gangrape threat by BJP supporter: Congress worker వాళ్లు గ్యాంగ్ రేప్ చేస్తారట: బీజేపిపై కాంగ్రెస్ నేత అరోపణలు

Bjp supporters threatened me with gang rape murder claims congress worker

#MeToo India, #MeToo, Bharatiya Janata Party, goa, Goa Pradesh Mahila Congress, goa congress news, shiroda, siroda, shiroda news, subhash shirodkar news, diya shetkar news, indian national congress, Shiroda assembly constituency, sexual harrassment, politics

Congress worker Diya Shetkar has accused BJP leader Subhash Shirodkar’s supporters of threatening her with gang-rape if she campaigned against Shirodkar in his constituency

గ్యాంగ్ రేప్ చేస్తామంటూ బీజేపి బెదిరింపులు: కాంగ్రెస్ మహిళా నేత

Posted: 11/05/2018 11:37 AM IST
Bjp supporters threatened me with gang rape murder claims congress worker

ఓ వైపు కేంద్ర మాజీ మంత్రి ఎంజే అక్బర్ పై లైంగిక దాడుల అరోపణల నేపథ్యంలో ఆయన తన పదవినే కోల్పగా. తాజాగా ఉత్తర్ ఖండ్ బీజేపి ప్రధాన కార్యదర్శి సంజయ్ కుమార్ పై కూడా ఇలాంటి అరోపణలే వ్యక్తం కావడంతో స్పందించిన బీజేపి పార్టీ అదిష్టానం అతన్ని పదవి నుంచి తప్పించి నష్ట నివారణ చర్యలు తీసుకున్న తరుణంలో.. గోవాలోని ఓ మహిళా కాంగ్రెస్ నేతను గ్యాంగ్ రేప్ చేస్తామంటూ బీజేపీ నేత అనుచరులు బెదిరించారన్న వార్త ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.

ఇప్పటికే ఉత్తరాదిలోని బీజేపి నేతలు మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసి విమర్శలను ఎదర్కోన్న ఘటనలు వున్నాయి. ఏకంగా మహిళలకు అర్థరాత్రిళ్లు రోడ్డుపైకి రావడానికి ఎం పని అంటూ కూడా వ్యాఖ్యలు చేశారు. ఏకంగా ప్రభుత్వ అధికారుల తనయలకే బీజేపి నేతల కుమారుల నుంచి వేధింపులు ఎదురయ్యాయి. ఈ క్రమంలో తాజాగా కాంగ్రెస్ మహిళా నేతను ప్రచారానికి రావద్దని.. వస్తే గ్యాంగ్ రేప్ చేస్తామని బెదిరించిన వార్త కలకలం రేపుతుంది.

గోవా కాంగ్రెస్ మహిళా నేత దియా షేట్కర్ ఈ మేరకు సంచలన ఆరోపణలు చేశారు. సుభాష్ శిరోద్కర్ అనుచరుల నుంచి తనకు బెదిరింపులు వస్తున్నాయని అమె అరోపించడంతో పాటు ఈ మేరకు అమె పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. సుభాష్ కు వ్యతిరేకంగా తాను ప్రచారం చేస్తున్నానని, వెంటనే తాను ఆగిపోకుంటే రేప్ చేస్తామని ఆయన అనుచరులు బెదిరింపులకు దిగుతున్నారని గోవా ప్రదేశ్ మహిళా కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న దియా, ఫిర్యాదు చేసింది.

ఫోన్ చేసిన వ్యక్తి అసభ్య పదజాలంతో.. చెప్పలేని భాషను వాడారని అమె వాపోయారు. కాంగ్రెస్ కు చెందిన సుభాస్ శిరోద్కర్ ఇటీవల తన పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న శిరోడా అసెంబ్లీ నియోజకవర్గానికి ఎన్నికలు రానున్నాయి. ఈ నేపథ్యంలో తనకు ఫోన్ చేసిన అగంతకుడు.. తనను శిరోడా నియోజకవర్గంలోకి అడుగుపెట్టరాదని అదేశించాడాని అమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కోన్నారు. తాను నియోజకవర్గంలో అడుగుపెడితే సామూహిక అత్యాచారం చేస్తామని, తమ బెదిరింపులను లెక్కబెట్టకపోతే హత్య చేయడానికి కూడా వెనుకాబోమని బెదిరించారని అమె పిర్యాదులో పేర్కోన్నారు.

