Hyderabad Metro reaches 30-million ridership మరో మైలురాయిని అధిగమించిన హైదరాబాద్ మెట్రో

Hyderabad metro s hi tech city route to open in december official

L and T MRHL, KVB Reddy, Hyderabad Metro rail, 30 million passengers, Metro smart cards, Metro Rail commuters, Hyderabad Metro Smart Card, nebula smart cards, Hyderabad metro rail smart card, Hyderabad Metro, 10% discont on metro cards

Hyderabad Metro Rail added another feather to its cap by crossing 30 million cumulative ridership milestone in 351 days and reached 30 million from 20 million in 71days.

మూడు కోట్ల మందిని గమ్యస్థానాలకు చేర్చిన హైదరాబాద్ మెట్రో

Posted: 11/16/2018 03:20 PM IST
Hyderabad metro s hi tech city route to open in december official

హైదరాబాద్ మెట్రో రైలు ప్రారంభమై ఇంకా ఏఢాది కూడా తిరక్కముందే మరో మైలురాయిని అధిగమించింది. హెదరాబాద్ మెట్రో లైన్ కు సంబంధించిన రెండో లైన్ ప్రారంభమై రెండు నెలల కాలమే అయ్యింది. ఇక మరో కీలకమైన హైటెక్ సిటీ మార్గం అందుబాటులోకి రాకుండానే హైదరాబాద్ మెట్రోకు నగరవాసుల నుంచి మంచి ఆదరణ లభిస్తుందని చెప్పడానికి ఇదే నిదర్శనం. గత ఏడాది నవంబర్ 29 నుంచి నగరవాసులకు మెట్రలో రైలు సేవలు  అందుబాటులోకి వచ్చాయి.

కానీ అప్పుడే మెట్రో రైలు 3 కోట్ల మంది ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేర్చిన రికార్డును అందుకుంది. రెండో దశలో ఎల్బీ నగర్ నుంచి అమీర్‌పేటకు మెట్రో సేవలు విస్తరించడంతో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. దీంతో ప్రయాణికుల సంఖ్యలో మెట్రో అరుదైన రికార్డును అందుకుంది. ప్రారంభమైన ఏడాదిలోపే ఏకంగా 30 మిలియన్ల (మూడు కోట్లు) ప్రయాణికుల మైలురాయిని చేరింది. ఎల్ అండ్ టీ మెట్రో రైల్ (హైదరాబాద్) లిమిటెడ్ వెల్లడించిన వివరాల ప్రకారం ఈనెల 14 వరకు మూడు కోట్ల మంది ప్రయాణికులు మెట్రో రైలు ద్వారా సురక్షితంగా గమ్యస్థానాలకు చేరారు.

ఈ ఘనతను అందుకోవడంపై ఎల్‌ అండ్ టీ హైదరాబాద్ మెట్రో రైలు ఎండీ, సీఈవో కేవీబీ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఒక ప్రకటనను విడుదల చేశారు. ‘మా అందరికీ ఇది ఎంతో సంతోషకరమైన క్షణం. 351 రోజుల్లో 30 మిలియన్లకు పైగా ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాం. 71 రోజుల్లోనే ప్రయాణికుల సంఖ్య 20 మిలియన్ల నుంచి 30 మిలియన్లకు చేరింది. రోజుకు 550 ట్రిప్పులతో సుమారు 13వేల కిలోమీటర్ల మేర రైళ్లను నడిపాం. మా ఉద్యోగులు, ఓ అండ్ ఎం ఆపరేటర్ కియోలిస్ కఠోర శ్రమ, ప్రోత్సాహం, సహకారంతోనే ఇది సాధ్యపడింది’ అని కేవీబీ రెడ్డి ప్రకటనలో పేర్కొన్నారు.

కాగా, హైదరాబాద్ మెట్రో రైలు సర్వీసులు ఇప్పటివరకు 1,64,198 ట్రిప్పులతో 25,53,422 కిలోమీటర్ల మేర తిరిగాయి. మెట్రో సమయపాలన (పంక్చువాలిటీ)లో 99.7 శాతం రేటును సాధించడంతోపాటు రైలు సర్వీసుల డెలివరీలో 99.9 శాతం రేటింగ్ ఉండటం విశేషం. ఇదిలా ఉంటే, మెట్రో ప్రారంభమైన 154 రోజులకి (ఈ ఏడాది మే1 నాటికి) ప్రయాణికుల సంఖ్య కోటికి చేరింది. ఆ తరవాత 280 రోజులకి (సెప్టెంబర్ 4 నాటికి) ప్రయాణికుల సంఖ్య రెండు కోట్లకు చేరింది. చివరిగా 351 రోజుల్లో మూడు కోట్ల ప్రయాణికుల మైలురాయిని మెట్రో అందుకుంది.

అయితే అరంభంలో కొంత మంది కేవలం ఉత్సాహం కోసమే మెట్రో రైలులో ప్రయాణించినా.. ఆ తరువాత ఆదరణ తగ్గింది. దీంతో ప్రయాణికుల సంఖ్య తగ్గడానికి కారణాన్ని తెలుసుకున్న మెట్రో రైలు సంస్థ ధరలు అధికంగా వున్నాయని ప్రజల నుంచి నిరసన వ్యక్తం అయిన నిరసనలను కూడా పరిగణలోకి తీసుకుని గత కొంతకాలంగా నెబులా స్మార్ట్ కార్డులపై పది శాతం రాయితిని కూడా అందిస్తుంది. దీంతో కార్డులు పోందిన వారు నిత్యం ప్రయాణాలకు మెట్రోను ఎంచుకోవడంతో ఈ మైలురాయిని అందుకోవడం మెట్రో రైలు సంస్థ అనతికాలంలోనే సాధ్యమైంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : hyderbad metro  kvb reddy  30 million passengers  smart cards  10 percent discount  

Other Articles