MIM warns TRS in rajendranagar assembly seat టీఆర్ఎస్ కు ఎంఐఎం స్ట్రాంగ్ వార్నింగ్..

Mim asuddudin owasi warns trs in rajendranagar assembly seat

KCR, K.ChandraShekar Rao, CM, Rajendra Nagar Seat, Prakash Goud, Car, kite, MIM, Asaduddin Owaisi, Telangana, politics

MIM chief Asaduddin warns TRS party chief and Telangana care taker CM KCR in lieu of Rajendra nagar seat says to forget the said seat if car wants to win in Telangana.

టీఆర్ఎస్ కు ఎంఐఎం స్ట్రాంగ్ వార్నింగ్..

Posted: 11/09/2018 12:00 PM IST
Mim asuddudin owasi warns trs in rajendranagar assembly seat

మరో నెల రోజుల లోపు వ్యవధిలో రానున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కారు తన జోరును కొనసాగించాలంటే ఆ ఒక్కస్థానాన్ని మాత్రం మర్చిపోవాలని.. లేదంటే కారు జోరుకు తాము బ్రేకులు వేస్తామని ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ అధికార టీఆర్ఎస్ పార్టీకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్రంలోని ఆ ఒక్క సీటు తప్ప ఇంకెక్కడైనా టీఆర్ఎస్ పార్టీ పోటీ చేసుకోవచ్చని అసదుద్దీన్ ఒవైసీ అధికార టీఆర్ఎస్ కు పరోక్ష హెచ్చరికలు చేశారు. ఆ ఒక్క సీటే రాజేంద్రనగర్.

తెలంగాణలో టీఆర్ఎస్ ఎక్కడైనా పోటీ చేసుకోవచ్చనీ, కానీ రాజేంద్ర నగర్ లో మాత్రం అడుగుపెట్టొద్దని పరోక్షంగా హెచ్చరించారు. గత నాలుగేళ్లుగా ప్రజలను పట్టించుకోని కొందరు నేతలు ఎన్నికల నేపథ్యంలో కారులో దూసుకొస్తున్నారని ఎద్దేవా చేశారు. ‘కారు’ ప్రయాణాన్ని సుఖవంతం చేయాలనుకుంటే రాజేంద్రనగర్ ను తమకు ఇవ్వక తప్పదని స్పష్టం చేశారు. ఇక్కడ ‘కారు’ నడవబోదనీ, దాని స్టీరింగ్ తమ చేతుల్లోనే ఉందని వ్యాఖ్యానించారు.

తెలంగాణలో చంద్రబాబు కూటములు ప్రభావం అంతగా పనిచేయబోవని జోస్యం చెబుతూ అధికార పార్టీకి వంతపాడిన ఆయన.. ఎంఐఎం ను హైదరాబాద్ నుంచి తరిమివేస్తామన్న బీజేపీ నేతల వ్యాఖ్యలపై స్పందిస్తూ.. బీజేపీ ముక్త తెలంగాణ త్వరలోనే సాకారమవుతుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వ ఏర్పాటులో ఎంఐఎం కీలకంగా మారుతుందని అభిప్రాయపడ్డారు. అయితే ఎంఐఎం పార్టీతో తమకు మైత్రి కోనసాగుతుందని చెబుతున్న టీఆర్ఎస్ పార్టీ.. వారితో పలు స్థానాల్లో స్నేహపూర్వక పోటీ మాత్రం కోనసాగుతుందని చెప్పారు.

కాగా, స్నేహపూర్వక పోటీ నేపథ్యంలో ఈ రెండు మిత్రపక్ష పార్టీల మధ్య తాజాగా రాజేంద్రనగర్ అసెంబ్లీ స్తానం మాత్రం అగ్గి రాజేస్తుంది. ఈ సీటుపై అశలు వదులుకుంటేనే టీఆర్ఎస్ పార్టీకి మంచి జరుగుతుందని, లేదంటే తమ పార్టీ రానున్న ఎన్నికలలో అధికార పార్టీ జోరును అడ్డుకుంటామని కూడా తేల్చిచెబుతుంది. మరీ ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది.? ఎంఐఎంతో ఎలాంటి లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుంటుందో వేచి చూడాల్సిందేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : KCR  K.ChandraShekar Rao  CM  Rajendra Nagar Seat  Prakash Goud  Car  kite  MIM  Asaduddin Owaisi  Telangana  politics  

Other Articles

 • Will abide to fishermen development pawan kalyan

  మత్స్యకారుల సంక్షేమం పట్టని అధికార, విపక్షాలు

  Nov 13 | రాష్ట్రంలోని మత్స్యకారుల కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటాం.. ఇది ఎన్నికలకు మందు అన్ని పార్టీలు కొస్త్రాంధ్ర ప్రాంతంలో పర్యాటించిన సందర్భంలో చెప్పే మాటే. ఎన్నికలు ముగియగానే.. వారి సంక్షేమాల కోసం చెప్పిన మాటలను గాలి... Read more

 • Bc sangh telangana bandh on 17th

  17న తెలంగాణ బంద్ కు బీసీ సంఘాల పిలుపు

  Nov 13 | తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు టిక్కెట్ల కేటాయించడంలో ఒక్క పార్టీ మినహా అన్ని రాజకీయ పార్టీలు అన్యాయం చేశాయని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య అన్నారు. అధికార టీఆర్ఎస్, కేంద్రంలోని బీజేపితో పాటుగా... Read more

 • High court issues notices to ap cm chandrababu in jagan attack case

  జగన్ పై దాడి కేసు: చంద్రబాబు సహా 8 మందికి హైకోర్టు నోటీసులు

  Nov 13 | ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టు షాకిచ్చింది. ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌పై దాడి కేసును.. ప్రభుత్వ కుట్రగా పేర్కోంటూ వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి దాఖలు... Read more

 • Hc receives report on disappearance of material objects in ayesha murder case

  అయేషామీరా హత్యకేసు పునర్విచారణ యోచనలో హైకోర్టు?

  Nov 13 | 2007 లో సంచలనం సృష్టించిన ఫార్మసి విద్యార్థి ఆయేషా మీరా అత్యాచారం, హత్య కేసు మళ్ళీ తెరపైకి వచ్చింది. విజయవాడ శివారు ఇబ్రహీంపట్నంలోని ఓ ప్రైవేటు హాస్టల్‌లో 2007 డిసెంబరులో ఆయేషామీరా హత్యాచారం చేయబడింది.... Read more

 • Shivraj singh chauhan s wife faces public ire while campainging

  ITEMVIDEOS: ప్రచారంలో పరాభవం.. సీఎం సతీమణికి కూడా తప్పలేదు..

  Nov 13 | ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో అటు జాతీయ పార్టీలు, ఇటు ప్రాంతీయ పార్టీల అభ్యర్థులు తమ ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. ఈ క్రమంలో రాజస్థాన్, చత్తీస్ గడ్, మధ్యప్రదేశ్, తెలంగాణల్లో అధికారంలో వున్న పార్టీల... Read more

Today on Telugu Wishesh