know about flying with babies విమాన సిబ్బంది తలపోగరు దించేసిన ప్రయాణికురాలు

United airlines apologised facebook employee with full refund

Krupa Patel Bala, 8-months baby, Sydney to San Francisco, Facebook, apology, United Airlines, Social media, travel, vacation, navigator

United was ready with an apology and a full refund at San Francisco, to Facebook employee Krupa Patel Bala for their crew member confrontation for baby crying.

విమాన సిబ్బంది తలపొగరు దించేసిన ప్రయాణికురాలు

Posted: 11/02/2018 04:54 PM IST
United airlines apologised facebook employee with full refund

విమాన సిబ్బంది సూటిపోటి మాటలు, చిత్కారాలను పరాభవంగా భావించిన ఆమె ఒక్క దెబ్బతో దించేసింది. తమ గమ్యస్థానానికి చేరుకునే సరికి విమాన సంస్థ ఉన్నతాధికారులు ఆమెకు కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు చెప్పడంతో పాటు అమెకు ప్రయాణచార్జీలను పూర్తిగా వెనక్కు ఇచ్చేశారు. ఔనా.. విమాన సంస్థలు ఇంతవేగంగా స్పందించి.. ఇలాంటి నిర్ణయాలు కూడా తీసుకుంటాయా.? అన్న అనుమానాలు తెలత్తేట్లు చేస్తుంది ఈ ఘటన.

ఎనిమిది నెలల బిడ్డ, భర్తతో కలిసి, బిజినెస్ క్లాస్ లో సిడ్నీ నుంచి శాన్ ఫ్రాన్సిస్కో బయలుదేరిన ఓ ఉద్యోగినికి విమానంలో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. విమానంలోని ఆన్ బోర్డ్ ఇంటర్నెట్ సాయంతో, తాను పడుతున్న ఇబ్బందిని చెబుతూ, సిబ్బంది వైఖరిని ప్రశ్నిస్తూ, ఆ తల్లి ఓ పోస్టు పెట్టగా, దానిపై విపరీతమైన స్పందన వచ్చింది. విమానం శాన్ ఫ్రాన్సిస్కో చేరే సమయానికి ఎయిర్ లైన్స్ ఉన్నాతాధికారులు క్షమాపణలతో సిద్దంగా వున్నారు. ఇలా ఎందుకు జరిగింది.? అన్న వివరాల్లోకి వెళ్తే..

యునైటెడ్ ఎయిర్ లైన్స్ లో తన భర్త, బిడ్డతో శాన్ ఫ్రాన్సిస్కో బయలుదేరిన ఫేస్ బుక్ ఉద్యోగిని కృపా పటేల్ బాలా, బిజినెస్ క్లాస్ లో ప్రయాణించారు. ఆమెకు ఎనిమిది నెలల బిడ్డ ఉండగా, విమానం బయలుదేరిన కాసేపటికే బిడ్డ ఏడుపు లంఘించుకున్నాడు. దీంతో ఇతర ప్రయాణికులకు ఇబ్బంది కలుగుతుందని, బిడ్డ ఏడవటాన్ని తాము అంగీకరించబోమని సిబ్బంది తెగేసి చెప్పారు. విమానంలో ఐదు నిమిషాలకు మించి బిడ్డలు ఏడవ కూడదన్న రూల్ ఉందని విసుక్కున్నారు. కృపా పటేల్ ఎంతగా సముదాయించినా, చాలా సేపటి వరకూ బిడ్డ ఏడుపు ఆపలేదు. దీంతో సిబ్బంది ఆమెపై నానాయాగీ చేశారు.

తనకు ఎదురైన అనుభవాన్ని ఆమె, విమానంలో నుంచే, ఫేస్ బుక్ లో పోస్టు చేసింది. ఆమె పోస్టు వేలకొద్దీ షేర్లను తెచ్చుకోవడంతో, యునైటెడ్ ఎయిర్ లైన్స్ యాజమాన్యం స్పందించింది. విమానం నుంచి ఆమె దిగేసరికి ఎయిర్ లైన్స్ ఉన్నతాధికారులు, ఆ దంపతులకు క్షమాపణలు చెబుతూ, ప్రయాణం నిమిత్తం వారు చెల్లించిన పూర్తి డబ్బును వెనక్కు ఇస్తామని ఆఫర్ చేశారు. కృపా పటేల్ మాదిరిగానే తాము విమానంలో చిన్నారులతో ఎన్నో ఇబ్బందులు పడ్డామని పలువురు తమ అనుభవాలను వెల్లడిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Krupa Patel Bala  8-months baby  Sydney  San Francisco  Facebook  apology  United Airlines  

Other Articles