ఓ మహిళను ఎదుర్కోలేక, బీజేపి నేత అనుచరులు దిగజారిపోయి.. తనను అత్యాచారం చేస్తామని, హత్య చేస్తామని బెదిరించడమేంటని ఆమె ప్రశించారు. తన ఫిర్యాదును పోలీసులు తీవ్రంగా పరిగణించాలని ఆమె డిమాండ్ చేశారు. దియా ఫిర్యాదుతో గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేసిన పోలీసులు, విచారణ ప్రారంభించారు. కాగా, గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న శిరోద్కర్, బీజేపీలో చేరాగానే అతని దిష్టిబోమ్మను కాల్చి రాజకీయంగా పైచేయి సాధించింది కూడా దియా షట్కర్ కు బెదిరింపులు రావడం గోవాలోని శిరోడాలో కలకలం రేపుతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Subhash Shirodkar  Diya Shetkar  Mahila Congress  Gangrape Threat  Shiroda  Goa  politics  

Other Articles

 • Demolition of praja vedika

  ప్రజావేదిక కూల్చివేత...

  Jun 26 | ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించినట్లే అక్రమ నిర్మాణాల కూల్చివేత ఉండవల్లిలోని ప్రజావేదిక నుంచే మొదలైంది. ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు అధికారంలో ఉండగా ఉండవల్లిలో కృష్ణా నది కరకట్టపై అక్రమంగా నిర్మించిన ప్రజావేదికను కూల్చివేయాలని కలెక్టర్ల... Read more

 • Netizens trolls on ongole gang rape case

  ఒంగోలులో దారుణం.. రేప్ చేసినోడిని చంపేయాలని చెప్పి తానే రేప్ చేశాడు

  Jun 24 | ఒంగోలులో 16ఏళ్ల బాలికను ఐదు రోజుల పాటు నిర్బంధించి సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటనలో నిందితుడైన వికలాంగ యువకుడు బాజీపై నెటిజన్లు మండిపడుతున్నారు. గతవారం తెలంగాణలోని హన్మకొండలో 9నెలల చిన్నారిపై హత్యాచారం ఘటనను నిరసిస్తూ... Read more

 • Kia unveils seltos in india packs it with premium features

  అనంతపురం కియా మోటార్స్ నుంచి తొలి ఎస్.యూ.వీ

  Jun 20 | సౌత్ కొరియాకు చెందిన ఆటోమొబైల్ దిగ్గజం కియా కంపెనీకి సంబంధించి సెల్టోస్ ఎస్‌యూవీని ఇవాళ(20 జూన్ 2019) ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనుంది. ఈ మేరకు ఇప్పటికే కియా మోటార్ భారతీయ మార్కెట్‌తో పాటు విడుదల... Read more

 • Telugu content

  రాంగ్ పార్కింగ్ వాహనదారులకు ఇకపై షాక్..!

  Jun 20 | మీరు ఇష్టమొచ్చినట్లు పార్కింగ్ చేస్తున్నారా ? అయితే జేబుకు చిల్లు పడినట్లే. ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా..నో పార్కింగ్ జోన్‌లో వాహనాలను పార్కింగ్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోనుంది. రూ. 10 వేల... Read more

 • Rbi panel suggests doubling mudra loan ceiling for msmes to rs20 lakh

  ఇక వారికి రూ.20లక్షల వరకు పూచికత్తు లేని రుణం.!

  Jun 20 | పూచీకత్తు లేకుండా రూ. 10 లక్షల వరకు ఉన్న రుణాన్ని రూ. 20 లక్షలకు పెంచాలని భారతీయ రిజర్వు బ్యాంకు నిపుణుల కమిటీ సిఫార్సు చేస్తోంది. కమిటీ చేసిన ఈ సిఫార్సుకు గ్రీన్ సిగ్నల్... Read more

Today on Telugu Wishesh