Urjit Patel resigns as RBI governor అర్బీఐ గవర్నర్ పదవికి ఉర్జీత్ రాజీనామా..!

Urjit patel quits as rbi governor amid feud with government

urjit patel resigns, urjit patel, urjit patel resignation, urjit patel resignation news, urjit patel rbi governor, urjit patel rbi governor resigns rbi governor urjit patel, rbi governor urjit patel resigns, rbi governor resigns, rbi new governor, Arun Jaitley, Finance Ministry, RBI, banking news, national politics

Reserve Bank of India Governor Urjit Patel has resigned. Even after he sited personal reasons, speculation of his resignation was differences between the government and the RBI over various issues related to liquidity, credit flow and the controls governing weak banks.

అనుకున్నదే జరిగింది.. అర్బీఐ గవర్నర్ పదవికి ఉర్జీత్ రాజీనామా..!

Posted: 12/10/2018 05:59 PM IST
Urjit patel quits as rbi governor amid feud with government

భారతీయ రిజర్వు బ్యాంకు గవర్నర్ ఉర్జీత్ పటేల్ తన పదవికి రాజీనామా చేశారు. తమ అదుపాజ్ఞలలోనే భారతీయ రిజర్వు బ్యాంకు కూడా పనిచేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు సాగిస్తుందన్న అరోపణలు వినిపిస్తున్న క్రమంలో ఆయన తీసుకున్న నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర వ్యవహార శైలితో అసంతృప్తిగా వున్న ఆయన గత నెలలోనే రాజీనామా చేస్తున్నారన్న వార్తలు కూడా వినిపించాయి. అయితే ఇవాళ ఉర్జీత్ పటేల్ తన పదవికి రాజీనామా చేశారు.

రిజర్వు బ్యాంకుపై అధిపత్యం కోసం ఇప్పటికే పలు సవరణలను తీసుకువచ్చిన కేంద్రం.. తాజాగా మరిన్ని సవరణలు చేయనుందన్న వార్తలు రాగా, అర్బీఐ గవర్నింగ్ బాడీ కూడా తేల్చిచెప్పిందన్న వార్తలు వినిపించాయి. ఇక లాభాలు క్షీణించిన బ్యాంకులకు నిర్వహణ సహా కేంద్రానికి నిధులను ఇచ్చే విషయంలోనూ ఆయన కేంద్ర ఒత్తిళ్లకు లోంగకపోవడమే ఆయన రాజీనామాకు దారితీస్తుందన్న వార్తలు వచ్చాయి.ఈ నేపథ్యంలో అర్థిక మంత్రత్వశాఖకు తనకు కూడా చెడిందనే వార్తలు వినిపించాయి.

ఉద్దేశపూర్వక ఎగవేతదారుల జాబితాను విషయంలో కేంద్ర మార్గదర్శకాలకు, దేశ సర్దోన్నతన న్యాయస్థానం అదేశాలకు మధ్య అర్బీఐ గవర్నర్ హోదాలో నలిగిపోయిన ఉర్జిత్ పటేల్.. అప్పుడే తన పదవికి రాజీనామా చేస్తున్నారన్న వార్తలు వినిపించాయి. ఈ వ్యవహరంలో కేంద్ర అర్థిక శాఖ, ప్రధానమంత్రి కార్యాలయం నుంచి నోటీసులు జారీ కావడంతో ముప్పేట దాడిని ఎదుర్కొంటున్న ఆయన ఈ నిర్ణయానికి వచ్చారని కూడా సమాచారం.

అప్పటికే అక్టోబర్ నెలలోనే పదవికి రాజీనామా చేయాలని ఆయన బావించిన క్రమంలో ఆయనతో కేంద్ర అర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఫోన్ ద్వారా సంబాషించిన క్రమంలో ఆయన తన రాజీనామా నిర్ణయాన్ని మానుకున్నారు. కాగా తాజా పరిణామాల నేపథ్యంలో తాను టార్గెట్ అవుతున్నానని, ఉర్జిత్ స్నేహితుల వద్ద వాపోయారని తెలిసింది. ఈ పరిణామాలు తన అరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయని ఆయన వాపోయినట్లు కూడా వార్తలు అందాయి.

2016లో ఆర్బీఐ గవర్నర్ గా ఊర్జిత్ పటేల్ బాధ్యతలను స్వీకరించారు. 2019 సెప్టెంబర్ వరకు ఆయన పదవీకాలం ఉంది. ఊర్జిత్ పటేల్ హయాంలోనే పెద్దనోట్ల రద్దు జరిగింది. ఊర్జిత్ రాజీనామా కేంద్ర ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లోకి నెట్టే అవకాశాలు ఉన్నాయి. శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో ఈ అంశాన్ని విపక్షాలు అస్త్రంగా మలచుకునే అవకాశం ఉంది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles