netizens critisize KCR ob his blackmail politics కేసీఆర్ నోట ‘నేనోడిపోతే..’ పాట.. విమర్శించిన నెట్ జనులు

Why kcr blackmails telangana voters during election campaign

TRS nirmal meeting, TRS on Modi, KCR critisises Modi, KCR Blackmail politics, KCR blackmailing voters, KCR on Defeat in polls, KCR farm house, telangana elections 2018, KCR, Voters, Blackmailing, nirmal public meetins, netizens, telangana, politics

The CM of Telangana KCR blackmails the voter of telangana by saying that wining of TRS is historical necessary for the people of Telangana. The TRS President also says he, will relax in farm house if defeated.

కేసీఆర్ నోట ‘నేనోడిపోతే..’ పాట.. విమర్శించిన నెట్ జనులు

Posted: 11/23/2018 11:15 AM IST
Why kcr blackmails telangana voters during election campaign

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో వివిధ పార్టీల నుంచి బరిలోకి దిగిన అభ్యర్థులకు నామినేషన్ల ఉపసంహరణ ముగియడంతో ఇక ఎన్నికల కిక్ ప్రారంభమైంది. తమ గెలుపు కోసం ఓ వైపు ప్రచారాలు చేస్తూనే మరోవైపు అభ్యర్థులు తమ పార్టీలోని అన్నివర్గాల నేతలను కలుపుకుని వెళ్లేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఇక అసెంబ్లీ రద్దు చేసిన రోజునే అభ్యర్థులను ప్రకటించి.. అదే రోజు సభను కూడా నిర్వహించి.. తిరిగి అధికారపీఠాన్ని కైవసం చేసుకుంటామని ఘంటాపథంగా చెప్పిన ధీమాను వ్యక్తం చేశారు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్.

అయితే అప్పుడున్న అంచనాల నేపథ్యంలో ఆయన తన సంపూర్ణ విశ్వాసంతో ఆ విషయాన్ని చెప్పినా.. ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది రాష్ట్రంలో రాజకీయ పరిస్థితుల్లో మార్పలు వస్తున్నాయి. గెలుపు ధీమా వ్యక్తం చేసిన అభ్యర్థులు.. వందకు పైగా సీట్లు వస్తాయని చెప్పిన ముఖ్యమంత్రి.. నిర్మల్ సభకు వచ్చేసరికి తన ధోరణిని మార్చేశారు. తన పార్టీ అభ్యర్థులపై తాను చేయించిన సర్వే నివేదికల్లో కూడా తాజా పరిస్థితుల్లో అనేక మార్పులు వచ్చాయి. అంతే తన పార్టీ గెలుపు చారిత్రక అవసరమని ధోరణి మార్చేశారు కేసీఆర్. ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సర్వత్ర చర్చనీయాంశమయ్యాయి.

కేసీర్ వ్యాఖ్యలపై ఓ వైపు టీఆర్ఎస్ అభ్యర్థులు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తుండగానే.. అటు విమర్శకులు కూడా తమ దాడిని మెదలెట్టేసారు. ఇక మరోవైపు నెట్ జనుల కూడా ఆయన వ్యాఖ్యల అంతరార్థాన్ని అర్థం చేసుకుని ఇంత బహిరంగంగా బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడతారా అని ప్రశ్నిస్తున్నారు. నిర్మల్ సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలవడం చారిత్రక అవసరమని పేర్కొన్నారు. ఒకవేళ పార్టీ ఓటమి పాలైతే తనకొచ్చే నష్టం ఏమీ లేదని, తెలంగాణ రాష్ట్ర ప్రజలే నష్టపోతారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

అంతేకాదు తన పార్టీ ఓడిపోతే.. తాను హాయిగా వెళ్లి ఫామ్ హౌస్‌లో కూర్చుని వ్యవసాయం చేసుకుంటానని పేర్కొన్నారు. గెలిపిస్తే పనిచేస్తానని, లేదంటే ఇంటికెళ్లి రెస్ట్ తీసుకుంటానని చెప్పడం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో పెను విమర్శలకు దారి తీసింది. కేసీఆర్ బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నారని ప్రతిపక్ష పార్టీల నేతలు ఆరోపిస్తున్నారు. ఎన్నికలకు ముందే ఆయనకు ‘బొమ్మ’ కనిపిస్తోందని, ఓటమిని అంగీకరిస్తున్నారని చెబుతున్నారు. గెలిస్తే రాజకీయాలు, లేదంటే ప్రజలను వారి మానాన వారిని వదిలేసి ఫామ్ హౌస్‌లో రెస్ట్ తీసుకుంటానని చెప్పడం కేసీఆర్ చెప్పడాన్ని తప్పుబడుతున్నారు.

ఉద్యమనేత అని చెప్పుకుని కేసీఆర్ వ్యాఖ్యలు.. బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పరాకాష్ట అని దుమ్మెత్తి పోస్తున్నారు. గెలిచినా, ఓడినా ప్రజల్లోనే ఉండాలన్న కనీస సూత్రాన్ని కేసీఆర్ మర్చిపోయినట్టు ఉన్నారని ఎద్దేవా చేస్తున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలను కూడా ఉదహరిస్తున్నారు. తాను ఓడిపోతే అమెరికా వెళ్లి ఉద్యోగం చేసుకుంటానని పేర్కొన్నారు. కేసీఆర్ కుటుంబం మొత్తం ఇటువంటి ఆలోచనతోనే ఉందని, గెలిస్తేనే వారికి ప్రజలు కావాలని, లేదంటే వారితో అవసరం ఉండదని తమ వ్యాఖ్యల ద్వారా నిరూపిస్తున్నారని మండిపడుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : KCR  Voters  Blackmailing  nirmal public meetins  netizens  telangana  politics  

Other Articles