SC: Quota can't exceed 50 percent తెలంగాణ పంచాయితీలో పరిధి మించరాదు: సుప్రీం

Sc quota can t exceed 50 percent telangana withdraws plea

telangana panchayat polls, Supreme Court, reservations on panchayat polls, TRS government, Telangana local body elections, TRS, K Chandrashekar Rao, Congress, Telangana Government, Telangana, Panchayati Raj, Constitution of India, Telangana Politics

Telangana withdrew its plea for enhancement of reservations for BCs, SCs and STs in panchayati raj and other local bodies after the Supreme Court refused to allow the state to enhance the quota beyond 50 percent.

తెలంగాణ పంచాయితీలో పరిధి మించరాదు: సర్వోన్నత న్యాయస్థానం

Posted: 12/08/2018 12:09 PM IST
Sc quota can t exceed 50 percent telangana withdraws plea

పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదని దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పంచాయతీ ఎన్నికల్లో ఆయా వర్గాలకు రిజర్వేషన్ల కేటాయింపు గరిష్ఠంగా 50 శాతానికి మించడానికి వీల్లేదని ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను అత్యున్నత న్యాయస్థానం సమర్థించింది. హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయగా, దానిని విచారించిన సర్వోన్నత న్యాయస్థానం ఈ మేరకు తీర్పును వెలువరించింది. జస్టిస్‌ రోహింగ్టన్‌ నారీమన్‌, జస్టిస్‌ కేఎం జోసెఫ్‌లతో కూడిన ధర్మాసనం విచారణ తరువాత స్పష్టం చేసింది.

విభజన తర్వాత తెలంగాణలో బీసీల జనాభా గణనీయంగా పెరిగిందని, రిజర్వేషన్లు 50 శాతం కన్నా ఎక్కువ పెంచుకొనే అవకాశం ఇవ్వాలని కోరారు. పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు 34 శాతం, ఎస్సీలకు 20, ఎస్టీలకు 7 శాతం కలిపి మొత్తం 61 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని కోర్టుకు వివరించారు. ఈ వివరణపై స్పందించిన ధర్మాసనం.. తెలంగాణలో బీసీ జనాభా ఎక్కువ ఉండొచ్చు కానీ గతంలో రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పు మేరకు పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లు 50 శాతం కన్నా ఎక్కువ ఉండటానికి వీల్లేదని వ్యాఖ్యానించింది.

ఇందిరా సాహ్నీ కేసులో సుప్రీం తీర్పు అనంతరం రిజర్వేషన్లు 50 శాతమే కొనసాగుతున్నాయని ధర్మాసనం గుర్తు చేసింది. ఈ నేపథ్యంలో 50 శాతానికి లోబడే రిజర్వేషన్లు ఉండాలని స్పష్టం చేసింది. హైకోర్టు ఇచ్చింది మధ్యంతర ఉత్తర్వులే కాబట్టి మళ్లీ అక్కడకే వెళ్తామని, సుప్రీంకోర్టులో పిటిషన్‌ ఉపసంహరించుకుంటామని తెలంగాణ ప్రభుత్వం తరఫు న్యాయవాది ధర్మాసనానికి తెలిపారు. దీంతో పిటిషన్‌ కొట్టివేస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది.

వీటిపై గత జులై 9న విచారణ చేపట్టిన హైదరాబాద్ హైకోర్టు రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదని స్పష్టం చేసింది. బీసీ జనాభాను లెక్కించినా, లెక్కించకపోయినా రిజర్వేషన్ల ఖరారు అంశంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు 50 శాతం మించకూడదని, బీసీల్లో ఏ, బీ, సీ,డీలుగా రిజర్వేషన్లు కల్పించే అంశం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశమని పేర్కొంది. అలాగే, 50 శాతానికి మించి రిజర్వేషన్లు కల్పించడం సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును ఉల్లంఘించడమేనని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : panchayat polls  Telangana  Supreme Court  Telangana Government  Telangana Politics  

Other Articles