Yadadri district heraldry goes viral on net నెట్టింట్లో వైరల్ గా మారిన యాదాద్రి జిల్లా దండోరా..

Telangana elections yadadri district heraldry goes viral on net

telangana goverment, Yadadri district, heraldry, Erra Krishna Reddy, Mohan Reddy, eddlakadi venkataiah, Erra Rajender reddy, Rs 300. party meeting, police case on leader, Telangana, Politics

In view of Telangana Assembly elections, a heraldry in Yadadri district makes police to file cases on the leader krishna reddy of lingarajupally, after the opposition party leaders filmed the heraldry video and posted it on on social media.

నెట్టింట్లో వైరల్ గా మారిన యాదాద్రి జిల్లా దండోరా..

Posted: 11/06/2018 10:25 AM IST
Telangana elections yadadri district heraldry goes viral on net

తెలంగాణలోని ఇంకా అనేక గ్రామాలో ఇంకా చాటింపు పద్దతి అమల్లో వుంది. శాస్త్ర సాంకేతిక రంగాలు ఎంతగా అభివృద్ది చెందినా.. అవి పట్టణాలకే పరిమితం అవుతున్నాయి. అయితే గ్రామాలకు చేరినా అతి తక్కువ మంది మాత్రమే వీటిని సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇలా యాదాద్రి జిల్లాలోని ఓ గ్రామంలో వేసిన చాటింపు సోషల్ మీడియాలో సంచలనం సృష్టించడమే కాదు.. గ్రామంలోని ఓ ముగ్గురు వ్యక్తులపై కూడా పోలీసు కేసులు నమోదు కావడానికి కారణమయ్యింది.

అదెలా అంటే ఓ పార్టీ పెట్టనున్న సమావేశానికి వస్తే రూ. 300 ఇస్తారని టముకు వేయించి ప్రచారం చేస్తుండటం, దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టగా, అది వైరల్ కావడంతో అధికారులు చర్యలు తీసుకున్నారు. మరిన్ని వివరాల్లోకి వెళితే, యాదాద్రి జిల్లా ఆత్మకూరు(ఎం) మండలం లింగరాజుపల్లి గ్రామంలో, "యాదగిరి గుట్టలో జరిగే మీటింగ్‌ కు వస్తే 300 రూపాయలు ఇస్తారంటహో.." అంటూ లింగరాజుపల్లి గ్రామంలో వేసిన దండోరా.. అతనికి శాపంగా పరిణమించింది.

గ్రామంలోని ఎడ్లకాడి వెంకటయ్య అనే వృద్దుడు దండోరా వేస్తూంటాడు. ఎప్పటిలాగానే గ్రామంలోని రేషన్ దుకాణంలో నిత్యావసర సరుకులు వచ్చాయని అతడు చాటింపు వేసి వెళ్తున్న సమయంలో అతనికి ఎదురుగా వచ్చిన ఎర్ర కృష్ణారెడ్డి తండ్రి మోహన్‌ రెడ్డి వచ్చి, యాదగిరిగుట్టలో తమ మీటింగ్ కు వస్తే, రూ.300 ఇస్తామని దండోరా వేయమని చెప్పాడు. అందుకుగాను డబ్బును కూడా చేతిలో పెట్టాడు. దీంతో చాటింపు వేస్తున్నాననే అనుకున్న వెంకటయ్య.. అమాయకంగా ఆదే విషయాన్ని గ్రామంలో దండోరా వేయించాడు.

ఓటర్లను ప్రలోభ పెడుతున్నారన్న విషయాన్ని గ్రహించడంతో పాటు.. ఇలా బహిరంగంగా చాటింపు వేసి మరీ గ్రామస్థులను మీటింగ్ కు రావాలని కోరడం నేరమని టముకు వేసిన చెప్పిన విషయాన్ని రాజేందర్ రెడ్డి భావించాడు. వెంటనే వెంకటయ్యను పిలిచి.. తాను వేస్తున్న చాటింపును మరోసారి చెప్పాలని కోరి.. దానిని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. అదికాస్తా వైరల్ కావడంతో రంగంలోకి దిగిన తహసీల్దార్ జ్యోతి వెంకటయ్యను విచారించి, అతని వాంగ్మూలాన్ని నమోదు చేశారు. దీంతో మీటింగ్‌ కు వస్తే డబ్బులిస్తామని దండోరా వేయించిన కృష్ణారెడ్డి, చాటింపు వేసిన వెంకటయ్య, సెల్‌ ఫోన్‌ లో రికార్డు చేసిన రాజేందర్‌ రెడ్డిపై కేసులు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles