whales playing with swimmer at New Zealand Beach మహిళా స్విమ్మర్ తో అడుకున్న తిమింగళాలు

Killer whales surround new zealand woman in stunning drone footage

killer whales chase swimmer, killer whales with woman swimmer, orcas chasing swimmer, orcas playing with swimmer, drone orcas,drone killer whales, killer whales drone, killer whales woman drone, killer whales playing with swimmer, hahei beach, new zealand, viral video

It was a practice swim like another day for a woman in New Zealand, until some unannounced visitors began swimming alongside her, off the coast of Coromandel.

ITEMVIDEOS: మహిళా స్విమ్మర్ తో ప్రమాదకర తిమింగళాలు ఆట

Posted: 12/17/2018 06:09 PM IST
Killer whales surround new zealand woman in stunning drone footage

సముద్ర తీరంలో స్విమ్మింగ్ చేస్తున్న ఓ మహిళకు అత్యంత భయానక అనుభవాన్ని చవిచూసింది. అమెను ప్రాణాంతకమైన మూడు తిమింగలాలు చుట్టుముట్టాయి. అయితే అమె అదృష్టం బాగుండటంతో అమె ఎలాంటి హానికి గురికాకుండా ఒడ్డుకు చేరింది. న్యూజిలాండ్‌‌లోని హహేయ్ బీచ్‌ వద్ద చోటుచేసుకున్న ఈ ఘటన డ్రోన్ కెమరాలో రికార్డయ్యింది. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో సంచలనంగా మారింది. మహిళకు ఎదురైన అనుభవాన్ని నెట్ జనులు షేర్లు, లైకులతో వీక్షిస్తున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. న్యూజీలాండ్ లోని హహేయ్ ప్రాంతానికి చెందిన జుడీ జాన్సన్ అనే మహిళ ప్రతిరోజూ మాదిరిగానే హహేయ్ బీచ్ లోని సముద్రతీరంలో ఈత ప్రాక్టీస్ చేస్తోంది. ఇంతలో మూడు తిమింగలాలు ఆమెను చుట్టుముట్టాయి. తొలుత వీటిని డాల్ఫిన్లుగా భావించిన జుడీ జాన్సన్...వాటితో కలిసి ఈతకొడుతూ ఎంజాయ్ చేసింది. చివరకు అవి ప్రమాదకర తిమింగలాలుగా తెలుసుకుని భయభ్రాంతికి గురైయ్యింది. ఒక్కసారిగా అమెకు గుండె అగినంత పనైంది.

అవి దాడి చేసే అవకాశం ఉండడంతో వెంటనే అప్రమత్తమైన జుడీ జాన్సన్...సముద్ర నీటిలో నుంచి ఒడ్డుకు వచ్చేసింది. ఆ తరువాత అవి కూడా తనను సరదాగా అడుకుంటున్నాయని తెలిసి మళ్లీ సముద్రంలో తన ఈత ప్రాక్టీసును చేసింది. ఇక తన ఈత ముగిసిన తరువాత అమె ఒడ్డుకు చేరింది. ఈ మొత్తం తతంగాన్ని ఓ పర్యాటకుడికి చెందిన డ్రోన్ కెమరా రికార్డు చేసింది. ఇది జీవితంలో ఒక్కసారి మాత్రమే ఎదురయ్యే అనుభవంగా జుడీ జాన్సన్ పేర్కొంది.

మరణం అంచుల వరకు వెళ్లినట్టు అనిపించినా.. వాటితో కలసి ఈత కొట్టడం తనకు ఎంతో ధ్రిల్లింగ్ గా వుందని చెప్పింది. తనతో ఈత కోట్టిన తిమింగలాల్లో ఒకటి తల్లిగా, మరో రెండు పిల్లలుగా వున్నాయని తెలిపింది. అయితే సహజంగా సముద్రంలో సంచరించే సీల్స్, సీ లయన్స్‌పై దాడి చేసి ఆరగించే ప్రాణాంతక తిమింగలాలు... మనుషులపై మాత్రం అరుదుగానే దాడి చేస్తుంటాయని నిపుణులు చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : killer whales  woman swimmer  drone  hahei beach  new zealand  viral video  

Other Articles