devotees throng temples on first karthika somavaram ‘‘ఓం నమః శివాయ’’.. కిక్కిరిసిన శైవాలయాలు..

Special pujas performed to lord shiva on first karthika somavaram

Ekadasa Rudrabhishekams, Laksha Bilwarchana, deepa danam, salagrama danam, hindu rituals, traditions, culture, Hindus, special pujas, auspicious karthika masam, sacred karthika somavram, sacred karthika ekadasi, sacred karthika purnima, saiva temples, devotees

Special pujas were performed to Lord Siva at all Saiva temple across the telugu states on the occasion of karthika masam first somavaram i.e, monday. Ekadasa Rudrabhishekams, Laksha Bilwarchana performing on the auspicious day.

‘‘ఓం నమః శివాయ’’.. కిక్కిరిసిన శైవాలయాలు..

Posted: 11/12/2018 03:22 PM IST
Special pujas performed to lord shiva on first karthika somavaram

శివుడికి అత్యంత ప్రీతికరమైన కార్తీక మాసం అందులోనూ తొలి సోమవారం కావడంతో తెలుగు రాష్ట్రాల్లో శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. దీనికితోడు శుక్ల పంచవి కూడా రావడంతో పవిత్రమైన నాగులపంచమిని కూడా సోమవారం రోజునే కలసివచ్చింది. దీంతో నాగాభరణుడైన శివయ్యతో పాటు ఆయనకు ఆభరణంగా బాసిల్లే నాగదేశతకు కూడా భక్తులు ప్రత్యేకపూజలు నిర్వహిస్తున్నారు. శివాలయాల్లో అభిషేకాలు, మహాన్యసపూర్వక రుద్రాభిషేకాలతో పాటు బిల్వార్ఛనలు చేస్తూనే.. ఇటు పుట్టలలో పాలు పోస్తూ.. నాగదేవత, నాగరాజులకు కూడా ప్రత్యేక పూజలు చేస్తున్నారు.

ఇవాళ తెల్లవారుజాము నుంచే ఆలయాలకు పోటెత్తిన భక్తులు శివుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. శ్రీశైలం, ద్రాక్షారామం, అమరావతి, ముక్తేశ్వరం, వేములవాడ, పాలకొల్లు, భీమవరం, కాళేశ్వరం ఆలయాలకు భక్తులు పోటెత్తారు. గోదావరి, కృష్ణా నదుల్లో వేకువజాము నుంచే పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఆలయాల్లో రుద్రాభిషేకాలు, ప్రత్యేక పూజలు, వ్రతాలు చేస్తున్నారు. సూర్యోదయానికి ముందే నదులు, చెరువుల్లో పుణ్య స్నానాలు ఆచరించి కార్తీక దీపాలు వదిలారు.

ఇక తిరుపతిలోని కపిలతీర్థానికి సైతం భక్తులు పోటెత్తారు. జలపాతం కింద భక్తుల స్నానాలు.. దీపారాధనలు చేశారు. మహిళలు ఉపవాసంతో స్వామివారికి దీపారాధనచేసి మొక్కులు తీర్చుకున్నారు. ఉదయం పంచమూర్తులైన గణపతి, సోమస్కంధుడు, వళ్లీ, దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి, చండికేశ్వరుడు, త్రిశూలానికి వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు.

నెల రోజుల పాటు నిర్వహించే విశేష పూజ, హోమ మహోత్సవాలకు సోమవారం సాయంత్రం అంకురార్పణ జరగనుంది. శ్రీశైలంలోని మల్లికార్జున స్వామికి కార్తీక సోమవార ప్రత్యేక పూజలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. తూర్పుగోదావరిలోని ప్రసిద్ధి పుణ్యక్షేత్రం మురమళ్ల భద్రకాళి సమేత విశ్వేశ్వర స్వామి ఆలయానికి వేకువజాము నుంచి భక్తులు తరలివచ్చారు. వృద్ద గౌతమీ నది తీరంలో స్నానాలు చేసి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Hindus  karthika masam  karthika somavram  nagula panchami  saiva temples  devotees  

Other Articles