఆశ్రయించారని, టీఎస్‌పీఎస్సీ నియామకాలపై 600 కేసులు దాఖలయ్యాయని అన్నారు.

కోర్టు కేసులను అధిగమిస్తూ ఒక్కో నియామక ప్రక్రియను నిబంధనల మేరకు పూర్తి చేస్తున్నామని వివరించారు. ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించి 53 రకాల సబ్జెక్టుల పరీక్షలు నిర్వహించామని తెలిపారు. పాఠశాల విద్యాశాఖ నిర్ణయించిన మార్కుల పర్సంటేజీ, విద్యార్హతల విషయంలో కొంతమంది అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారని, దీనిపై దాదాపు 110 కేసులు ఉన్నాయన్నారు. ఈ కేసులను పరిష్కరించుకుంటూ నియామకాలు పూర్తి చేయడానికి కొంత సమయం పడుతోందని అభిప్రాయపడ్డారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TRS government  group 1  group 3  notification  TSPSC  Vani Prasad  telangana  politics  

Other Articles