India Today Survey: KCR Will Be CM ఇండియా టుడే సర్వే: ముఖ్యమంత్రులుగా వీళ్లే..

Bjp headed for a beating in rajasthan close fight in mp chhattisgarh

India today survey, political stock exchange, political stock exchange rajasthan, political stock exchange rajdeep sardesai, rajasthan elections latest, madhya pradesh elections latest, chhattisgarh elections latest, Telangana, Madhya pradesh, Rajasthan, chattisgarh, Mizoram, politics

The BJP faces a neck-and-neck contest in Madhya Pradesh and Chhattisgarh and a debacle in Rajasthan in the upcoming Assembly elections, according to the Political Stock Exchange. And in Telangana KCR will form the Government.

ఇండియా టుడే సర్వే: నాలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులుగా వీళ్లే..

Posted: 11/09/2018 11:52 AM IST
Bjp headed for a beating in rajasthan close fight in mp chhattisgarh

మరో నెల రోజుల తరువాత వెలువడనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సర్వే ఎలా వుంది. ఈ ఐదు రాష్ట్రాల్లో కనీసం నాలుగింట తామే గెలుస్తామన్న కాంగ్రెస్ పార్టీ ధీమా నిజం కానుందా.? లేక మళ్లీ తాము అధికారాన్ని నిలబెట్టుకుంటామన్న బీజేపి ఆశలు నిలువనున్నాయా.? అన్న విషయమై త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో ‘ఇండియా టుడే’కు చెందిన ‘పొలిటికల్ స్టాక్ ఎక్స్‌చేంజ్’(పీఎస్ఈ) నిర్వహించిన సర్వే ఫలితాలు తమ అంచనాలను వెలువరించాయి.

తెలంగాణ

తెలంగాణలో కారు స్పీడు పెంచిందని, కేసీఆర్ ప్రభుత్వంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు ఆ ప్రభుత్వాన్ని తిరిగి అధికారాన్ని అందించనున్నాయని సర్వే తేల్చింది. 44 శాతం మంది కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని కోరుకోగా, 34 శాతం మంది ప్రభుత్వ మారాలని అభిప్రాయపడ్డారు. ఈ గణాంకాల ప్రకారం.. టీఆర్ఎస్ మళ్లీ విజయం సాధించడం ఖాయమని చెన్నై మేథమెటికల్ ఇనిస్టిట్యూట్ కు చెందిన సెఫాలజిస్ట్ రాజీవ్ కరాండికర్ పేర్కొన్నారు.

టీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశం 75 శాతం ఉందన్నారు. కాంగ్రెస్‌కు మజ్లిస్ నుంచి గట్టి పోటీ ఎదురవుతుందని, ఆ పార్టీ విజయావకాశాలను మజ్లిస్ దారుణంగా దెబ్బతీస్తుందని పీఎస్ఈ వెల్లడించింది. అయితే కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో మరోమారు పరాభవం ఎదురుకాక తప్పదని ఇండియా టుకే విశ్లేషించింది. అయితే కాంగ్రెస్ నేతృత్వంలోని మహాకూటమి మాత్రం గతంలో కన్నా అధిక స్థానాలను కైవసం చేసుకుంటుందని కూడా వెల్లడించింది.

మధ్యప్రదేశ్

మధ్యప్రదేశ్‌లో శివరాజ్‌సింగ్ సర్కారు మళ్లీ అధికారంలోకి రావడమని సర్వే చెప్పుకొచ్చింది. అయితే, బీజేపీ-కాంగ్రెస్ మధ్య ఓట్ల తేడా ఒకటి నుంచి మూడు శాతం మాత్రమే ఉండే అవకాశం ఉందని పీఎస్ఈ పేర్కొంది. బీఎస్పీ-కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తే మాత్రం విజయం ఖాయమని స్పష్టం చేసింది. సర్వేలో పాల్గొన్న వారిలో 42 శాతం చౌహాన్ సర్కారుకే ఓటేయగా, 40 శాతం మంది ప్రభుత్వం మారాలని అభిప్రాయపడ్డారు. ఇక్కడ బీజేపీ 116 స్థానాల్లో, కాంగ్రెస్ 105 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉందని సర్వే పేర్కొంది.

