Man jumps from one terrace to another ఒళ్లు గగ్గురుపోడిచే సాహస స్టంట్.. వీడియో వైరల్..

Watch man jumps from one terrace to another in mumbai s parel area

Mumbai, Parel, stunt, daredevilry stunt, man jumps from terrace, Prabhadevi railway station, viral video, video viral, social media

In a shocking case of daredevilry, a youth can be seen jumping from the terrace of a highrise building to another terrace in Mumbai's Parel area.

ITEMVIDEOS: ఒక భవనంపై నుంచి మరోదానిపైకి.. ప్రయత్నించకండీ..!

Posted: 11/28/2018 01:15 PM IST
Watch man jumps from one terrace to another in mumbai s parel area

సహసం చేయరా డింబకా.. అంటూ పెద్దలు, సినీ కవులు చెప్పిన మాటలు చెవిన ఎక్కించుకున్నాడో లేక ఏదో ఒకటి సాధించడానికే జన్మనెత్తాని భావించాడో తెలియదుకానీ.. చూడడానికే ఒళ్లు గగ్గుర్పొడిచే సాసహానికి నడుం చుట్టాడు. ఒక్క అంగుళం అగుడు అటు ఇటు అయినా అతని ప్రాణం గాల్లో కలిస్తుంది. అతను అనుకున్న సాహస స్టంటు విషాదంగా ముగుస్తుంది. ఇది చేయడానికి ఎంతో ధైర్యం కావాలి. ముందు నేలపై ఎంత దూరం లాంగ్ జంప్ చేయగలనో చూసుకునేలా అతను ప్రయత్నం చేయగలిగినా.. వాస్తవానికి గాలిలో ఎంతో ఎత్తుపై చేయడానికి తేడా చాలానే వుంటుంది.

కానీ అది సాథ్యమయ్యేలా చేశారు. ఎంత ప్రాక్టీసు చేసినా.. ఈ సాహస స్టంటు చేయడం ఎంతో కష్టం. ఇంతకీ అతను ఏం చేశాడంటే.. ఒక బహుళ అంతస్థు భవనంపై నుంచి మరో బహుళ అంతస్థు పైకి జంప్ చేశాడు. అయితే ఈ జంప్ చేసే క్రమంలో సరిగ్గా అవతలి భవనంపై నిర్మించిన పిట్టగోడపైకి ఎగిరి అక్కడ అసరా తీసుకుని మరోమారు గాల్లోకి ఎగిరి భవంతి టెర్రస్ పైకి దూకి పట్టు తప్పినా.. తన స్టంట్ మాత్రం విజయవంతంగానే ముగించాడు.

ముంబైలోని ప్రతిభా దేవి రైల్వే స్టేషన్ కు సమీపంలో యువకుడు ఈ సాహాసాన్ని చేశాడు. వెన్నులో వణుకు పుట్టించే ఈ సాహసాన్ని దేశంలోని యువకులు ఎవరూ చేయకూడదని, తెలుగు విశేష్ అపీల్ చేస్తుంది. ఎందుకుంటే ఇలాంటి స్టంట్లు చేస్తే.. ఏ మాత్రం అటుఇటు అయినా.. ఎలాంటి అపశృతి దొర్లినా విషాద వార్తను వినాల్సి వచ్చేంది. ఇప్పుడీ ముంబై యువకుడి వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.

అయితే ఈ సాహస యువకుడిని అరెస్టు చేయాలని ముంబై పోలీసు ఉన్నాతాధికారులు అదేశాలు జారీ చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఇలాంటి ప్రయత్నాలు చేసినందుకు గాను, జాగ్రత్త చర్యలు తీసుకోకుండా స్టంటు చేసినందుకు అతడ్ని పోలీసులు అరెస్టు చేసే పనిలో వున్నారు. ఇలాంటి సాహసాహాలతో అతని ప్రాణాలతో పాటు.. దీనిని ప్రయత్నించే యువకుల ప్రాణాలకు కూడా ప్రమాదం పోంచివుందనే పోలీసులు అభియోగాలు మోపనున్నారు. ఇంకెదుకు అలస్యం మీరూ ఈ వీడియోను వీక్షించండీ.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles