notes ban Scars more visible with time: Manmohan ఆ గాయాలు.. సమయంతో స్పష్టత: మన్మోహన్ సింగ్

Dark day financial scam oppn targets modi govt on 2 years of demonetization

demonetization, Narendra Modi, BJP, Congress, Rahul Gandhi, Manmohan Singh, Mamata Banerjee, Arvind Kejriwal, black money, corruption, fake currency, funding of terror activities, Politics

A slew of opposition leaders slammed the Narendra Modi government's economic policies on Wednesday as the nation marked the second anniversary of the NDA government's controversial decision to ban Rs 500- and Rs 1,000-denomination notes in 2016.

మోడీజీ.. భరతజాతికి క్షమాపణలు చెప్పండీ: రాహుల్

Posted: 11/08/2018 02:29 PM IST
Dark day financial scam oppn targets modi govt on 2 years of demonetization

భారత ప్రజాస్వామికి, ఆర్ధిక వ్యవస్థకు ఇవాళ చీకటి రోజు అని కాంగ్రెస్ విమర్శించింది. ఎన్డీయే నేతృత్వంలోని ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు అమలుచేసి నేటితో రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ మేరకు స్పందించింది. ‘‘ప్రధానమంత్రి నరేంద్రమోదీకి చెందిన కొందరు పెట్టుబడిదారీ మిత్రులు తప్ప దేశంలోని ప్రతి పౌరుడిపై నోట్లరద్దు ప్రభావం పడింది. నోట్లరద్దు నిర్ణయం తీసుకున్న రోజు మన దేశానికి, ఆర్ధిక వ్యవస్థకు చీకటి రోజు..’’ అని కాంగ్రెస్ పార్టీ తన అధికారిక ట్విటర్ ఖాతాలో పోస్టు చేసింది.
 
దేశంలోని అన్నివర్గాలకు చెందిన శ్రామికులు, కర్షకులు, చిరు వ్యాపారులు, ఈ నిర్ణయంతో ఆరు మాసాలకు పైగా రోడ్డున పడ్డారని అన్నారు. ఇక ఈ నిర్ణయం తీసుకున్న ప్రధాని.. పార్లమెంటులో మౌనం వహించి.. ప్రజల్లోకి వచ్చి.. మీ ఖాతాల్లో కొందరు సంపన్నులు డబ్బులు వేస్తారని కూడా అన్నారని, అయితే ఆశగా ఎదురుచూసిన సామాన్యుల అకౌంట్లలోని డబ్బు అంతే వుందని.. అది ఏమాత్రం పెరగలేదని కూడా విమర్శించారు. ప్రధాని నరేంద్రమోడీ అధికారంలోకి వచ్చే ముందు నల్లధనం తీసుకువచ్చి మీ ఖాతాల్లో వేస్తానని అన్నారు.

అది ఐదేళ్లు కావస్తున్నా ఇప్పటికీ నేరవేరలేదు.. నోట్ల రద్దు నేపథ్యంలో కొందరు వేస్తారన్న డబ్బులు కూడా ఇప్పటికీ రాలేదని రాహుల్ ఎద్దేవా చేశారు. అయితే ఈ విషయాలను ప్రజలు ఎప్పటికీ మర్చిపోరాదని రాహుల్ సూచించారు. కాగా నోట్ల రద్దు నిర్ణయానికి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇవాళ ‘బ్లాక్ డే’గా పాటించనున్నట్టు చెబుతున్నారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్ర, జిల్లా హెడ్ క్వార్టర్లలో ఈ నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాగా, దేశరాజధాని న్యూఢిల్లీలో మాత్రం సాయంత్రం క్యాండిల్ లైట్ మార్చ్ వుంటుందని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.

జంతర్ మంతర్ నుంచి ప్రారంభమయ్యే కాంగ్రెస్ నిరసన మార్చ్ అర్బీఐ ప్రధాన కార్యాలయం వరకు కొనసాగుతుంది. ఈ ర్యాలీలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా పాల్గోనే అవకాశాలున్నాయి. అయితే ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ఆయన కొంత బిజీగా వున్నట్లు కూడా సమాచారం. గతేడాది కూడా కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీలన్నీ దేశవ్యాప్తంగా నోట్లరద్దు నిర్ణయంపై నిరసన కార్యక్రమాలు చేపట్టిన సంగతి తెలిసిందే. 2016 నవంబర్ 8న కేంద్ర ప్రభుత్వం ఉన్నపళంగా రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసింది. రూ.500, రూ.2000 కొత్త నోట్లను ప్రవేశపెట్టింది.

మరో వైపు దేశ మాజీ ప్రధాని, ఆర్థిక నిపుణుడు మన్మోహన్ సింగ్ కూడా ప్రధాని నరేంద్రమోడీ నోట్ల రద్దు నిర్ణయంపై విమర్శలు గుప్పించారు. ఎన్డీయే ప్రభుత్వం తీసుకున్న వివాదాస్పద నోట్ల రద్దు నిర్ణయంతో తీసుకుని రెండేళ్లు గడుస్తుందని ఆయన దుయ్యబట్టారు. ఈ నిర్ణయం ఫలితాలు మున్ముందు దేశ అర్థిక విధానానికి చాలా లబ్దిని చేకూరుస్తాయని ఎన్డీయే ప్రభుత్వం చెప్పిందని, అయితే దేశ అర్థిక వ్యవస్థపై నోట్ల రద్దు గాయాలు కాలం గడుస్తున్న కొద్ది మానకపోగా మరింత స్పష్టంగా కనిపిస్తున్నాయని మన్మోహన్ సింగ్ దుయ్యబట్టారు.

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సైతం ట్విటర్‌ వేదికగా ఇదే తరహాలో స్పందించారు. ‘‘ఇవాళ చీకటి రోజు. నోట్లరద్దు విధ్వంసం జరిగి నేటితో రెండో ఏడాది. ఆ నిర్ణయం తీసుకున్న రోజు నుంచి నేను ఇది చెబుతూనే ఉన్నాను. ప్రముఖ ఆర్ధిక వేత్తలు, నిపుణులు మొదలు సాధారణ ప్రజలదాకా అంతా ఇప్పుడు దీన్ని అంగీకరిస్తున్నారు..’’ అని ఆమె పేర్కొన్నారు. అటు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా దీనిపై స్పందిస్తూ ఇది ఎన్డీయే ప్రభుత్వం సొంతంగా చేసుకున్న గాయంగా అభివర్ణించారు. అయితే ఈ గాయం భారత అర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందని, అధోగతికి తీసుకెళ్లిందని ఆయన విమర్శించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles