poll officials suspended after Ballot unit found on road రోడ్డుపై లభించిన బ్యాలెట్ బాక్సు.. అధికారుల సస్పెన్షన్..

Two poll officials suspended after ballot unit found on road

ballot box on shahabad road, ballot box on road in Rajasthan, ballot box on road in kishanganj, ballot box on road in baran district, ballot box on road poll officials suspended, Rajasthan assembly elections 2018, assembly elections 2018, Assembly Elections, Ballot, ballot box, shahabad road, kishangunj constituency, baran district, poll officials, rajasthan, Rajasthan politics

Two poll officers were suspended after a ballot box was found on the road in Kishanganj Assembly Constituency during the Rajasthan Assembly Elections that was held on Friday, December 7.

ITEMVIDEOS: రోడ్డుపై లభించిన బ్యాలెట్ బాక్సు.. అధికారుల సస్పెన్షన్..

Posted: 12/08/2018 12:56 PM IST
Two poll officials suspended after ballot unit found on road

రాష్ట్రంలో ఏ ప్రభుత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారో తెలిపే బ్యాలెట్ బాక్పు రోడ్డుపై లభించింది. ఓటర్లు తమ తీర్పును నమోదు చేసిన తరువాత తిరిగి స్థానిక కేంద్రంలో తమ బ్యాలెట్ బాక్సును అప్పగించే క్రమంలో తరలిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. బ్యాలెట్ బాక్సుల తరలింపు విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో.. ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ విషయం అలస్యంగా వెలుగులోకి రావడంతో తక్షణ చర్యలు తీసుకున్న ఉన్నతాధికారులు.. ఇద్దరు పోలింగ్ అధికారులను సస్పెండ్ చేశారు.

వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్ లో పోలింగ్ అధికారులు బ్యాలెట్ బాక్సుల తరలింపులో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఓ బ్యాలెట్ బాక్స్ రోడ్డు మీద పడిపోయింది. బారన్ జిల్లాలోని కిషన్‌గంజ్‌ అసెంబ్లీ నియోజకవర్గంలోని షాహబాద్‌ ఏరియాలో ఈ ఘటన జరిగింది. పోలింగ్ తర్వాత వాహనాల్లో ఈవీఎంలను స్ట్రాంగ్ రూంకు తరలిస్తుండగా బ్యాలెట్ బాక్స్ కిందపడిపోయింది. అయితే ఈ విషయాన్ని ఎన్నికల విధులు నిర్వహించి ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు గమనించారు.

తర్వాత ఆ బ్యాలెట్‌ బాక్స్ ను వారు కిషన్‌గంజ్‌లో మిగతా ఈవీఎంలు ఉన్న స్ట్రాంగ్‌ రూమ్‌కు తరలించారు. ఈ ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు అధికారులు అబ్దుల్‌ రఫీక్‌, నవల్‌ సింగ్‌ పట్వారీలను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. కాగా, మరో ఘటనలో రిటర్నింగ్ అధికారిని అధికారులు తొలగించారు. రాజస్థాన్ లోని పాలి నియోజకవర్గంలో ఓ బీజేపి అభ్యర్థి నివాసంలో ఓ ఈవీఎం యంత్రం పట్టబడటంతో అధికారులు రిటర్నింగ్ అధికారిపై చర్యలు తీసుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ballot box  shahabad road  kishangunj constituency  baran district  poll officials  rajasthan  

Other Articles