UK MP calls idea of building Statue of Unity 'nonsense’ భారత్ కు మన సాయం ఎందుకు.?

Outrage at india spending 330million on giant bronze statue

India, Narendra Modi, UK, statue of Unity, foreign aid, women’s rights, solar panels, low-carbon transport, Andrew Mitchell, International Development Secretary, Gujarat, Sardar Patel, Tory MP Peter Bone, international news

BRITONS are outraged after the Indian government spent hundreds of millions of pounds on a giant bronze statue while the Uk was sending £1.17billion in overseas aid to the country.

పటేల్ విగ్రహానికి రూ.3 వేల కోట్లా.? మన సాయమెందుకు.?

Posted: 11/06/2018 05:57 PM IST
Outrage at india spending 330million on giant bronze statue

కేంద్రప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించి అవిష్కరించిన భారత తొలి ఉప ప్రధాని, ఉక్కు మనిషి సర్ధార్ వల్లభబాయ్ పటేల్ క్యాంస విగ్రహాం ‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’ ఏర్పాటు చేయడం పట్ల దేశప్రజల్ల నుంచి ఎలాంటి అభ్యంతరాలు తలెత్తకపోయినా.. యూనైటెడ్ కింగ్ డమ్ నుంచి మాత్రం అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ విగ్రహ నిర్మాణానికి రూ.3 వేల కోట్లు ఖర్చు చేయడాన్ని బ్రిటన్ న్ చెందిన కన్జర్వేటివ్ పార్టీ ఎంపి పీటర్ బోన్ విమర్శలు గుప్పించారు.

ఇలాంటి ప్రాజెక్టులకు వేల కోట్ల రూపాయాలను భారత్ వెచ్చిస్తున్నప్పుడు, భారతదేశానికి ప్రత్యేక ప్రాజెక్టుల నిమిత్తం తమ దేశం నిధులు ఇవ్వాల్సిన అవసరం ఏముందని అమె ప్రశ్నించారు. భారత ప్రభుత్వం తమ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని విమర్శించారు. సరిగ్గా 2012లో భారత ప్రజల్లకు మేలు చేసే కార్యక్రమాలు చేపట్టేందుకు తమ దేశం అర్థిక సాయం అందిస్తుందని, అయితే అదే సమయంలో సరిగ్గా అప్పటి నుంచే గుజరాత్ ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా తాము పంపించే సాయంలోని సగం మొత్తాన్ని విగ్రహ ఏర్పాటుకు ఖర్చుచేసిందని అమె అరోపించారు.

మహిళా హక్కుల అభివృద్దితో పాటు సోలర్ పలకాలను వినియోగించి విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేసేందుకు, కాలుష్యపు కోరల్లో చిక్కకునే భారత నగరాల్లో అత్యల్ప కార్బన్ వెదజల్లే రవాణాను తీసుకువచ్చేందుకు పటిష్ట చర్యలు తీసుకునేందుకు యూకే ప్రభుత్వం దాదాపుగా 1.2 బిలియన్ పాండ్లను గత 2012 నుంచి అర్థికసాయంగా అందించింది. వీటితో పాటు గుజరాత్ లోని యువతలో మతపరమైన సహనం పెంపొందించడానికి ఈ నిధులను అర్థికసాయంగా అందించినట్టు చెప్పారు.

అయితే భారత్ మాత్రం వేల కోట్ల రూపాయలను విగ్రహాల కోసం వెచ్చించడంపై అమె తీవ్ర అసంతృప్తని వ్యక్తం చేశారు. ఇక యూకే అంతర్జాతీయ అభివృద్ది శాఖ మాజీ అండ్రూ మిచ్చెల్ భారత్ కు తమ సాయం 2015 వరకే అందిస్తామని అప్పట్లో ప్రకటించారని అమె ఊటంకించారు. అయితే అందుకు విరుద్దంగా యూకే ప్రభుత్వం మాత్రం ఇంకా సాయాన్ని అందిస్తుందని, గత ఏడాది కూడా సుమారుగా 96 వేల పాండ్ల అర్థిక సాయాన్ని అందించారని అమె తెలిపారు. విగ్రహ ఏర్పాటుకు వేల కోట్లు వెచ్చించే భారత్ కు మనం అర్థికసాయం అందించాల్సిన అవసరం ఏముందని అమె ప్రశ్నించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles