thief tries to flee gold shop foiled by locked door ఈ గొలుసు దొంగది నిజంగా బ్యాడ్ టైమే..

Bungling thief tries to flee gold shop foiled by locked door

CCTV, CCTV footage, thief, stupid, jewellery, gold chain, police, thailand, Crime, viral News, viral video, WorldNews

This thief had a bad day at work! A surveillance camera footage released by Thai police shows a bungling thief trying to flee a jewelry shop with a gold chain only to be foiled by a locked door.

ITEMVIDEOS: ఈ గొలుసు దొంగది నిజంగా బ్యాడ్ టైమే..

Posted: 12/06/2018 04:54 PM IST
Bungling thief tries to flee gold shop foiled by locked door

మన తెలుగు సినిమాల్లో చెప్పినట్లు టైం బాగుంటే.. పామును పట్టుకున్న తాడవుతుందని, అదే వెక్కిరిస్తే.. ఎంత బాగా ప్లాన్ చేసినా.. చివరాఖరున ఏదో ఉపద్రవం వచ్చిపడుతుందని.. టైమ్ రా టైం అంటూరు. సరిగ్గా అలాగే జరిగింది ఈ ఘటన. ఈ దొంగ టైం కూడా ఏ మాత్రం బాగోలేదో. ఎందుకంటే అన్న వివరాల్లోకి వెళ్లే ముందు.. తానోకటి తలిస్తే.. దైవం మరోటి తలచిందన్నట్లు అడ్డంగా దొరికిపోయి బుకైన ఈ దొంగతనం ఘటనను చూసి నవ్వు అపుకోలేరు.

కొత్తగా దొంగతనాలు చేయడం మొదలెట్టాడో లేక... కంగారులో కన్ఫ్యూజ్ అయ్యాడో కాని చోరీ చేయబోయి... అడ్డంగా బుక్కయ్యాడు. దొంగ ప్రవర్తనను ముందుగానే గుర్తించి, జాగ్రత్త పడిన ఆ షాపు యజమాని సమయస్ఫూర్తితో వ్యవహారించి... దొంగను పట్టుకున్నాడు. నగల దుకాణంలోకి ఎంటరైన ఓ యువకుడు... ఓ ఖరీదైన నగను చూపించమని కోరాడు. అడిగిన వెంటనే ఆ నగను తీసి చూపించాడా షాపులో సేల్స్ మెన్. దాన్ని మెడలో వేసుకుని కొద్దిసేపు ఎలా ఉందో చెక్ చేసుకుంటున్నట్టుగా నటించాడు.

సేల్స్ మెన్ కొద్దిగా పక్కకు తిరగానే పరుగెత్తి పారిపోవాలని ప్రయత్నించాడు. ఔనా.! అంటున్నారా.. పరుగు లంఖించుకున్నాడు. అయితే తీరా డోర్ వద్దకు వెళ్లగానే అది తెరుచుకోలేదు. మనోడి పరిస్థితి జులాయి చిత్రంలో బ్రహ్మానందం దొంగతనంలా మారింది. ఇక తెల్లముఖం వేసుకున్న దోంగ ఏం చేయాలో తెలియని పరిస్థితికి చేరుకున్నాడు. ఇంకేం చేసినా డోర్ తప్పించుకోలేనని అర్థం చేసుకుని... వెనక్కి వచ్చి మెడలో వేసుకున్న నెక్లెస్ ను తీసి ఇచ్చేశాడు. షాపు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో... వాళ్లు వచ్చి మనోడిని అరెస్ట్ చేశారు.

ఇంతకీ డోర్ ఎందుకు తెరుచుకోలేదు.. అనేగా మీ డౌట్. అతను నగల షాపులోకి వస్తున్నప్పుడే అతని ప్రవర్తనను గుర్తించిన షాపు యజమాని.. ముందు జాగ్రత్త చర్యగా రిమోట్ కంట్రోలర్ ద్వారా డోర్స్ లాక్ చేశాడు. ఈ విషయం తెలియని కుర్ర దొంగ ఎంత ప్రయత్నించినా డోర్ తెరుచుకోలేదు. థాయిలాండ్ లో నవంబర్ 30న జరిగిన ఈ విచిత్ర సంఘటన మొత్తం సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది. దాన్ని కాస్తా యూట్యూబ్‌లో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసినవాళ్లందరూ బ్యాడ్ లక్ అంటే మనోడిదే... అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇక అలస్యమెందుకూ మీరూ ఈ వీడియోను చూడండీ..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : CCTV  CCTV footage  thief  stupid  jewellery  gold chain  police  thailand  Crime  viral News  viral video  WorldNews  

Other Articles

 • Scr introduces magic box to make train journey a thrill

  రైలు ప్రయాణం.. మ్యాజిక్ బాక్స్ తో వినోదాత్మకం..

  Feb 14 | సుదూర ప్రాంతాలకు ప్రయాణించే సమయంలో కాస్త అటవిడుపు, ఆహ్లాదాన్ని పంచే పరిస్థితులు ఉండాలని ప్రయాణికులు కోరుకుంటారు. ముఖ్యంగా రైలు  ప్రయాణంలో ఇది అత్యంత అవశ్యం. దీన్ని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే ‘మ్యూజిక్‌... Read more

 • Pawan kalyan inaugurates sri vasavi kanyaka parameshwari idol

  ‘‘థర్మం దారితప్పితే.. కన్యకా పరమేశ్వరే మార్గదర్శకం..’’

  Feb 14 | జనసేన పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత పెనుగొండ ఊరు పేరుని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి పెనుగొండ’గా మారుస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండలో శ్రీ వాసవి... Read more

 • Bjp operation lotus yeddurappa caught again in audio tapes

  ‘‘కర్ణాటకలో ప్రలోభాల పర్వం.. కాదేదీ రాజకీయ అనర్హం’’

  Feb 14 | కర్ణాటకలో బీజేపి అగ్రనేతలపై అధిష్టానం కత్తి పెట్టిందా.? ఎలాగైనా రాష్ట్రంలోని కుమారస్వామి ప్రభుత్వాన్ని పడగొట్టి.. బీజేపి ప్రభుత్వాన్ని నెలకొల్పాన్న వాంఛతో వుందా.? అందుకనే అక్కడ జరుగుతున్న బేరసారాలు, ప్రలోభాలు వెలుగులోకి వస్తున్నా.. వాటిపై కిమ్మనకుండా... Read more

 • 12 crpf jawans killed many injured in jk terror attack

  పేట్రేగిపోయిన ముష్కరులు.. 12 మంది జవాన్ల మృతి.. కాశ్మీర్లో బీభత్సం..

  Feb 14 | జమ్మూకశ్మీర్లో ఉగ్రవాద ముష్కరులు పేట్రేగిపోయారు. నెత్తుటేరులు పారించారు. సరిహద్దు ప్రాంతంతో పాటుగా జమ్మూకాశ్మీర్ లో శాంతిభద్రలే లక్ష్యంగా గస్తీ నిర్వహిస్తున్న భద్రతా బలగాలే లక్ష్యంగా మరోసారి పిరికిపంద చర్యకు ఒడిగట్టారు. పుల్వామా జిల్లాలో అవంతీపుర... Read more

 • Sensational twist in coastal bank director chigurupati jayaram case

  జయరాం హత్యకేసులో సంచలన ట్విస్టు

  Feb 14 | తెలుగురాష్ట్రాలలో సంచలనం సృష్టించిన ప్రవాసాంధ్ర వ్యాపారవేత్త, కోస్టల్ బ్యాంక్ డైరెక్టర్, పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసు మరో మలుపు తిరిగింది. జయరాం సతీమణి పద్మశ్రీ తన భర్తకు ఎలాంటి అర్థికఇబ్బందులు లేవని, తాను... Read more

Today on Telugu Wishesh