Sabarimala Temple gates to reopen today శబరిమల పరిసరాల్లో ఆంక్షలు.. తెరుచుకోనున్న ఆలయ ద్వారాలు

Amid heavy security sabarimala temple gates to reopen today

sabarimala temple, Ayyappa swamy temple, VHP rally, save sabarimala rally, Pamba river, chithra aatta vishesham, sabarimala temple case, sabarimala temple issue, sabarimala temple darshan, sabarimala temple verdict, sabarimala temple news, sabarimala temple kerala, pinarayi vijayan, bharatiya janata party, congress, Supreme court, violent protests, women reporters

Amid tightened security, the gates for the Sabarimala Temple will open for public today evening at 5 pm for a two-day ritual, just weeks after the hill shrine witnessed violent protests by devotees not to allow women of menstruating age.

శబరిమల పరిసరాల్లో ఆంక్షలు.. తెరుచుకోనున్న ఆలయ ద్వారాలు

Posted: 11/05/2018 12:28 PM IST
Amid heavy security sabarimala temple gates to reopen today

శబరిమల ఆలయ ద్వారాలు ఇవాళ సాయంత్రం మరోమారు రెండు రోజుల పాటు తెరచుకోనున్నాయి. ఈ నేపథ్యంలో శబరిమల సహా 30 కిలోమీటర్ల పరిధిలో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. అంతేకాదు ఆయా ప్రాంతంలో పోలీసులు పలు అంక్షలను విధించారు. ఈ క్రమంలో పంబ సహా పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ ను అమలు చేయనున్నారు. ఇవాళ ‘చితిర అట్ట విశేషం’ సందర్భంగా అయ్యప్ప ఆలయాన్ని సాయంత్రం 5 గంటల నుంచి 10 గంటల వరకు భక్తులను అయ్యప్ప దర్శనానికి అనుమతించనున్నారు.

అయితే ఆలయంలోకి మహిళల ప్రవేశానికి అనుమతిస్తూ దేశసర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో.. అందుకు వ్యతిరేకంగా సేవ్ శబరిమల అన్న నినాదంతో స్థానికులు మహిళల శబరిమల ప్రవేశాన్ని అడ్డుకుంటున్నారు. ఇందుకు కేరళ ప్రభుత్వం సమ్మతం తెలిపడంతో భక్తులే తమ ఆలయ ఆచారాలను కాపాడాలని నినదిస్తూ.. మహిళల ప్రవేశాన్ని అడ్డుకుంటున్నారు. ఈ క్రమంలో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేయడంతో పాటు పలు స్థానికంగా 144సెక్షన్ అమలు చేస్తున్నారు.

ఈ క్రమంలో హిందూ సంఘాలు, ఆలయ బోర్డు, సేవ్ శబరిమల సంఘాలు.. ఇటీవల పెద్దఎత్తున నిరసనలు తెలిపి.. మహిళల ఆలయ దర్శనాన్ని అడ్డుకున్నారు. దీంతో 10 - 50 సంవత్సరాల మధ్య వున్న మహిళా భక్తులు ఎవరూ ఇప్పటి వరకు ఆలయ ప్రవేశం చేయలేదు. పెద్ద సంఖ్యలో పంబ నుంచి శబరిమల వరకు అన్ని మార్గాల్లో తమ నిరసన తెలుపుతున్న భక్తులు.. పోలీసులను, మహిళా జర్నలిస్టులను కూడా అడ్డుకోవడంతో వారి అందోళన హింసాత్మకంగా మారింది. ఈ క్రమంలో అందోళనకారులపై పోలీసులు లాఠీ చార్జీ కూడా చేశారు. వందల మందిపై కేసులు నమోదు చేశారు.

కాగా తాజాగా మరోమారు ఆలయ ద్వారాలు రెండురోజుల పాటు తెరుచుకోనున్న నేపథ్యంలో అందోళనకారులు మహిళా భక్తులే కాదు మహిళా జర్నలిస్టులకు కూడా ఆలయంలోకి ప్రవేశించడానికి అనుమతించమని స్పష్టం చేస్తున్నారు. నిరసనకారుల హెచ్చరికల నేపథ్యంలో పోలీసులు ఆలయ పరిసర ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. శబరిమల, పంబ, నెలిక్కళ్‌, ఇలౌంగళ్‌ ప్రాంతాల్లో బలగాలను మోహరించారు. ఇద్దరు ఐజీలు, 10 మంది ఎస్పీలు, 2,300 మంది పోలీసులు ఆ ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. సుప్రీంతీర్పుకు పోలీసులు కట్టుబడి ఉంటారని, భద్రత కల్పించమని ఎవరైనా మహిళలు కోరితే వారికి తప్పనిసరిగా రక్షణ కల్పిస్తామని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles