Ballari Shock For BJP In Karnataka Bypolls పరువు దక్కించుకునే ప్రయత్నంలో బీజేపి

Karnataka by poll results congress heads for big win in bjp stronghold of bellary

karnataka by election, Jamkhandi, ramanagaram, shimoga, mandya, Bellary, karnataka by poll result, karnataka assembly by election result, karnataka election result, karnataka by election 2018 results, karnataka by election 2018, bellari lok sabha seat, congress jds alliance, bjp, yeddyurappa, shimoga lok sabha seat, lok sabha bypoll, assembly bypoll, congress, JDs, Politics

The Indian National Congress is leading in Jamkhandi and Bellary while the JD(S) leads in Ramnagara and Mandya. The Bharatiya Janata Party (BJP), meanwhile, has taken a lead in Shimoga.

ఉపఎన్నికలలో కాంగ్రెస్-జేడీఎస్ జోరు.. పరువు దక్కించుకునే ప్రయత్నంలో కమలం

Posted: 11/06/2018 11:15 AM IST
Karnataka by poll results congress heads for big win in bjp stronghold of bellary

కర్ణాటకలో ఈ నెల మూడున మూడు లోక్‌సభ, రెండు శాసనసభ స్థానాలకు జరిగిన ఉప-ఎన్నికలలో కాంగ్రెస్ కూటమి తన జైత్రయాత్రను కోనసాగిస్తుంది. ఒక్కస్థానంలో ముందంజలో వున్న బీజేపి తన పరువు దక్కించుకునే ప్రయత్నంలో వుంది. ఈ నెల మూడున జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు ఇవాళ వెల్లడి కానున్నాయి. దీంతో ఉదయం 8గంటల నుంచే అధికారులు ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని చేపట్టారు. ఇప్పటికే రెండు అసెంబ్లీ నియోజకవర్గాల ఫలితాలు విడుదలయ్యాయి.

రామనగర అసెంబ్లీ స్థానం నుంచి ముఖ్యమంత్రి కుమారస్వామి సతీమణి, జేడీఎస్ అభ్యర్థి అనితా కుమారస్వామి ఘన విజయం సాధించారు. అమె ఎన్నిక లాంఛనమే అని ఈ నెల 1నే తేలిపోయింది. ఈ స్థానం నుంచి బీజేపీ పార్టీ తరఫున పోటీచేసిన అభ్యర్థి ఎల్ చంద్రశేఖర్ పోలింగ్ కు మూడు రోజుల ముందే ఆ పార్టీకి రాజీనామా చేసి తన మాతృపార్టీలో చేరారు. ఇక జమఖండిలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే సిద్దూ న్యామగౌడ తనయుడు కాంగ్రెస్ అభ్యర్థి ఆనంద్ ఎస్ న్యామగౌడ 50 వేలు ఓట్ల ఆధిక్యంలో గెలుపొందారు. ఆయన తన ప్రత్యర్థి బీజేపి అభ్యర్థి శ్రీకాంత్ కులకర్ణీపై ఘనవిజయాన్ని సాధించారు,

ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల ప్రకారం శివమొగ్గ లోకసభ స్థానంలో తప్పా మిగతా రెండు చోట్ల అధికార కాంగ్రెస్- జేడీఎస్ కూటమి అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. బీజేపీకి కంచుకోటలా భావించే బళ్లారిలో కాంగ్రెస్ అభ్యర్థి వీఎస్ ఉగ్రప్ప 1.5 లక్షల పైచిలుక ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. గతంలో ఈ స్థానం నుంచి గెలుపొందిన బీజేపీ నేత శ్రీరాములు, కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీల రికార్డులు మొత్తం ఈసారి బ్రేక్ అయ్యాయి.

ఇక, మాండ్య పార్లమెంటు స్థానంలో జేడీఎస్ అభ్యర్థి ఎల్‌ఆర్ శివరామ గౌడ సమీప ప్రత్యర్థి బీజేపీకి చెందిన సిద్ధరామయ్యపై దాదాపు 2.5 లక్షల ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇప్పటి వరకు ఈ స్థానంలో అత్యధిక మెజార్టీ 1.24 లక్షలు కాగా ప్రస్తుతం దాన్ని శివరామ గౌడ అధిగమించారు. కాంగ్రెస్ నేత, నటుడు అంబరీష్ 2004 ఎన్నికల్లో ఇక్కడ నుంచి 1,24, 438 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. ప్రస్తుతం దీనికి రెండింతలు మెజార్టీతో జేడీఎస్ అభ్యర్థి దూసుకుపోతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : karnataka by-polls  Jamkhandi  ramanagaram  shimoga  mandya  Bellary  congress  JDs  Politics  

Other Articles