revuri prakash reddy says harish rao becomes cm హరీష్ రావుపై రేవూరి సంచలన వ్యాఖ్యలు

Revuri prakash reddy alleges harish rao is abasement in trs

harish rao, kcr, vanteru pratap reddy, gajwel, revuri prakash reddy, telangana, congress, mahakutami, trs, bjp, telangana elections 2018, telangana assembly elections 2018, early elections, early polls, d srinivas, chandrababu naidu, Telangana politics

Telangana Telugudesam Party leader Revuri Prakash Reddy on Monday said that Harish Rao will become cheif minister of Telangana if Mahakutami and TRS will get equal seats.

టీఆర్ఎస్ లో అంతర్యుధ్దం జరుగుతుందన్న రేవూరి

Posted: 11/05/2018 06:13 PM IST
Revuri prakash reddy alleges harish rao is abasement in trs

తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్ లో అంతర్యుద్ధం జరుగుతోందని తెలుగుదేశం పార్టీ నేత రేవూరి ప్రకాశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ పార్టీలో హరీష్ రావు అసలు సిసలైన రాజకీయ నాయకుడు అని ఆయన ప్రశంసించారు. ఆయన ఆ పార్టీలో అసలు ఇమడలేకపోతున్నారని చెప్పారు. టీఆర్ఎస్ పార్టీ అవిర్భావం నుంచి జెండాలు పట్టుకుని తిరిగిన హరీష్ రావుకు ఇప్పుడదే పార్టీలో పరాభవాలు ఎదురవుతున్నాయని అన్నారు.

కేసీఆర్ అభధ్రతా భావంలో ఉన్నారని.. తన కొడుకు, కూతురులకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడంతో పార్టీలో అంతర్గతంగా నాయకుల మధ్య కూడా చీలికలు వచ్చి వర్గాలుగా విడిపోయాయని అన్నారు. ఇవాళ కాకపోతే రేపైనా టీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ వర్గం, హరీష్ రావు వర్గాలుగా చీలిపోవడం గ్యారంటీ అని జోస్యం చెప్పారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి బతికివుండివుంటే ఈ పాటికి హరీస్ రావు కాంగ్రెస్ పార్టీలో చేరేవారని రేవూరి ఊటంకించారు. హరీష్ రావు ఇప్పటికి కూడా సరైన సమయం కోసం వేచిచూస్తున్నారని అన్నారు.

ఇదే సమయంలో రేవూరి ప్రకాష్ రెడ్డి హరీష్ రావు ముఖ్యమంత్రి కూడా కావచ్చునంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్, ప్రజాకూటమికి సమానంగా సీట్లు వస్తే అందులో (టీఆర్ఎస్) కొందరిని తీసుకొని వచ్చి హరీష్ రావు ముఖ్యమంత్రి అవుతాడని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ పార్టీలో అవమానం జరుగుతున్నప్పటికీ విధిలేని కారణంగానే హరీష్ అందులో కొనసాగుతున్నారని చెప్పారు. అయితే పార్టీలో కోనసాగుతున్న అంతర్యుద్ధం కారణంగా ఆయన ఎప్పుడైనా బయటకు రావొచ్చునని రేవూరి అభిప్రాయపడ్డారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : harish rao  revuri prakash reddy  TDP  TRS  MahaKutami  Telangana  politics  

Other Articles