RBI Chief Served Notice For Not Disclosing Wilful Defaulters' List డీఫాల్టర్ల జాబితా బయట్టపెట్టడంపై కేంద్రం అగ్రహం..

Rbi governor urjit patel gets cic notice over wilful defaulters list

RBI governor, CIC, Urjit Patel, Central Information Commission, Raghuram Rajan, Arun Jaitley, PMO, Union Government, Supreme court, finance ministry

The CIC has asked RBI governor Urijit Patel to explain why a maximum penalty should not be imposed on him for “dishonouring” the apex court verdict, which had upheld a decision taken by then information commissioner Shailesh Gandhi, calling for disclosure of names of wilful defaulters.

రిజర్వు బ్యాంకు గవర్నర్ కు సిఐసి నోటీసులు

Posted: 11/05/2018 10:07 AM IST
Rbi governor urjit patel gets cic notice over wilful defaulters list

రిజర్వు బ్యాంకు గవర్నర్ ఉర్జిత్ పటేల్ ను దేశ అర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే సమర్థుడంటూ అఘమేఘాల మీద తీసుకువచ్చిన కేంద్రం తాజా పరిణామాల నేపథ్యంలో ఆయనపై ముప్పేటదాడికి దిగుతున్న క్రమంలో ఇటు కేంద్ర ప్రభుత్వానికి.. అటు అర్బీఐకి మధ్య అంతరం మరింత పెరుగుతుంది. బ్యాంకు రుణాలు ఎగ్గోట్టిన వారి వివరాలను ఎందుకు బయటపెట్టాల్సి వచ్చిందో తెలియజేయాలని కేంద్రప్రభుత్వం నోటీసులు జారీ చేయడమే ఇందుకు కారణంగా నిలుస్తుంది.

బ్యాంకుల నుంచి రూ. 50 కోట్లకు మించి రుణాలను తీసుకుని, ఉద్దేశ పూర్వకంగా వాటిని ఎగ్గొట్టిన వారి వివరాలను బహిర్గతం చేయాలని దేశసర్వోన్నత సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా ఆర్బీఐ ఈ జాబితాను విడుదల చేసింది. ఈ క్రమంలో తాను సుప్రీం ఆదేశాల ప్రకారం నడుచుకుంటే కేంద్రం ఇప్పుడు తమను నిందిస్తుండటం ఏంటని అర్బీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు.

అంతేకాదు మెండి బకాయిలపై అర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ రాసిన లేఖను కూడా బయటపెట్టాలని ప్రధానమంత్రి కార్యాలయం, అర్థిక మంత్రిత్వశాఖలు అర్బీఐని డిమాండ్ చేయడంతో ఉర్జిత్ పటేల్ కేంద్రం నుంచి ముప్పేటదాడిని ఎదుర్కోంటున్నారు. ఇప్పటికే కేంద్రం పెత్తనం నేపథ్యంలో రాజీనామా చేయాలని యోచనలోకి వచ్చిన అర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్.. కేంద్రం అర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో జరిగిన చర్చల నేపథ్యంలో ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నారని కూడా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

కాగా, బ్యాంకుల నుంచి రూ.50 కోట్లు ఆ పైన రుణాలను పొందిన ఉద్దేశపూర్వక ఎగవేతదారుల జాబితాను ఎందుకు బహిర్గతం చేయలేదని కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ) ఆగ్రహం వ్యక్తం చేస్తూ షోకాజ్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. రూ. 50 కోట్లు అంతకుమించి రుణాలు తీసుకుని ఉద్దేశపూర్వకంగా ఎగవేసిన వారి పేర్లను వెల్లడించాల్సిందేనని 2015లో సుప్రీంకోర్టు తీర్పు చెప్పినా.. వారి పేర్లు వెల్లడించేందుకు నిరాకరించడాన్ని తప్పుబట్టింది.

రుణాలు ఎగవేతదారుల పేర్లు ఎందుకు వెల్లడించలేదో  ఈ నెల 16లోగా సమాధానం చెప్పాలంటూ సీఐసీ కమిషనర్ శ్రీధర్ ఆచార్యులు షోకాజ్ నోటీసు జారీ చేశారు. ఈ కేసులో ఆర్బీఐ గవర్నర్‌నే ప్రధాన సమాచార అధికారిగా భావించాల్సి ఉంటుందని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం పేర్లను వెల్లడించడంలో విఫలమయ్యారని నోటీసుల్లో పేర్కొన్నారు. ఇందుకు గాను జరిమానా ఎందుకు విధించకూడదో 16లోగా చెప్పాలని ఆదేశించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : RBI governor  CIC  Urjit Patel  Central Information Commission  Raghuram Rajan  

Other Articles