Anchor's death: senior TV journalist arrested యాంకర్ మిస్టరీ మృతి కేసులో జర్నలిస్టు అరెస్టు

Tv anchor radhika kaushik s death co worker arrested by noida police

radhika kaushik, tv anchor radhika kaushik, tv anchor radhika kaushi dead, tv anchor radhika kaushik found dead, tv anchor radhika kaushik death, sector 77 noida, noida, mysterious death, rahul awasthi arrested, zee news anchor rahul awasthi arrested, senior TV journalist, noida, delhi, crime

Rahul Awasthi, a senior anchor of the channel was arrested in TV Anchor Radhika kaushik mysterious death, who was present in the fourth floor Antriksh Forest residence of the victim, Police said.

టీవీ యాంకర్ అనుమానాస్పద మృతి.. సీనియర్ జర్నలిస్ట్ అరెస్ట్

Posted: 12/17/2018 11:30 AM IST
Tv anchor radhika kaushik s death co worker arrested by noida police

జీ న్యూస్ కు చెందిన సీనియర్ జర్నలిస్టు రాహుల్ అవస్థిని ఢిల్లీలోని నోయిడా పోలీసులు అరెస్టు చేశారు. తన సహోద్యోగి యాంకర్ రాధిక కౌషిక్ అనుమానాస్పద మృతి కేసులో ఆయన ప్రమేయం వుందా.? అన్న కోణంలో కేసు విచారిస్తున్న పోలీసులు రాహుల్ అవస్థిని అదుపులోకి తీసుకున్నారు. నొయిడాలో సెక్టార్ 77లో నివసిస్తున్న రాధిక, తన ఇంటి నాలుగో అంతస్తు నుంచి కింద పడి మృతి చెందింది. ఆ సమయంలో రాహుల్ ఆమెతోనే ఉన్నట్టు పోలీసులు తెలిపారు.

రాధిక అనుమానాస్పదంగా మృతి చెందిన నేపథ్యంలో అమె ఇంట్లోనే వున్న రాహుల్ పై పోలీసులు ప్రశ్నించారు. రాధిక పడిపోయినప్పడు తాను వాష్ రూములో రాహుల్ చెప్పినా.. అయన వివరాలు పలు అనుమానాలకు తావిచ్చినట్టు పోలీసులు తెలిపారు. అయితే రాధిక కిందపడి మృతి చెందడానికి కొన్ని క్షణాల ముందు ఇద్దరూ బాల్కనీలో కనిపించినట్టు సెక్యూరిటీ గార్డు చెప్పారని స్థానిక సిఐ శ్వేతభ్ పాండే తెలిపారు.

ఇది హత్య కాదని తొలుత భావించినా, అమె మరణంలో రాహుల్ పాత్ర వుండే అవకాశం ఉందని అనుమానంతో రాహుల్ ను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. రాధిక కటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు రాహుల్ పై  ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. రాధికకు మద్యం తాగే అలవాటు లేదని చెబుతున్న అమె కుటుంబసభ్యులు అమె గదిలో బీరు బాటిళ్లు వున్నాయని చెప్పారు. రాహుల్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని అతనిపై ఉద్దేశపూర్వక హత్య కేసును నమోదుచేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : tv anchor  radhika kaushik  mysterious death  rahul awasthi  senior TV journalist  noida  delhi  crime  

Other Articles