రాజస్థాన్

రాజస్థాన్ లో వసుందర రాజే ప్రభుత్వానికి ఓటర్లు షాక్ ఇవ్వనున్నారని సర్వే తేల్చింది. రాజస్థాన్ లోని బీజేపి ప్రభుత్వంపై మైనారిటీ, నిమ్నవర్గాల్లో ఉన్న ఆగ్రహం చేటు చేస్తుందని సర్వేలో వెల్లడైంది. రాజేకు కేవలం 35 శాతం మాత్రమే అవకాశం ఉందని సర్వే తేల్చింది. రాజస్థాన్ లో కాంగ్రెస్‌కు 110 స్థానాలు వచ్చే అవకాశం ఉండగా, బీజేపీ 84 స్థానాలకే పరిమితం కానుంది. అశోక్ గెహ్లెట్ వైపు రాష్ట్రంలోని ఎక్కువమంది మొగ్గుచూపారు. అయితే గత నాలుగు పర్యాయాలుగా రాజస్థాన్ లో అధికార మార్పిడి జరుగుతున్న విషయం తెలిసిందే.

చత్తీస్‌గఢ్‌

చత్తీస్‌గఢ్ లో మాత్రం బీజేపీ అధికారాన్ని నిలబెట్టుకుంటుందని పోలిటికల్ స్టాక్ ఎక్స్ చేంజ్ తేల్చింది. గత మూడు పర్యాయాలుగా అధికారంలో కొనసాగుతున్న రమణ్ సింగ్ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రావాలని 55 శాతం మంది కోరుకున్నారు. అయితే ఇక్కడ బీజేపిని ఎందుకు కోరుకుంటున్నారన్న అన్న విషయాలను మాత్రం సర్వేలో పేర్కోనలేదు. ప్రభుత్వ పథకాలు కోసమా.? లేక ప్రభుత్వ పనితీరు నచ్చడంతో.? రమణ్ సింగ్ ప్రభుత్వాన్ని ప్రజలు మళ్లీ కోరుకుంటున్నారా.? అన్న విషయాలను సర్వే స్పష్టం చేయలేదు. కాగా, ఇక్కడ బీజేపీకి 56 సీట్లు, కాంగ్రెస్‌కు 25 సీట్లు వస్తాయని సర్వే అంచనా వేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

 • Will abide to fishermen development pawan kalyan

  మత్స్యకారుల సంక్షేమం పట్టని అధికార, విపక్షాలు

  Nov 13 | రాష్ట్రంలోని మత్స్యకారుల కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటాం.. ఇది ఎన్నికలకు మందు అన్ని పార్టీలు కొస్త్రాంధ్ర ప్రాంతంలో పర్యాటించిన సందర్భంలో చెప్పే మాటే. ఎన్నికలు ముగియగానే.. వారి సంక్షేమాల కోసం చెప్పిన మాటలను గాలి... Read more

 • Bc sangh telangana bandh on 17th

  17న తెలంగాణ బంద్ కు బీసీ సంఘాల పిలుపు

  Nov 13 | తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు టిక్కెట్ల కేటాయించడంలో ఒక్క పార్టీ మినహా అన్ని రాజకీయ పార్టీలు అన్యాయం చేశాయని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య అన్నారు. అధికార టీఆర్ఎస్, కేంద్రంలోని బీజేపితో పాటుగా... Read more

 • High court issues notices to ap cm chandrababu in jagan attack case

  జగన్ పై దాడి కేసు: చంద్రబాబు సహా 8 మందికి హైకోర్టు నోటీసులు

  Nov 13 | ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టు షాకిచ్చింది. ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌పై దాడి కేసును.. ప్రభుత్వ కుట్రగా పేర్కోంటూ వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి దాఖలు... Read more

 • Hc receives report on disappearance of material objects in ayesha murder case

  అయేషామీరా హత్యకేసు పునర్విచారణ యోచనలో హైకోర్టు?

  Nov 13 | 2007 లో సంచలనం సృష్టించిన ఫార్మసి విద్యార్థి ఆయేషా మీరా అత్యాచారం, హత్య కేసు మళ్ళీ తెరపైకి వచ్చింది. విజయవాడ శివారు ఇబ్రహీంపట్నంలోని ఓ ప్రైవేటు హాస్టల్‌లో 2007 డిసెంబరులో ఆయేషామీరా హత్యాచారం చేయబడింది.... Read more

 • Shivraj singh chauhan s wife faces public ire while campainging

  ITEMVIDEOS: ప్రచారంలో పరాభవం.. సీఎం సతీమణికి కూడా తప్పలేదు..

  Nov 13 | ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో అటు జాతీయ పార్టీలు, ఇటు ప్రాంతీయ పార్టీల అభ్యర్థులు తమ ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. ఈ క్రమంలో రాజస్థాన్, చత్తీస్ గడ్, మధ్యప్రదేశ్, తెలంగాణల్లో అధికారంలో వున్న పార్టీల... Read more

Today on Telugu Wishesh