Fans pay final farewell to Ambareesh అంబరీష్ కు కన్నీటి వీడ్కోలు..

Fans actors pay final farewell to rebel star ambareesh at kanteerava studios

ambareesh, ambareesh funeral, actor ambareesh, ambareesh news, ambareesh death, ambareesh dead, kannada actor ambareesh, ambrish, ambarish death, ambareesh latest news, ambreesh, sandal wood rebel star, ambareesh last rites, funeral, kanteerava studios, raj kumar, bengaluru, sandal wood

Several stars, actors, politicians, and fans paid their last respects to the rebel star Ambareesh. Top actors from the south film industry and big names in the political circles attended his funeral at the Kanteerava Studio

ఇక సెలవంటూ తరలిపోయిన రెబెల్.. అంబరీష్ కు కన్నీటి వీడ్కోలు..

Posted: 11/26/2018 06:24 PM IST
Fans actors pay final farewell to rebel star ambareesh at kanteerava studios

కన్నడ రెబల్ స్టార్, కేంద్ర మాజీ మంత్రి అంబరీష్ అంత్యక్రియలు ప్రముఖులు, కుటుంబసభ్యులు, బంధుమిత్రులు, అభిమానుల ఆశ్రునయనాల మధ్య ముగిసాయి. బెంగళూరు కంఠీరవ స్టేడియం నుంచి స్టూడియో వరకు జరిగిన అంతిమయాత్రలో వేలాధిగా అభిమానులు కదలివచ్చారు. ఇవాల మధ్యాహ్నం బెంగళూరులోని కంఠీరవ స్టూడియోస్‌లో ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంబరీష్ అంత్యక్రియలు నిర్వహించారు.

అంబరీష్ అంతిమ యాత్రలో కర్ణాటక రాజకీయ నాయకులు, సినీ ప్రముఖలతో పాటు పెద్ద ఎత్తున అభిమానులు పాల్గొన్నారు. సినీ నటుడు అర్జున్ అంబరీష్ అంతిమయాత్ర వాహనంతో పాటే వెళ్లారు. కన్నడ నటులు శివరాజ్‌కుమార్, పునీత్ రాజ్‌కుమార్, జగ్గేష్, యాష్ తదితరులు కంఠీరవ స్టూడియోస్‌కు చేరుకుని అంబరీష్‌కు తుది నివాళులర్పించారు. కుమార్తె మంచు లక్ష్మి, భార్య నిర్మలాదేవితో కలిసి అంబరీష్ అంతి సంస్కారాల్లో పాల్గొన్న నటుడు మోహన్‌బాబు కన్నీటి పర్యంతమయ్యారు.

కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్‌డి కుమారస్వామి, మాజీ ప్రధాని హెచ్‌డి దేవెగౌడ, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రులు సిద్ధరామయ్య, యడ్యూరప్ప తదితరులు అంబరీష్ అంతిమ సంస్కారాల్లో పాల్గొని నివాళులర్పించారు. అంబరీష్ అంతిమ స్కంస్కారాలను ఆయన తనయుడు అబిషేక్ హిందూ సంప్రదాయాల ప్రకారం శాస్త్రోక్తంగా నిర్వహించారు. కాగా, గత కొంతకాలం నుంచి ఊపితిత్తుల్లో ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్న అంబరీష్ బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ambareesh  last rites  funeral  kanteerava studios  raj kumar  bengaluru  sandal wood  

Other Articles