Modi greets Advani on birthday 91వ వసంతంలోకి బీజేపి అగ్రనేత అద్వానీ..

Pm narendra modi amit shah wish bjp patriarch lk advani on his birthday

Prime Minister of India, PM Modi, Birthday, Narendra Modi, Amit Shah, L. K. Advani, General Elections, Lok Sabha, Tripura CM swearing -in ceremony, PM Modi ignores Adwani, Twitter, Social Media, national politics

PM Modi and party president Amit Shah, greeted party veteran L K Advani on his 91st birthday, recalling his contribution to national politics, and also in building the party and propagating its ideology.

91వ వసంతంలోకి బీజేపి అగ్రనేత అద్వానీ.. ప్రశంసించిన ప్రధాని

Posted: 11/08/2018 09:02 PM IST
Pm narendra modi amit shah wish bjp patriarch lk advani on his birthday

బీజేపీ అగ్రనేత లాల్ కిషన్ అద్వానీని ఇవాళ 91వ పడిలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్రమమోదీ ఆయనను కలసి శుభాకాంక్షలు తెలిపారు. అద్వానీ 91వ పుట్టినరోజు సందర్భంగా ప్రధాని అగ్రనేత, కురువృద్ద నేత అయిన అద్వాని నివాసానికి వెళ్లిన.. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అద్వానీకి మోదీ ఓ పుష్పాన్ని బహూకరించారు. అనంతరం ఇద్దరూ కాసేపు సరదాగా మాట్లాడుకున్నారు. ఆ తరువాత బీజేపి జాబీయ అధ్యక్షుడు అమిత్ షా కూడా ఆయనకు శుబాకాంక్షలు తెలిపారు.

ఈ విషయంపై మోదీ తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందించారు. 'అద్వానీజీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు. దేశ నిర్మాణంలో ఆయన కృషి వెలకట్టలేనిది. ఒక మంత్రిగా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆయన తీసుకున్న నిర్ణయాలు అద్భుతం. ప్రజా సంక్షేమమే ఆయనకు పరమావధి. భారత రాజకీయాలపై అద్వానీ అంతులేని ప్రభావాన్ని చూపారు. ఏ మాత్రం స్వాలాభాపేక్ష లేకుండా బీజేపీని ఆయన నిర్మించిన విధానం, కార్యకర్తలను ప్రభావితం చేసిన తీరు అసాధారణం' అంటూ ట్వీట్ చేశారు.

అయితే ఇంతవరకు బాగానే వున్నా ఇది ప్రధాని మరో నాటకమని విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. త్రిపుర అసెంబ్లీ ఎన్నికలలో విజయాన్ని కైవసం చేసుకున్న బీజేపి అట్టహాసంగా ముఖ్యమంత్రి ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని కూడా చేపట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా అక్కడి విచ్చేసిన ప్రధాని నరేంద్రమోడీ.. అదే వేదికపైనున్న అగ్రనేత అద్వానీ అయనకు మర్యాద పూర్వకంగా నమస్కారం చేసినా.. ఆయన దానిని పట్టించుకకుండా వెళ్లిపోయారు. అయితే ఇప్పుడు మరో అరు మాసాల్లో మళ్లీ ఎన్నికలు వస్తున్నందున్న ఆయనకు మోదీ. షాలు నమస్కారాలు పెడుతున్నారన్న విమర్శలు వినబడుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Twitter  PM Modi  Amit Shah  L. K. Advani  Birthday  Lok Sabha Elections  Politics  

Other Articles