EC barrs vikarabad SP from election duties డీజీపీ హాజరుకావాల్సిందేనన్న హైకోర్టు.. వికారాబాద్ ఎస్పీపై బదిలీ వేటు..

Hyderabad high court calls revanth reddy s detention illegal

revanth reddy, vikarabad SP, T Annapurna, Transfer, election commission, TRS, Congress, Telangana PCC, KCR rally, Harish Rao, Rajat Kumar, CEO, Telangana assembly elections, Telangana elections 2018, telangana politics

THE Hyderabad High Court came down heavily on Telangana government for over the “abrupt detention” of Congress leader A Revanth Reddy. MeanWhile Election commission bars Vikarabad SP T Annapurna from election duties transfers to Police HeadQuarters.

డీజీపీ హాజరుకావాల్సిందేనన్న హైకోర్టు.. వికారాబాద్ ఎస్పీపై బదిలీ వేటు..

Posted: 12/05/2018 02:43 PM IST
Hyderabad high court calls revanth reddy s detention illegal

తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అరెస్ట్ వ్యవహారాన్ని ఎన్నికల సంఘం సీరియస్‌గా తీసుకుంది. తొలుత రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ సభ నేపథ్యంలో కొండగల్ బంద్ కు కాంగ్రెస్ ప్రకటించిందని, ఇందుకు సంబంధించిన వీడియోలు, పేపర్ కట్టింగ్లను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపామని, వారి అదేశాల మేరకు ఆయనపై చర్యలు తీసుకన్నామని పోలీసుల చర్యలను సమర్థించుకున్న ఈసీ అధికారులు.. రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టు సీరియస్ కావడంతో దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది.

వికారాబాద్‌ జిల్లా ఎస్పీ టి.అన్నపూర్ణపై ఎన్నికల సంఘం అధికారులు బదిలీ వేటు వేశారు. వికారాబాద్ జిల్లాకు అన్నపూర్ణ స్థానంలో 2005 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన అవినాశ్‌ మొహంతిని ఎస్పీగా నియమించింది. ఈ నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని కమిషన్‌ తెలిపింది. అన్నపూర్ణను పోలీస్‌ హెడ్‌ క్వార్టర్స్ కు అటాచ్‌ చేయాలని కూడా అదేశించిన ఎన్నికల సంఘం.. అమెకు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల విధులకు సంబంధించి ఎలాంటి బాధ్యతలు అప్పగించరాని కూడా ఆదేశించింది.

ఇవాళ మధ్యహ్నం రెండు గంటలల్లోగా అవినాశ్ మహంతిని బాధ్యతలు చేపట్టాలని ఎన్నికల సంఘం జారీచేసిన అదేశాలలో పేర్కోంది. కాగా, ప్రస్తుతం ఆయన ఢిల్లీలో వున్న నేపథ్యంలో ఆయనకు పోలీసు అధికారులు సమాచారం అందించనున్నారు. టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అరెస్ట్‌ వ్యవహారంలో ఎన్నికల సంఘం చర్యలకు ఉపక్రమించింది. తెలంగాణ కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ గా వున్న రేవంత్ రెడ్డి కొడంగల్ లోని నివాసంలోకి వెళ్లిన పోలీసులు ఆయన గేటు తాళాలను బద్దలుగొట్టి మరీ అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే.

ఈ ఘటనపై కాంగ్రెస్‌ నేతలు హైకోర్టులో సవాల్‌ చేయగా, హైకోర్టు పోలీసుల తీరుపై తీవ్ర అగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనపై ఇంటెలిజెన్స్ నివేదిక తనకు అందజేయాలని అదేశించిన హైకోర్టు.. ఇవాళ కూడా ఈ వ్యవహారంపై కీలక వ్యాఖ్యలు చేసింది. అర్ధరాత్రి ఇంటికి వెళ్లి రేవంత్ ను అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారానికి సంబంధించి రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. అయితే, ఎన్నికల విధుల్లో డీజీపీ బిజీగా ఉన్నారని అడ్వొకేట్ జనరల్ హైకోర్టుకు తెలిపారు. ఇంటెలిజెన్స్ సమాచారం మేరకే రేవంత్ ను అరెస్ట్ చేశామని చెప్పారు.

