vote for the most transperancy government: JanaSena పారదర్శక ప్రభుత్వానికే ఓటు: పవన్ పిలుపు

Vote for the most transperancy government pawan kalyan

pawan kalyan, janasena, Pawan Kalyan JanaSena, Telangana janasena, transperancy government, telangana assembly elections 2018, telangana elections, Telangana, politics

Actor turned politician Jana Sena chief pawan kalyan calls his party activists of telangana to vote for the best and most transperancy government.

ITEMVIDEOS: పారదర్శక ప్రభుత్వానికే జనసైనికుల ఓటు: పవన్ పిలుపు

Posted: 12/05/2018 03:29 PM IST
Vote for the most transperancy government pawan kalyan

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముందస్తుగా రావటంతోనే ఈ ఎన్నికలలో పోటీ చేసే అవకాశాన్ని కొల్పోయామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే కొన్ని స్థానాల్లో అయినా పోటీకి దిగుదామని భావించినా.. అది కూడా సాధ్యపడలేదని ఆయన ఇదివరకు స్పష్టం చేశారు. ఈ క్రమంలో మరికొన్ని నిమిషాల వ్యవధిలో తెలంగాణలో ప్రచారపర్వానికి తెరపడనున్న సందర్భంలో తమ పార్టీ క్యాడర్, పార్టీ శ్రేణులు, జనసైనికులు, అభిమానులకు పవన్ కల్యాణ్ తన సందేశాన్ని ఇచ్చారు.

తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని, త్యాగాలను పూర్తిగా అర్థం చేసుకున్న వ్యక్తిని తానని... అందుకే తనకు తెలంగాణ అంటే ఎనలేని గౌరవమని పవన్ కల్యాణ్ తెలిపారు. తెలంగాణకు ముందస్తు ఎన్నికల నేపథ్యంలో అప్పటికే తాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తన పర్యటనలను నిర్దేశించుకున్నానని చెప్పారు. సమయం తక్కువగా ఉండటం వల్ల, తెలంగాణలో తాను ఎక్కువ సమయాన్ని కేటాయించలేక పోయానని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా తెలంగాణ కవి దాశరధీని గుర్తు చేసుకున్న ఆయన.. తన క్యాడర్ కు మాత్రం ఎవరికి ఓటు వేయాలన్న విషయాన్ని సూచించారు.

ప్రస్తుతం తెలంగాణను ఇచ్చామనేవాళ్లు, తెలంగాణను తెచ్చామనేవాళ్లు, తెలంగాణను దించామనేవాళ్లు ఇప్పుడు ఈ ఎన్నికలలో మన ముందు ఉన్నారని... వారిలో ఎవరికి ఓటు వేయాలి, ఎవరికి వేయరాదనే అయోమయంలో తమ పార్టీ శ్రేణులు, జనసైనికులు, అభిమానులు ఉన్నారని తెలిపారు. అయితే తెలంగాణలో ఎక్కువ పారదర్శకత, తక్కువ అవినీతితో ఎవరైతే మంచి పాలనను అందిస్తారో... లోతుగా ఆలోచించి వారికి ఓటు వేయాలని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  janasena  Telangana janasena  transperancy government  Telangana  politics  

Other Articles