Tharoor Accuses BJP, RSS of Playing Politics శబరిమల పవిత్రతపై శశీధరూర్ సంచలన వ్యాఖ్యలు

Shashi tharoor asks rss bjp not to desecrate sabarimala temple

Shashi Tharoor, Rashtriya Swayamsevak Sangh, Bharatiya Janata Party, Sabarimala, Tharoor, Hindutva, Kerala, India, Entry of women to Sabarimala Ayyappa Temple, cameraman, Congress, Sabarimala temple, Supreme Court, Lord Ayyappa shrine, BJP, politics

Congress leader Shashi Tharoor asked the BJP and RSS not to "desecrate" the Sabarimala temple and termed as "utterly disgraceful" the recent violence at the hill shrine.

శబరిమల పవిత్రతపై శశీధరూర్ సంచలన వ్యాఖ్యలు

Posted: 11/09/2018 07:56 PM IST
Shashi tharoor asks rss bjp not to desecrate sabarimala temple

పరమ పవిత్రమైన శబరిమల అయ్యప్పస్వామి ఆలయం వద్ద రాజకీయ పార్టీలు, పరోక్ష రాజకీయాలకు నేతృత్వం వహించే సంస్థలు రాజకీయాలు చేయడంపై మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. భక్తుల విశ్వాసాలకు నెలవైన పవిత్ర ప్రాంతానికి రాజకీయాలు అంటగట్టి ‘‘అపవిత్రం’’ చేయవద్దంటూ అధికార, విపక్ష పార్టీలకు హితవు పలికారు. శబరిమలపై సుప్రీంకోర్టు తీర్పు అనంతరం చోటుచేసుకున్న పరిణామాలను రాజకీయ లబ్దికి వినియోగించుకోవడం హేయకరమైన చర్యగా పేర్కోన్నారు.

ఈ క్రమంలో అటు ఆర్ఎస్ఎస్, బీజేపీలతో పాటు ఇటు కేరళ ప్రభుత్వాన్ని సైతం తనదైన శైలిలో నిలదీశారు. ‘‘సంప్రదాయక ఆధునికతకు, మారుతున్న ప్రపంచంలోని మన సమాజానికి మధ్య... లోతైన ప్రశ్నలను లేవనెత్తుతున్న ఈ అంశాన్ని తక్కువగా తీసిపారేయడం తగదు. బీజేపీ చేపట్టిన నిరసన కార్యక్రమాలు ఎలాంటి హింసకు దారితీశాయో చూశాం. శబరిమలలోని ప్రజలను భయపట్టే విధంగా వ్యవహరించడం దారుణం. పవిత్ర క్షేత్రమైన ఈ ప్రదేశాన్ని రాజకీయాలకు వేదికగా మారుస్తూ... తన పార్టీకి సువర్ణ అవకాశం దొరికినట్టు బీజేపీ చీఫ్ భావించడం సిగ్గుచేటు..’’ అని శశిథరూర్ మండిపడ్డారు.
 
శబరిమల పవిత్రతను కాపాడాలని ఓ వైపు ఉద్యమిస్తున్న ఆర్ఎస్ఎస్ నేతలు ఆలయ పవిత్రను దెబ్బతీసే విధంగా పద్దెనిమిది బంగారు మెట్లను ఇరుముడి లేకుండా ఎక్కడం ఏంటని ప్రశ్నించారు. ఈ మెట్లను ఎక్కడానికి మాత్రమే వినియోగిస్తారని, అయితే ఆర్ఎస్ఎస్ నేత కిందకు దిగడంతో మరోమారు అపవిత్రమయ్యాయని పేర్కోన్న ఆయన దీనికి మీరేం బదులిస్తారని నిలదీశారు. భక్తుల భక్తి విశ్వాసాలకు విరుద్దంగా నడుచుకుంటూన్నారని శశిధరూర్ వ్యాఖ్యానించారు.

శబరిమల ఆలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొనేందుకు కేరళ ప్రభుత్వ వైఖరి కూడా ఆజ్యం పోసిందన్నారు. భాగస్వామ్య పక్షాలన్నిటితోనూ చర్చలు జరిపి అందరికీ ఆమోయోగ్యమైన రీతిలో ప్రభుత్వం ముందుకెళ్లాల్సిందనీ... అలాంటిదేమీ లేకుండా సుప్రీంకోర్టు తీర్పును అమలుచేసేందుకు హడావిడిగా ముందుకెళ్లడం వల్లే సమస్యలు తలెత్తాయన్నారు. భక్తుల మనోభావాలు గౌరవిస్తూనే, మరోవైపు శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Shashi Tharoor  RSS  Bharatiya Janata Party  Sabarimala  Tharoor  Hindutva  Kerala  India  politics  

Other Articles