దీనిపై హైకోర్టు ధర్మాసనం స్పందిస్తూ, ఇంటెలిజెన్స్ నివేదిక ఆధారంగా అర్ధరాత్రి వెళ్లి అరెస్ట్ చేస్తారా? అని ప్రశ్నించింది. డీజీపీ కోర్టు ముందు హాజరు కావాల్సిందేనని, అరెస్ట్ వ్యవహారంపై సమాధానం ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసింది. తాము కూడా కేసుల విచారణలో బిజీగా ఉన్నామని... కోర్టుకు రావడానికి డీజీపీ ఒక్క గంట సమయాన్ని కేటాయించలేరా? అని కోర్టు ప్రశ్నించింది. డీజీపీ కోర్టుకు వచ్చి నేరుగా సమాధానం ఇవ్వాలని ఆదేశిస్తూ మధ్యాహ్నం 2.30 గంటలకు తదుపరి విచారణను వాయిదా వేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : revanth reddy  vikarabad SP  T Annapurna  Transfer  election commission  telangana  politics  

Other Articles

 • Scr introduces magic box to make train journey a thrill

  రైలు ప్రయాణం.. మ్యాజిక్ బాక్స్ తో వినోదాత్మకం..

  Feb 14 | సుదూర ప్రాంతాలకు ప్రయాణించే సమయంలో కాస్త అటవిడుపు, ఆహ్లాదాన్ని పంచే పరిస్థితులు ఉండాలని ప్రయాణికులు కోరుకుంటారు. ముఖ్యంగా రైలు  ప్రయాణంలో ఇది అత్యంత అవశ్యం. దీన్ని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే ‘మ్యూజిక్‌... Read more

 • Pawan kalyan inaugurates sri vasavi kanyaka parameshwari idol

  ‘‘థర్మం దారితప్పితే.. కన్యకా పరమేశ్వరే మార్గదర్శకం..’’

  Feb 14 | జనసేన పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత పెనుగొండ ఊరు పేరుని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి పెనుగొండ’గా మారుస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండలో శ్రీ వాసవి... Read more

 • Bjp operation lotus yeddurappa caught again in audio tapes

  ‘‘కర్ణాటకలో ప్రలోభాల పర్వం.. కాదేదీ రాజకీయ అనర్హం’’

  Feb 14 | కర్ణాటకలో బీజేపి అగ్రనేతలపై అధిష్టానం కత్తి పెట్టిందా.? ఎలాగైనా రాష్ట్రంలోని కుమారస్వామి ప్రభుత్వాన్ని పడగొట్టి.. బీజేపి ప్రభుత్వాన్ని నెలకొల్పాన్న వాంఛతో వుందా.? అందుకనే అక్కడ జరుగుతున్న బేరసారాలు, ప్రలోభాలు వెలుగులోకి వస్తున్నా.. వాటిపై కిమ్మనకుండా... Read more

 • 12 crpf jawans killed many injured in jk terror attack

  పేట్రేగిపోయిన ముష్కరులు.. 12 మంది జవాన్ల మృతి.. కాశ్మీర్లో బీభత్సం..

  Feb 14 | జమ్మూకశ్మీర్లో ఉగ్రవాద ముష్కరులు పేట్రేగిపోయారు. నెత్తుటేరులు పారించారు. సరిహద్దు ప్రాంతంతో పాటుగా జమ్మూకాశ్మీర్ లో శాంతిభద్రలే లక్ష్యంగా గస్తీ నిర్వహిస్తున్న భద్రతా బలగాలే లక్ష్యంగా మరోసారి పిరికిపంద చర్యకు ఒడిగట్టారు. పుల్వామా జిల్లాలో అవంతీపుర... Read more

 • Sensational twist in coastal bank director chigurupati jayaram case

  జయరాం హత్యకేసులో సంచలన ట్విస్టు

  Feb 14 | తెలుగురాష్ట్రాలలో సంచలనం సృష్టించిన ప్రవాసాంధ్ర వ్యాపారవేత్త, కోస్టల్ బ్యాంక్ డైరెక్టర్, పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసు మరో మలుపు తిరిగింది. జయరాం సతీమణి పద్మశ్రీ తన భర్తకు ఎలాంటి అర్థికఇబ్బందులు లేవని, తాను... Read more

Today on Telugu Wishesh