Arrangements done for TS Polls: CEO Telangana తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి: సీఈఓ

All arrangements done for telangana assembly polls ceo rajat kumar

KCR, TRS, Rahul Gandhi, chandrababu, kodandaram, Congress, Mahakutami, election commission, telangana elections 2018, Telangana Electtions, praja kutami, telangana assembly elections, telangana politics

Telangana CEO Rajat Kumar said all the precautionary measures have been taken to ensure that Assembly polls can be conducted on a smooth and peaceful manner.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి: సీఈఓ

Posted: 12/05/2018 07:02 PM IST
All arrangements done for telangana assembly polls ceo rajat kumar

తెలంగాణ సహా రాజస్తాన్ లలో ఒకే దశలో ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇవాళ సాయంత్రం ఐదు గంటలకు ఎన్నికల ప్రచారానికి తెరపడటంతో రాజకీయ పార్టీల మైకులు మూగబోయాయి. సభలు, ఊరేగింపులు, సినిమా, టీవీల సోషల్ మీడియా ద్వారా ప్రచారంపై ఆంక్షలు పెట్టారు. అసెంబ్లీ రద్దు చేసి.. ముందస్తు ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం వెళ్లిన నేపథ్యంలో గత రెండు నెలలుగా కొనసాగుతున్న ప్రచారహోరుకు తెరపడింది.

ఈ నెల 7న జరుగునన్న ఎన్నికల కోసం ఎన్నికల సంఘం అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో ఎన్నికల పోలింగ్‌ నిర్వహణ కోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లూ చేసింది. ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. రాష్ట్రంలోని అన్ని పోలింగ్ కేంద్రాలను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. పోలింగ్ కేంద్రాల దగ్గర సౌకర్యాలు కల్పిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 32815 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

అత్యధికంగా హైదరాబాద్‌లో 3873, వనపర్తిలో 280 పోలింగ్‌కేంద్రాలు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో అత్యధికంగా శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలో పోలింగ్ బూత్ లు ఏర్పాటు చేసిన అధికారులు.. భద్రాచలం నియోజకవర్గం పరిధిలో అత్యల్ప సంఖ్యలో పోలింగ్ బూత్ లు ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికల బరిలో మొత్తం 1821 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఎన్నికల విధుల కోసం 1,60,509 మంది సిబ్బందిని కేటాయించారు.

ఎన్నికల కోసం 55,329 బ్యాలెట్‌ యూనిట్లు, 42,751 వీవీప్యాట్‌ యంత్రాలు, 39,763 కంట్రోల్‌ యూనిట్లను వినియోగించనున్నారు. ఎన్నికల విధుల్లో 649 మంది సహాయక రిటర్నింగ్‌ అధికారులు ఉంటారు. ఎన్నికల విధుల కోసం 279 మంది కేంద్ర కంపెనీల బలగాలు రాష్ట్రంలో మోహరించనున్నాయి. 30వేల మంది రాష్ట్ర భద్రతా సిబ్బంది విధుల్లో పాల్గొననున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2,80,64,684 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ ఎన్నికల ఫలితాలు ఈ నెల 11న వెలువడనున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : KCR  TRS  Rahul Gandhi  chandrababu  kodandaram  Congress  Mahakutami  telangana politics  

Other Articles