Telangana congress announces third list బరిలోకి పొన్నాల.. కాంగ్రెస్ మూడో జాబితా విడుదల

Telangana congress announces third list with 14 members

telangana assembly elections, telangana elections 2018, Congress candidates Third List, Ponnala Lakshmaiah, soyam babu rao, sudhir reddy, Mahakutami, Congress, TJS, TDP, TRS, BJP, politics

congress high command finalises and announces third list of its candidates, which includes ponnala lakshmaiah and soyam babu rao names.

బరిలోకి పొన్నాల.. కాంగ్రెస్ మూడో జాబితా విడుదల

Posted: 11/17/2018 10:57 AM IST
Telangana congress announces third list with 14 members

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్‌ ప్రక్రియ మరో రెండు రోజుల్లో ముగియనున్న తరుణంలో అన్ని పార్టీలు తమ అభ్యర్థులకు బి-ఫారాలను ఇచ్చి.. సమర్పించమని చెబుతున్నా.. కాంగ్రెస్ లో మాత్రం ఇంకా సీట్ల విషయంలో నెలకొన్న పీటముడి కొలిక్కి రావటం లేదు. ఈ విషయంలో ఇప్పటికే అధికార టీఆర్ఎస్ పార్టీ జోకులు కూడా పేల్చేస్తుంది. మహాకూటమిలో అభ్యర్థులకు సీట్లు ఖారారు అయ్యేసరికి.. తమ పార్టీ నేతలు స్వీట్లు పంచుకుంటారని కూడా టీఆర్ఎస్ నేతలు పేర్కొంటున్నారు. కాంగ్రెస్ నేతృత్వంలో ఏర్పడిన మహాకూటమిలో కాంగ్రెస్ 94 స్థానాలకు పోటి చేస్తుండగా, టీడీపీ 14, టీజేఎస్ 8, సీపిఐ 3 స్థానాలకు పోటీ పడుతున్న విషయం తెలిసిందే.

కాగా, కాంగ్రెస్ పార్టీ మాత్రం తమ అభ్యర్థులను ఎంపిక పక్రియను ఇప్పటికీ చేపడుతున్న విషయం తెలిసిందే. 94 స్థానాల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థులలో ఇప్పటి వరకు రెండు విడతల్లో కేవలం 75 మంది అభ్యర్థులను ప్రకటించింది. ఇక తాజాగా శనివారం 13 మంది అభ్యర్థులతో కూడిన మూడో జాబితా విడుదల చేసింది. కాగా, మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పోన్నాల లక్ష్మయ్యకు ఈ మూడో జాబితాలో స్థానం ఖారారు కావడంతో ఆయన అనుచరులు ఊపిరి పీల్చుకున్నారు. తనకు తొలి జాబితాలోనే స్థానం లభించాలని ఆశించిన పోన్నాలకు అధిష్టానం షాక్ ఇచ్చింది.

దీంతో వేచిచూసిన తరువాత కూడా ఆయన పేరు రెండో జాబితాలోనూ ఖరారు కాలేదు. ఇక ఏదో జరుగుతుందని, తన స్థానాన్ని టీజేఎస్ కు కేటాయించడమేంటని ప్రశ్నించిన పోన్నాల.. ఏకంగా ఢిల్లీకి వెళ్లి అక్కడి అధిష్టానం దృష్టికి తన సేవలను తీసుకువచ్చారు. దీంతో ఎట్టకేలకు ఆయన పేరును మూడో జాబితాలో జనగామ స్థానం నుంచి పొన్నాల ఆభ్యర్థిత్వాన్ని అధిష్టానం ఎట్టకేలకు ఖారారు చేసింది. ఈ జాబితాలో సుధీర్ రెడ్డి, సోయం బాపూరావులకు టికెట్ కేటాయించింది. దీంతో కాంగ్రెస్ ప్రకటించిన అభ్యర్థుల సంఖ్య 88కి చేరుకోగా, మరో 6 స్థానాలకు పేర్లను ప్రకటించాల్సి ఉంది.

మూడో జాబితాలో టిక్కెట్ దక్కించుకున్న అభ్యర్థులు: బోథ్ (ఎస్టీ) - సోయం బాపూరావు, నిజామాబాద్ అర్బన్ - తహెర్ బిన్ హమ్దాన్, నిజామాబాద్ రూరల్ - రేకుల భూపతి రెడ్డి, బాల్కొండ - ఇ అనిల్ కుమార్, ఎల్బీనగర్ - డి. సుధీర్ రెడ్డి, కార్వాన్ - ఒస్మాన్ బిన్ మొహమ్మద్ అల్ హజ్రీ, యాకత్ పురా - కె. రాజేందర్ రాజు, బహదూర్‌పురా - కలీం బాబా, కొల్లాపూర్ - బీరం హర్షవర్ధన్ రెడ్డి, దేవరకొండ (ఎస్టీ) - బాలూ నాయక్, తుంగతుర్తి (ఎస్సీ) - అద్దంకి దయాకర్, జనగాం - పాన్నాల లక్ష్మయ్య, ఇల్లెందు (ఎస్టీ)- బానోతు హరిప్రియా నాయక్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles