One dead after Melbourne knife attack ఉగ్రవాది కలకలం.. కత్తితో రెచ్చిపోయిన ముష్కరుడు

Melbourne attack one person stabbed to death in terrorist incident

stabbing in Melbourne, terrorist multiple stabbing, melbourne terrorist stabbing incident, Melbourne terror attack, terrorist stabbing in melbourne, stabbing in australia, Australia stabbing incident, terrorist in australia, Melbourne Police, Melbourne, australia

One person has been killed and at least two others injured after a Terrorist went on a rampage on Bourke St in Melbourne's city centre. Witnesses say the man drove a car into the Target centre

ITEMVIDEOS: ఉగ్రవాది కలకలం.. కత్తితో రెచ్చిపోయిన ముష్కరుడు

Posted: 11/09/2018 08:39 PM IST
Melbourne attack one person stabbed to death in terrorist incident

ఆస్ట్రేలియాలో ప్రముఖ నగరం మెల్‌బోర్న్ మరోమారు ఉగ్రకలకలం రేగింది. ఓ ఉగ్రవాది కత్తిని చేతబట్టి దారిన వెళ్లేవారిపై విచక్షణారహితంగా దాడి చేస్తూ బీభత్సం సృష్టించాడు. అకారణంగా ఉన్మదిలా వ్యవహరించడంతో స్థానికులు భయకంపితులయ్యారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఓ వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ముష్కరుడి దాడిలో గాయపడిన మరో ఇద్దరిని పోలీసులు అస్పత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు.

ముష్కరుడిని సజీవంగా పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నాలు ఫలించ లేదు. పోలీసులపై కూడా ముష్కరుడు కత్తితో దాడికి దిగాడంతో., వారు అతనిపై కాల్పులు జరిపారు. నేరుగా ఛాతిలోకి దూసుకెళ్లిన పోలీసుల తూటాలో ముష్కరుడు కుప్పకూలిపోయాడు. హుటాహుటిన ఉద్రవాదిని ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది.  చికిత్స పొందుతూ ముష్కరుడు మరణించాడు. ఘటన వివరాల్లోకి వెళ్తే.. మెల్‌బోర్న్ సెంట్రల్ డిస్ట్రిక్ట్ ఇవాళ మధ్యాహ్నం కారులో వచ్చిన ఉగ్రవాది తన కారును దిగి పక్కనే వున్న భవనంలోకి దాన్ని పంపించేందుకు యత్నించాడు.

అయితే అది కాస్తా కొంతదూరం వెళ్లి బోల్లాపడింది. దీంతో మంటలు చెలరేగాయి. తన పథకం దెబ్బతినిందని భావించాడో ఏమో కానీ ఆ ఉగ్రవాది కత్తి చేతబట్టి.. కనిపించిన వారిపై దాడికి తెగబడ్డాడు. దీంతో అక్కడి ప్రజలు భయాందోళన చెందిన అతనికి దూరంగా వెళ్లారు.ముష్కరుడి చేతిలో దాడికి గురైన మరో వ్యక్తికి తల భాగంలో గాయమైందని, అతడి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది.

నిందితుడు పోలీసులపై కత్తితో దాడి చేస్తుండటం.. వారు అతణ్ని అడ్డుకునే ప్రయత్నం చేయడం.. మాట వినకపోవడంతో ఓ పోలీస్‌ అధికారి అతణ్ని తుపాకీతో కాల్చివేసిన దృశ్యాలు వీడియోలో రికార్డయ్యాయి. దాడికి పాల్పడ్డ ముష్కరుణ్ని సోమాలియాకు చెందిన 31 ఏళ్ల యువకుడిగా పోలీసులు గుర్తించారు. అతడు కొంతకాలంగా మెల్‌బోర్న్ లో నివాసం ఉంటున్నట్లు చెప్పారు. మరోవైపు.. ఈ దాడికి పాల్పడింది తామేనని ఇస్లామిక్ స్టేట్ గ్రూప్‌కు చెందిన ఓ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Australia  stabbing incident  terror attack  terrorist attack  melbourne police  crime  

Other Articles

 • Will abide to fishermen development pawan kalyan

  మత్స్యకారుల సంక్షేమం పట్టని అధికార, విపక్షాలు

  Nov 13 | రాష్ట్రంలోని మత్స్యకారుల కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటాం.. ఇది ఎన్నికలకు మందు అన్ని పార్టీలు కొస్త్రాంధ్ర ప్రాంతంలో పర్యాటించిన సందర్భంలో చెప్పే మాటే. ఎన్నికలు ముగియగానే.. వారి సంక్షేమాల కోసం చెప్పిన మాటలను గాలి... Read more

 • Bc sangh telangana bandh on 17th

  17న తెలంగాణ బంద్ కు బీసీ సంఘాల పిలుపు

  Nov 13 | తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు టిక్కెట్ల కేటాయించడంలో ఒక్క పార్టీ మినహా అన్ని రాజకీయ పార్టీలు అన్యాయం చేశాయని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య అన్నారు. అధికార టీఆర్ఎస్, కేంద్రంలోని బీజేపితో పాటుగా... Read more

 • High court issues notices to ap cm chandrababu in jagan attack case

  జగన్ పై దాడి కేసు: చంద్రబాబు సహా 8 మందికి హైకోర్టు నోటీసులు

  Nov 13 | ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టు షాకిచ్చింది. ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌పై దాడి కేసును.. ప్రభుత్వ కుట్రగా పేర్కోంటూ వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి దాఖలు... Read more

 • Hc receives report on disappearance of material objects in ayesha murder case

  అయేషామీరా హత్యకేసు పునర్విచారణ యోచనలో హైకోర్టు?

  Nov 13 | 2007 లో సంచలనం సృష్టించిన ఫార్మసి విద్యార్థి ఆయేషా మీరా అత్యాచారం, హత్య కేసు మళ్ళీ తెరపైకి వచ్చింది. విజయవాడ శివారు ఇబ్రహీంపట్నంలోని ఓ ప్రైవేటు హాస్టల్‌లో 2007 డిసెంబరులో ఆయేషామీరా హత్యాచారం చేయబడింది.... Read more

 • Shivraj singh chauhan s wife faces public ire while campainging

  ITEMVIDEOS: ప్రచారంలో పరాభవం.. సీఎం సతీమణికి కూడా తప్పలేదు..

  Nov 13 | ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో అటు జాతీయ పార్టీలు, ఇటు ప్రాంతీయ పార్టీల అభ్యర్థులు తమ ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. ఈ క్రమంలో రాజస్థాన్, చత్తీస్ గడ్, మధ్యప్రదేశ్, తెలంగాణల్లో అధికారంలో వున్న పార్టీల... Read more

Today on Telugu Wishesh