Mahakutami will win Telangana: Survey తెలంగాణలో ప్రజాకూటమిదే అధికారం: సీ ఓటర్ సర్వే

Cvoter poll predicts 64 seats for mahakutami 42 to trs

cm kcr, Mahakutami, prajakutami, tdp congress alliance seats, congress and tdp alliance in telangana, cm chandrababu naidu, Telangana Elections, telangana elections 2018, vote bank politics, trs vote bank, elections campaign, trs vs congress, revanth reddy speech, revanth reddy interview, revanth reddy election speech, revanth reddy election campaign, political strategy, political stategy in telangana, kcr political plan, grand alliance in telangana

The polling agency, CVoter, has predicted that the Congress-TDP alliance will defeat the ruling Telangana Rashtra Samithi (TRS) in the upcoming election in Telangana, scheduled for December 7.

తెలంగాణలో ప్రజాకూటమిదే అధికారం: సీ ఓటర్ సర్వే

Posted: 11/10/2018 02:12 PM IST
Cvoter poll predicts 64 seats for mahakutami 42 to trs

తెలంగాణలో తిరిగి అధికారంలోకి తమకే దక్కుతుందని ఆశపడుతున్న అధికార టీఆర్ఎస్ పార్టీకి ఈ సారి అసెంబ్లీ ఎన్నికలలో పరాభవం తప్పదా.? అంటే ఔననే అంటున్నాయి సర్వేలు. తెలంగాణలో ఈ సారి ప్రజాకూటమి తన సత్తాను చాటి.. అధికారంలోకి వస్తుందని ఏబీపీ-సి ఓటర్ సర్వే తేల్చింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలవడం మహాకూటమికి కలిసి వచ్చిందని సర్వే అభిప్రాయపడింది.

ముందస్తు ఎన్నికలకు వెళ్తే ప్రభుత్వ వ్యతిరేకత ప్రభావం తమపై వుండదని భావించి.. తిరిగి విజయాన్ని అందుకుంటామని ఉవ్విళ్లూరుతున్న కేసీఆర్ సారథ్యంలోని టీఆర్ఎస్ పార్టీకి ఈసారి పరాజయం తప్పదని సర్వే పేర్కొంది. అయితే అసెంబ్లీ రద్దు చేసిన తొలినాళ్లలో అధికార పార్టీకి అనుకూలంగా వున్న అంచనాలు.. కేవలం నెల రోజుల వ్యవధిలోనే మారిపోయాయాని.. ఇక ఎన్నికలు జరిగే నాటికి పూర్తిగా మారిపోవచ్చునని సర్వేలో వ్యక్తమయ్యింది.

సెప్టెంబరులో మహాకూటమికి రూపుదిద్దుకుంది. కాంగ్రెస్, టీడీపీ, సీపీఐతో ప్రారంభమైన కూటమిలో ఆ తర్వాత తెలంగాణ జనసమితి(టీజేఎస్) కూడా వచ్చి చేరింది. వీటి కలయికతో అప్పటి వరకు ఉన్న పరిణామాలు ఒక్కసారిగా మారిపోయాయని సర్వే పేర్కొంది. కూటమి ఏర్పడడానికి ముందు విజయంపై కేసీఆర్ ధీమాగా ఉన్నారని, కానీ ఇప్పుడాయనలో ఆ ధీమా కనిపించడం లేదని సర్వే పేర్కొంది. ఏబీపీ న్యూస్, రిపబ్లిక్ టీవీ కోసం నిర్వహించిన ఈ సర్వేలో కాంగ్రెస్-టీడీపీ కూటమి 64 స్థానాల్లో విజయం సాధిస్తుందని, టీఆర్ఎస్ 42 స్థానాలకే పరిమితమవుతుందని తేలింది. బీజేపీ 4, ఇతరులు 9 స్థానాల్లో విజయం సాధిస్తారని పేర్కొంది.

గత ఎన్నికలతో పోలిస్తే టీఆర్ఎస్ ఓట్ల శాతం గణనీయంగా పడిపోతుందని సర్వేలో వెల్లడైంది. మహాకూటమికి 33.9 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉండగా, టీఆర్ఎస్‌కు 29.4 శాతం ఓట్లు వస్తాయని అంచనా వేసింది. అయితే, సర్వేలో పాల్గొన్న వారిలో 42.9 శాతం మంది కేసీఆరే మళ్లీ సీఎం కావాలని కోరుకోవడం గమనార్హం. ఆ తర్వాతి స్థానాల్లో జానారెడ్డి ఉన్నారు. ఆయన సీఎం కావాలని 22.6 శాతం మంది కోరుకున్నారు. ఆ తరువాత పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి రేసులో వున్నారని సర్వేలో వెల్లడైంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : #TRS  #Prajakutami  #Mahakutami  #Congress  #TDP  #TJS  #Cvoter survey  #telangana politics  

Other Articles